అమల్లోకి కనీస వేతనాల చట్టం

జాతీయ స్థాయిలో 50 కోట్ల మందికి కనీస వేతనం అందేలా కేంద్రప్రభత్వం తీసుకొచ్చిన ‘వేతనాల చట్టం- 2019’ అమల్లోకి వచ్చింది.
ఈ మేరకు ఆగస్టు 23న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ చట్టం ప్రకారం వర్తక సంఘాలు, ఉద్యోగులు, రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో వేతనాలు నిర్ణయమవుతాయి. కనీస వేతనాల చట్టం, వేతన చెల్లింపు చట్టం, బోనస్ చెల్లింపు చట్టం, సమాన ప్రతిఫలం చట్టం స్థానంలో వేతనాల కోడ్ -2019 అమల్లోకి వచ్చింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అమల్లోకి వేతనాల చట్టం- 2019
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : కేంద్ర ప్రభుత్వం



#Tags