AP EAPCET Seat Allotment 2024 : బ్రేకింగ్ న్యూస్‌.. ఏపీ ఈఏపీసెట్‌-2024 తొలి రౌండ్‌ సీట్ల కేటాయింపు.. ఈ లింక్ క్లిక్ చేయండి.. మీ కాలేజీని చెక్ చేసుకోండిలా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం.. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలి విడత సీట్ల కేటాయింపుకు సంబంధించిన వివరాలను జూలై 17వ తేదీన (బుధ‌వారం) వెల్లడించారు.

ఈ మేరకు అధికారిక https://eapcet-sche.aptonline.in/EAPCET/eapAllotment వెబ్‌సైట్‌లో అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను అందుబాటులో ఉంచారు. 

విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో తెలుసుకొనేందుకు ఏపీ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాల్ని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్‌ ప్రకారం సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో జూలై 17-22లోపు చేరాల్సి ఉంటుంది. అలాగే జూలై 19 నుంచి క్లాసులు ప్రారంభంకానున్నాయి.

ఇంజినీరింగ్ భారీగా..
ఏపీ ఈఏపీసెట్-2024కు రాష్ట్ర వ్యాప్తంగా 3,62,851 మంది ద‌రఖాస్తు చేసుకున్నార‌రు.  3,39,139 మంది ప‌రీక్షల‌కు హాజ‌ర‌య్యారు. ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి వీటి ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. అలాగే ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో భారీగా 2,74,213 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,58,374 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,95092 మంది అర్హ‌త  సాధించారు. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో 88,638 మంది దరఖాస్తు చేసుకోగా.. 80,766 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 70,352 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

☛☛➤ AP EAPCET-2024 College Predictor 2024 : AP EAPCET-2024లో మీకు వ‌చ్చిన ర్యాంక్‌కు ఏ కాలేజీలో.. ఏ బ్రాంచ్‌లో.. సీటు వ‌స్తుందంటే..?

#Tags