అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి విజేతగా బొటాస్
అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తేరి బొటాస్ విజేతగా నిలిచాడు.
అజర్‌బైజాన్ రాజధాని బాకులో ఏప్రిల్28న జరిగిన ఈ రేసులో బొటాస్ 51 ల్యాప్‌ల దూరాన్ని గంటా 31 నిమిషాల 52.942 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన హామిల్టన్ రెండో స్థానాన్ని సంపాదించాడు. దీంతో 2019లో జరిగిన తొలి నాలుగు రేసుల్లోనూ తొలి రెండు స్థానాలు మెర్సిడెస్ జట్టు డ్రైవర్లకే వచ్చాయి. 1992లో విలియమ్స్ జట్టు సీజన్‌లోని తొలి మూడు రేసుల్లో ఈ ఘనత సాధించింది. తాజా రేసుతో మెర్సిడెస్ ఈ రికార్డును సవరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి విజేత
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తేరి బొటాస్
ఎక్కడ : బాకు, అజర్‌బైజాన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి విజేత
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తేరి బొటాస్
ఎక్కడ : బాకు, అజర్‌బైజాన్
#Tags