ఆలయాల పునః నిర్మాణానికి శంకుస్థాపన
కృష్ణా జిల్లా విజయవాడలో గతంలో కూల్చి వేసిన తొమ్మిది ఆలయాల పునః నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 9న శంకుస్థాపన చేసింది.
ఇందుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ చేశారు. దీంతో పాటు ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న శ్రీదుర్గ మల్లేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణకు రూ.77 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టనున్న 8 పనులకూ భూమి పూజ నిర్వహించారు. ప్రకాశం బ్యారేజీ సమీపంలో దాదాపు రూ.1.79 కోట్లతో తొమ్మిది ఆలయాలను పునః నిర్మిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు...
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జనవరి 8న షెడ్యూల్ జారీ చేశారు. 2021, జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 మధ్య నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని నిమ్మగడ్డ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తొమ్మిది ఆలయాల పునః నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, కృష్ణా జిల్లా

#Tags