15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు?

2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు సిఫారసులతో రూపొందించిన నివేదికను 15వ ఆర్థిక సంఘం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పించింది.
15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్ నేతృత్వంలో కమిషన్ సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, ప్రొఫెసర్ అనూప్ సింగ్, డాక్టర్ అశోక్ లాహిరి, డాక్టర్ రమేశ్‌చంద్‌తో పాటు కమిషన్ కార్యదర్శి అరవింద్ మెహతా రాష్ట్రపతిని కలిసి నవంబర్ 9న నివేదికను సమర్పించారు.

పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత...
ఎన్.కె.సింగ్ నేతృత్వంలోని కమిషన్ ప్రతి రాష్ట్రం ఆర్థిక పరిస్థితులను లోతుగా విశ్లేషించింది. రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ముఖ్య సవాళ్లను పరిష్కరించడానికి రాష్ట్ర-నిర్దిష్ట పరిశీలనలను కమిషన్ తన నివేదికలో పొందుపరిచింది. రిపోర్టులో ఉన్న సిఫారసులపై వివరణాత్మక మెమోరాండం, చేపట్టిన చర్యల నివేదికతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఈ నివేదిక ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

సమతుల్యతను సూచించే త్రాసు...
15వ ఆర్థిక సంఘం నివేదిక ముఖచిత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. ‘కోవిడ్ కాలంలోని ఫైనాన్స్ కమిషన్’ అన్న ప్రధాన శీర్షికతో, రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమతుల్యతను సూచించే త్రాసును నివేదికపై ముద్రించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 15వ ఆర్థిక సంఘం నివేదిక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేత
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్ నేతృత్వంలో కమిషన్ సభ్యులు
ఎందుకు : రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ముఖ్య సవాళ్లను పరిష్కరించడానికి
#Tags