ఈ లాంగ్వేజ్‌ టెస్ట్‌లు.. ఏడాది పొడవునా రాయొచ్చు..

విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశానికి లాంగ్వేజ్‌ టెస్ట్‌ల స్కోర్‌ కీలకంగా మారుతోంది. అభ్యర్థులకు ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నైపుణ్యాలు ఉన్నాయా? లేదా? అని పరిశీలించడమే ఈ లాంగ్వేజ్‌ టెస్టుల ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, పీటీఈ టెస్ట్‌లను ఆయా యూనివర్సిటీలు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.

టోఫెల్‌..
టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఏ ఫారి¯Œన్‌ లాంగ్వేజ్‌.. సంక్షిప్తంగా టోఫెల్‌. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ టోఫెల్‌ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మొత్తం నాలుగు విభాగాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. అవి.. రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్‌. పరీక్ష సమయం మూడు గంటలు.

ఏడాది పొడవునా: టోఫెల్‌ పరీక్ష తేదీల పరంగా ఎలాంటి పరిమితి లేదు. ఏడాది పొడవునా పలు తేదీల్లో, ఆన్‌లైన్‌ విధానంలో పలు స్లాట్‌లలో జరుగుతుంది. అభ్యర్థులు ఎన్నిసార్లయినా పరీక్షకు హాజరు కావచ్చు. బెస్ట్‌ స్కోర్‌ పొందే క్రమంలో విద్యార్థులు సగటున మూడుసార్లు టోఫెల్‌ రాస్తున్నట్లు తెలుస్తోంది.

పాయింట్ల రూపంలో స్కోర్‌: టోఫెల్‌ పరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా పాయింట్ల రూపంలో స్కోర్‌ కేటాయిస్తారు. గరిష్టంగా 120 పాయింట్లకు పరీక్ష జరుగుతుంది.80పాయింట్లు స్కోర్‌ సాధిస్తే.. బెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. టెస్ట్‌ స్కోర్‌ గుర్తింపు కాల పరిమితి రెండేళ్లు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ets.org/toefl

ఇంకా చ‌ద‌వండి: part 6: అభ్యర్థుల్లోని ఇంగ్లిష్‌ పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు ఉద్ధేశించిన ఈ లాంగ్వేజ్‌ టెస్ట్‌.. ఏడాదికి 48సార్లు..