విద్యా బోధనలో డిజిటల్ శకం.. టెక్నాలజీ కేంద్రంగా మారుతున్న చదువులు
అక్షరం ఆన్‌లైన్ రూపం దాల్చింది. బ్లాక్ బోర్డు స్థానంలో డిజిటల్ క్లాస్‌రూమ్ వచ్చి చేరింది. కొవిడ్–19తో విద్యాబోధన టెక్నాలజీని అందిపుచ్చుకుంది.
ముఖ్యంగా 2020లో విద్యా రంగం అనూహ్యంగా కొత్త పుంతలు తొక్కింది. టెక్నాలజీ ఈ ఏడాది విద్య, బోధనలో నూతన పరిణామాలకు నాంది పలికింది. ఎడ్యుకేషన్ రంగంలో డిజిటల్ శకానికి తెరతీసింది. ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతోపాటు స్కూల్స్/ కాలేజీలకు రిమోట్ టీచింగ్, లెర్నింగ్ సవాళ్లు ఎదురయ్యాయి. 2021లోనూ కొవిడ్ అనంతర కాలంలో.. డిజిటల్ విధానమే కొనసాగుతుందని నిపుణుల అంచనా! ఈ నేపథ్యంలో 2021 ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, డిజిటల్ లెర్నింగ్, ప్రభావాలు, అందిపుచ్చుకోవాల్సిన అవసరంపై ప్రత్యేక కథనం...
వర్చువల్ విధానమే..
కొవిడ్–19 మహమ్మారి చైనాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపడానికి కొంత సమయం పట్టింది. భారత్ లోనూ 2020 మార్చి నుంచి స్కూల్స్/కాలేజీల్లో తరగతులు నిలిపివేశారు. ఇప్పటికీ స్కూళ్లు పూర్తిస్తాయిలో తెరచుకోలేదు. అంటే.. ఒక విద్యా సంవత్సరం పూర్తిగా వర్చువల్ విధానంలోనే గడిచిపోయింది. ఎలాంటి పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేశారు. ఇక విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లలో వీడియో పాఠాలు విని.. ఆన్‌లైన్‌లోనే పరీక్షలు రాయాల్సిన పరిస్థితి. ఇదే పరిస్థితి వచ్చే సంవత్సరం(2021) కూడా కొనసాగే ధోరణి కనిపిస్తోంది.
వ్యాక్సిన్ వార్తలు..
ఇటీవల కొవిడ్ వ్యాక్సిన్ల అందుబాటు గురించి వార్తలు వస్తున్నాయి. కాని ఇవి సామాన్యులకు చేరువయ్యేందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేం. అంటే.. 2021లో కూడా విద్యార్థులు వర్చువల్ క్లాసులకే పరిమితంకాక తప్పదా?! అనే సందేహం వ్యక్తమవుతోంది. ఒకవేళ కొవిడ్ టీకా అందుబా టులోకి వచ్చి.. ప్రస్తుత విద్యా సంవత్సరం(2020–21)లో స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభమైనçప్పటికీ.. పూర్తిస్థాయి లో క్లాసులు నిర్వహించే పరిస్థితి ఉండకపోవచ్చు. కాబట్టి వర్చువల్ క్లాసుల విధానం కొనసాగనుంది.
ఇంకా చదవండి: part 2: 2021 మధ్య వరకు టెక్నాలజీ ఆధారిత బోధనకే అవకాశం ఎక్కువ..