National Energy Leader Award: విశాఖ స్టీల్ ప్లాంటు నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కాన్పెడ రేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ-గ్రీన్ బిజినెస్ సెంటర్ (సీఐఐ-జీబీసీ) నేషనల్ ఎనర్జీ లీడర్ ఆవార్డును అందజేసింది.
హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యదర్శి మిలింద్ దేవరా నుంచి స్టీల్‌ప్లాంట్ ఇంధన నిర్వహణ విభాగం జీఎం కె.సుధాకర్ బృందం ఈ అవార్డును అందుకుంది.
స్థిరమైన ఇంధన పద్ధతులతో కంపెనీ తిరుగులేని నిబద్ధతను చాటడం ద్వారా వరుసగా ఆరోసారి ఈ అవార్డును స్టీల్‌ప్లాంట్ అందుకుంది. దీంతోపాటు అద్భుతమైన ఎనర్జీ ఎఫీషియంట్ యూనిట్ అవార్డును వరుసగా ఎనిమిదోసారి సాధించింది.
National Florence Nightingale Awards 2024: నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు.. విజేతలు వీరే..
#Tags