జేఈఈ అడ్వాన్స్‌డ్–2019 ఎగ్జామ్ టిప్స్...
2019, జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్‌లో మంచి పర్సంటైల్ పొందిన విద్యార్థులు ఇప్పటి నుంచి పూర్తిస్థాయిలో ఐఐటీ అడ్వాన్స్‌డ్ ప్రిపరేషన్‌పై దృష్టిసారించాలి. ఏపీ ఎంసెట్/టీఎస్ ఎంసెట్ రాసే విద్యార్థులు ఆయా పరీక్షలకు ముందు వారం రోజుల పాటు ఎంసెట్ ఆన్‌లైన్ గ్రాండ్‌టెస్ట్‌లు రాసి.. వేగం, కచ్చితత్వాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ఎంసెట్ తర్వాత మళ్లీ అడ్వాన్స్‌డ్‌కు సమయం కేటాయించాలి. ఈ ఏడాది అడ్వాన్స్‌డ్ మే 27న జరగనుంది. నచ్చిన ఇన్‌స్టిట్యూట్, బ్రాంచ్‌లో సీటు సంపాదించాలంటే 60 శాతం మార్కులు సాధించేందుకు ప్రయత్నించాలి.
కాలేజీ మెటీరియల్‌తో..
ఒక్కో సబ్జెక్టుకు నాలుగైదు పుస్తకాలు కాకుండా కాలేజీ మెటీరియల్‌తో పాటు ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకాన్ని ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. 2018 అడ్వాన్స్‌డ్ పేపర్–1, పేపర్–2 కలిపి ప్రతి సబ్జెక్టు నుంచి 36 ప్రశ్నలు 120 మార్కులకు వచ్చాయి. ఈ పరీక్షలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కంటే కెమిస్ట్రీ పేపర్ కఠినంగా ఉంది. మొత్తం 360 మార్కులకు జరిగిన పరీక్షలో 100 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు తేలిగ్గా, 120 మార్కులకు సంబంధించి మధ్యస్థంగా, 140 మార్కులకు సంబంధించి కఠినంగా వచ్చినట్లు సబ్జెక్టు నిపుణులు వెల్లడించారు.
మ్యాథమెటిక్స్
- గత నాలుగైదేళ్ల ఐఐటీ అడ్వాన్స్‌డ్ పేపర్లను పరిశీలిస్తే ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నట్లు అర్థమవుతోంది. మొత్తం ప్రశ్నల్లో దాదాపు 60 శాతం ప్రశ్నలు మిక్స్‌డ్ కాన్సెప్టుల నుంచి వస్తున్నాయి.
- ప్రాబబిలిటీ, పెర్ముటేషన్స్–కాంబినేషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, లిమిట్స్, డిఫరెన్సిబిలిటీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ ఆల్జీబ్రా, 3డీ జామెట్రీ తదితర అంశాల నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తున్నాయి.
- ఏరియాస్, సర్కిల్స్, డెఫినిట్ ఇంటెగ్రల్స్, ఇండెఫినిట్ ఇంటెగ్రల్స్ నుంచి వస్తున్న ప్రశ్నలు కఠినంగా ఉంటున్నాయి.
- వర్గ సమీకరణాలు, మూలాల మధ్య సంబంధం, వాటి అంతరాలు; త్రికోణమితి, సంవర్గమాన సంబంధ సమస్యలపై దృష్టిసారించడం ద్వారా మ్యాథమెటిక్స్‌లో అధిక మార్కులు సాధించొచ్చు.
- మెకానిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. కైనమ్యాటిక్స్, న్యూటన్ లా ఆఫ్ మోషన్, సింపుల్ హార్మోనిక్ మోషన్, ఎనర్జీ కన్జర్వేషన్ కాన్సెప్టులపై తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకోవాలి.
- కరెంట్ ఎలక్ట్రిసిటీ
- థర్మోడైనమిక్స్
- రేడియోయాక్టివిటీ
- న్యూటన్ లాస్
- వర్క్, పవర్, ఎనర్జీ
- వేవ్స్ అండ్ ఆసిలేషన్స్.
