4.5 శాతంగా దేశ వృద్ధి రేటు : ఎన్‌ఎస్‌ఓ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020) రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కేవలం 4.5 శాతంగా నమోదయ్యింది.
ద్రవ్యలోటు విషయానికొస్తే, 2019-20 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ పరిమాణం రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3 శాతం) బడ్జెట్ లక్ష్యం. కానీ అక్టోబర్ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు చేరింది. అంటే బడ్జెట్ అంచనాల్లో 102.4 శాతానికి చేరిందన్నమాట. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ నవంబర్ 29న ఈ గణాంకాలను విడుదల చేసింది.
వియత్నాంకు వేగవంతమైన వృద్ధి హోదా
ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాను గత ఆర్థిక సంవత్సరం (5 శాతం) వరకూ భారత్ పొందుతోంది. అయితే ప్రస్తుత జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి 7.3 శాతం వృద్ధి రేటుతో వియత్నాం మొదటిస్థానంలో ఉంది. చైనా వృద్ధి రేటు 6 శాతంగా (27 సంవత్సరాల కనిష్టం) ఉంది. తరువాత వరుసలో ఈజిఫ్ట్ (5.6 శాతం), ఇండోనేషియా (5 శాతం)లు ఉన్నాయి. దీనితో క్యూ2కు సంబంధించి ‘వేగవంతమైన వృద్ధి’ హోదాను వియత్నాం దక్కించుకున్నట్లు అయి్యంది. కాగా అమెరికా వృద్ధి రేటు ఈ కాలంలో 2.1 శాతం.
#Tags