ఐసీసీ వరల్డ్‌కప్ జట్టులో పూనమ్ యాదవ్

మహిళల టి20 ప్రపంచ కప్-2020 ప్రదర్శన ఆధారంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన జట్టులో భారత లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్‌కు చోటు దక్కింది.
భారత జట్టు ఫైనల్‌కు చేరినా... పూనమ్ మినహా మరెవరికీ ఈ టీమ్‌లో చోటు లేదు. మాజీ క్రికెటర్లు ఇయాన్ బిషప్, లిసా స్తాలేకర్, అంజుమ్ చోప్రా తదితరులతో కూడిన ప్యానెల్ ఈ టీమ్‌ను ఎంపిక చేసింది. చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా నుంచి ఐదుగురు, ఇంగ్లండ్ నుంచి నలుగురు ఐసీసీ జట్టులో ఉన్నారు.

ఐసీసీ ఉమెన్స్‌ వరల్డ్ కప్ టి20 ప్లేయింగ్ ఎలెవన్: మెగ్ లానింగ్ (కెప్టెన్), అలీసా హీలీ, బెత్ మూనీ, జెస్ జొనాసెన్, మెగాన్ షూట్ (ఆస్ట్రేలియా), నాట్ సివెర్, హెథర్ నైట్, సోఫీ ఎకెల్‌స్టోన్, అన్య షబ్‌స్రోల్ (ఇంగ్లండ్), లారా వోల్‌వార్ట్ (దక్షిణాఫ్రికా), పూనమ్ యాదవ్ (భారత్); 12వ ప్లేయర్ షఫాలీ వర్మ (భారత్).
#Tags