కొలువు నచ్చాలి...కెరీర్ మెరవాలి
‘ఎంబీఏ చదివి పొలం బాట పట్టిన యువకుడు’.. ‘కార్పొరేట్ కొలువు వదిలి సమాజ సేవకు కదిలిన యువతి’.. ఇటీవల ఇలాంటి కథనాలు తరచూ వింటున్నాం..! ఈ ఉదంతాలు నేటి యువత కెరీర్‌లో అభిరుచికే ప్రాధాన్యం ఇస్తోందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆదాయం అత్యున్నతంగా.. అభద్రత ఎక్కువగా ఉండే ఉద్యోగాల కంటే భవిష్యత్తుకు ఢోకాలేని స్థిరమైన పురోగతి వైపు మొగ్గుచూపుతోంది. భవిష్యత్ లక్ష్యాల పట్ల పూర్తి స్పష్టతతో వ్యవహరిస్తూ.. ఒకట్రెండు అవకాశాలు చేజారినా.. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు కదులుతోంది. జెడ్ జనరేషన్ (21-27 ఏళ్లు) కెరీర్ లక్ష్యాలపై ఓ సర్వేలో వెల్లడైన అంశాలపై విశ్లేషణ..
‘జెడ్ జనరేషన్’..
నవ యువతను ఉటంకిస్తూ కార్పొరేట్ ప్రపంచం సంబోధిస్తున్న పదం ‘జెడ్ జనరేషన్’. ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలనుకుని చేరిపోయే నిన్న, మొన్నటి తరహా వారు కారు వీరు. కెరీర్, లక్ష్యాల పరంగా ముందు చూపుతో వ్యవహరిస్తూ.. ‘నచ్చిన కొలువు దొరికితేనే’ అనే తీరు వీరిది. మనసు ‘మెచ్చిన’ ఉద్యోగానికే మా ఓటు అని స్పష్టం చేస్తూ.. అందుకోసం వేచి చూసేందుకు సైతం వెనుకాడటం లేదు. ‘అనుకున్న లక్ష్యం చేరుకోవాలి’.. ఇదే ఈ తరం పఠించే మంత్రం.
గెడైన్స్ లేకుండానే..
రెండు, మూడేళ్ల క్రితం వరకు యువత అందుబాటులోని అవకాశాలు, వాటిని చేరుకునే మార్గాల కోసం నిపుణులు, ప్రొఫెసర్ల సలహాలపై ఆధారపడేది. ప్రస్తుత పరిస్థితిని విశ్లేషిస్తే లక్ష్యాల పట్ల స్పష్టత పెరిగింది. అనువైన గమ్యాల గురించి తెలుసుకోవడానికి ఎవరి సలహాలు అడగకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తోంది.
21- 27 ఏళ్ల మధ్య వయసు యువ ఉద్యోగులను సంప్రదించి నిర్వహించిన సర్వే గణాంకాల ప్రకారం 79 శాతం మంది ఎలాంటి గెడైన్స్ లేకుండానే ప్రస్తుతం నిర్వహిస్తున్న విధుల్లో చేరారు. ఈ విషయంలో మహిళలు మాత్రం గెడైన్స్/కౌన్సెలింగ్ అవసరమని భావిస్తున్నారు.
మారుతున్న లక్ష్యాలు...
సర్వే గణాంకాలు, యువత లక్ష్యాల ను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ-కామర్స్‌ను ఎంచుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. జాబ్ రిస్క్ తక్కువగా ఉండటం, కెరీర్‌లో త్వరత్వరగా పురోగతికి అవకాశం ఉండటమే దీనికి ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. బెంగళూరులో బీపీఓ/కాల్ సెంటర్ ఉద్యోగాలను తొలి లక్ష్యంగా చెప్పడానికి కారణం.. ఐటీ అనుబంధ సర్వీసుల సంస్థలు ఎక్కువగా నెలకొనడమే. ఇక్కడ సైతం బీపీఓ/ కాల్ సెంటర్ తర్వాత ఈ-కామర్స్ యువతకు గమ్యంగా నిలవడం విశేషం.
ఆసక్తికి కారణమిదే..
నేటి తరం యువత- కెరీర్ లక్ష్యం అనగానే ఐటీ, సాఫ్ట్‌వేర్ సంస్థలదే ముందంజ అనే అభిప్రాయం సహజం. దీనికి భిన్నంగా డిజిటల్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఈ-కామర్స్, సోషల్ మీడియా, మోడ్రన్ రిటైల్ పట్ల ఆసక్తి చూపడం విశేషం. ఒడిదుడుకులకు తావు లేని భవిష్యత్తు దీనికి కారణంగా కనిపిస్తోంది. ఐటీలో పింక్ స్లిప్‌లు, కొలువుల కోత వార్తల నేపథ్యంలో.. ఎంతో కొంత ఉద్యోగ భద్రతతో పాటు కెరీర్ స్థిరంగా ఉండే మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఈకామర్స్, రిటైల్ రంగాల పట్ల యూత్ ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తోంది.
ఒక సంస్థ కాకపోతే మరోటి..