- తొలుత ముఖ్యమైన చాప్టర్లలోని కాన్సెప్టులపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలి. ఆ తర్వాత వాటికి సంబంధించిన సమస్యల సాధనను ప్రాక్టీస్ చేయాలి.
- కిర్కాఫ్స్ లా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, రేడియో యాక్టివ్ డీకే, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్ అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి.
- మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో పోల్చితే కెమిస్ట్రీ కొంత వరకు స్కోరింగ్ సబ్జెక్టని చెప్పొచ్చు. అందువల్ల కొంచెం కష్టపడితే పూర్తిస్థాయిలో మార్కులు సాధించొచ్చు.
- ముఖ్య కాన్సెప్టులను నేర్చుకున్న అనంతరం ఆర్గానిక్, నేమ్డ్ రియాక్షన్స్, ఇంటర్ కన్వర్షన్స్, ఫిజికల్ కెమిస్ట్రీలోని సమస్యలను ప్రాక్టీస్ చేయాలి.
- థియరీ, కాన్సెప్టులు, కెమికల్ ఈక్వేషన్స్, రియాక్షన్స్.. వీటి సమ్మిళితంగా ఉండే కెమిస్ట్రీలో పట్టు సాధించాలంటే విశ్లేషణాత్మక నైపుణ్యాలు పెంపొందించుకోవాలి.
- ఆర్గానిక్ కాంపౌండ్స్, వాటి లక్షణాలు.
- స్టేట్స్ ఆఫ్ మ్యాటర్.
- కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ కైనటిక్స్.
- కోఆర్డినేషన్ కాంపౌండ్స్
- పి–బ్లాక్ ఎలిమెంట్స్
- సొల్యూషన్స్
- కెమికల్ థర్మోడైనమిక్స్
- ఎంపిక చేసుకున్న స్టడీ మెటీరియల్ సమగ్రంగా, పరీక్ష కాఠిన్యత, స్థాయికి అనుగుణంగా లేకుంటే ప్రతికూల ఫలితాలు తప్పవు. అందువల్ల ప్రామాణిక మెటీరియల్‌ను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవడం ముఖ్యం.
- క్లిష్టమైన అంశాలు సైతం తేలిగ్గా అర్థమయ్యేలా వివరించే పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి. ఈ విషయంలో ఫ్యాకల్టీ, సీనియర్ల సలహాలు తీసుకోవాలి.
- కాన్సెప్టులపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలి. వాటి అనువర్తనాలను అధ్యయనం చేయాలి.
- చదువుతున్నప్పుడు ముఖ్య అంశాలను నోట్ చేసుకోవాలి. దీనివల్ల పరీక్షకు ముందు క్విక్ రివిజన్ తేలికవుతుంది.
- ప్రతి చాప్టర్ అధ్యయనం తర్వాత కాన్సెప్టులపై పట్టుసాధించేందుకు, సమస్య పరిష్కార నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు మోడల్ ప్రశ్నలను సాధన చేయాలి.
- ఎంతసేపు చదివామనే దానికంటే ఎంత ప్రభావవంతంగా చదివామనేదే విజయానికి ముఖ్యమనే∙విషయాన్ని గుర్తించి ప్రిపరేషన్ కొనసాగించాలి.
- రివిజన్‌కు ప్రాధాన్యమివ్వాలి. కఠిన అంశాలను సైతం ఫ్యాకల్టీ సహాయంతో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి.
- వీలైనన్ని మాక్‌టెస్ట్‌లు రాయడం వల్ల ద్వారా ప్రిపరేషన్‌లో లోటుపాట్లను తెలుసుకొని సరిదిద్దుకోవచ్చు.
- జేఈఈ అడ్వాన్స్‌డ్–2019 నిర్వహణ సంస్థ ఐఐటీ–రూర్కీ.. అధికారిక వెబ్‌సైట్లో గత ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచింది. వీటిని ప్రాక్టీస్ చేయడం మంచిది.