జెడ్ తరం కెరీర్ లక్ష్యాల పరంగా సానుకూలంగా భావించాల్సిన అంశం.. ఒక ఇంటర్వ్యూలో విఫలమైనా వ్యథ చెందకుండా మరోదానికి సన్నద్ధమవ్వొచ్చనే సానుకూల దృక్పథం. కొంతకాల క్రితం వరకు ఇంటర్వ్యూలో విఫలమైన అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యేవారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో మార్పు ఆహ్వానించదగ్గ పరిణామం. ఉద్యోగ సాధనలో ఎక్కువ ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారి సంఖ్య ముంబై, కోల్‌కతా నగరాల్లో నమోదైంది. కోల్‌కతా యువత సగటున 3.2 ఇంటర్వ్యూలకు; ముంబై యువత 2.9 ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు.
ప్రత్యామ్నాయాలపైనా స్పష్టత...
కెరీర్ లక్ష్యాలపైనే కాక.. అవి అందకపోతే ఏం చేయాలి? అనే కోణంలో ప్రత్యామ్నాయాలపైనా నేటి తరం స్పష్టతతో అడుగులు వేస్తోంది. ఇప్పటికే తాము విధులు నిర్వహిస్తున్న రంగానికి అనుబంధంగా ఉన్నవాటివైపు మొగ్గుచూపుతోంది. ఉదాహరణకు డిజిటల్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. వీటిలో పనిచేస్తున్న వారిలో 33 శాతం మంది సోషల్ మీడియాను, 22 శాతం మంది టెలివిజన్ రంగాన్ని ప్రత్యామ్నాయ వేదికలుగా పేర్కొన్నారు.
నైపుణ్యాలకు సాన..
లక్ష్యాలను చేరుకునే క్రమంలో యువత సంబంధిత రంగంలో కొత్త నైపుణ్యాల మెరుగుకు శిక్షణ తీసుకునేందుకు కూడా వెనుకాడటం లేదు. సర్వే గణాంకాల ప్రకారం.. డిజిటల్ మీడియా-డిజిటల్ అడ్వర్టయిజింగ్ లక్ష్యంగా పెట్టుకున్నవారిలో 48 శాతం మంది; సోషల్ మీడియాను ఎంచుకున్న యువతలో 41 శాతం మంది తాము ఉద్యోగంలో చేరడానికి ముందు ఈ రంగాల్లో నైపుణ్యాల కోసం శిక్షణ తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఆసక్తికి ప్రాధాన్యం సబబే..
నేటి తరం యువత ఆసక్తి ఉన్న కెరీర్‌కు ప్రాధాన్యం ఇవ్వడం సబబే. ఇదే సమయంలో సంబంధిత రంగంలో అకస్మాత్తుగా ఏదైనా ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకునే విధంగా సన్నద్ధతతో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రత్యామ్నాయ రంగాలపైనా స్పష్టతతో వ్యవహరిస్తే మరింత మెరుగ్గా రాణించేందుకు అవకాశం ఉంటుంది.
- ఎం.రామకృష్ణ, జెడ్‌సీఎస్ కన్సల్టింగ్

- సర్వే గణాంకాల ప్రకారం.. కెరీర్ అవకాశాల అన్వేషణలో ప్రాంతాలవారీగా యువత ప్రాధాన్యతల్లో మార్పు కనిపిస్తోంది.
- దేశవ్యాప్తంగా అయిదు నగరాల్లో (ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా) నిర్వహించిన సర్వేలో.. ఒక్కోచోట ఒక్కో రంగం పట్ల యువత ఎక్కువ ఆసక్తి చూపింది.
- హైదరాబాద్‌లో బీపీఓ/కాల్ సెంటర్ (47 శాతం), సోషల్ మీడియా (45 శాతం), ఈ-కామర్స్ (42 శాతం) కొలువులు యువతకు ప్రధాన లక్ష్యంగా మారాయి.
- ఢిల్లీలో డిజిటల్ మీడియా; ఈ-కామర్స్; మోడ్రన్ రిటైల్.. ప్రాధాన్యత క్రమంలో వరుసగా..
- బెంగళూరులో బీపీఓ/కాల్ సెంటర్; ఈ-కామర్స్, డిజిటల్ మీడియా; మోడ్రన్ రిటైల్; సోషల్ మీడియా.
- చెన్నైలో డిజిటల్ మీడియా; మోడ్రన్ రిటైల్ ట్రేడ్, సోషల్ మీడియా; ఈ-కామర్స్; బీపీఓ/కాల్‌సెంటర్;
- కోల్‌కతాలో సోషల్ మీడియా, డిజిటల్ మీడియా; ఈ-కామర్స్, మోడ్రన్ రిటైల్ ట్రేడ్; బీపీఓ/ కాల్ సెంటర్.
- ముంబైలో ఈ-కామర్స్; డిజిటల్ మీడియా; సోషల్ మీడియా; మోడ్రన్ రిటైల్ ట్రేడ్; బీపీఓ/కాల్ సెంటర్ ప్రాథమ్యాలుగా ఉన్నాయి