డ్రోన్ పాలసీ... కొలువులకు కొత్త జోరు
ఇప్పుడు డ్రోన్‌ల గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. గత మూడు, నాలుగేళ్లుగా ‘డ్రోన్’ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ముఖ్యంగా డ్రోన్ కెమెరాలు ఇప్పుడు అందరికీ సుపరి చితమే! ఇప్పటివరకు అనధికారికంగానే కొనసాగుతున్న డ్రోన్‌ల వినియోగానికి ఇకపై అధికారిక ఆమోదం లభించనుంది.
డ్రోన్‌ల ద్వారా కలిగే ప్రయోజనాలు, ప్రస్తుత పరిస్థితుల్లో వీటి అవసరాన్ని గుర్తించిన డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ).. తొలిసారిగా డ్రోన్ పాలసీ 1.0కి రూపకల్పన చేసింది. ఫలితంగా ఇప్పటివరకు కొన్ని విభాగాలకే పరిమిత మైన డ్రోన్‌ల వినియోగం ఇక అందరికీ అందుబాటులోకి రానుంది. మరోవైపు ఈ డ్రోన్ పాలసీ.. వేల సంఖ్యలో కెరీర్ అవకాశాల కల్పనకు దోహదం చేయనుంది. పదోతరగతి నుంచి ఏరోడైనమిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పట్టభద్రుల వరకు పలు కెరీర్ అవకాశాలు కల్పించనుంది. డిసెంబర్1 నుంచి అమల్లోకి రానున్న డ్రోన్ పాలసీ 1.0 .. దానిద్వారా లభించే ఉపాధి అవకాశాలపై విశ్లేషణ..
ప్రస్తుతానికి డ్రోన్‌ల వినియోగంపై పరిమిత నిబంధనలతో డ్రోన్ పాలసీ 1.0ని రూపొందించారు. రానున్న రోజుల్లో వాణిజ్య, వ్యాపార విభాగాల్లోనూ వీటిని వినియోగించేలా మార్పులు జరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. తద్వారా కెరీర్ పరంగానూ డ్రోన్ రంగంలో వేల మందికి ఉపాధి లభించనుంది.
‘డ్రోన్’.. . ఆర్‌పీఏఎస్
‘డ్రోన్’ అంటే.. స్వల్ప పరిమాణం కలిగిన మానవ రహిత ఎగిరే వాహనం. దీనికి నిర్వహణ పరంగా ల్యాండింగ్, టేకాఫ్ తప్పనిసరి. వాడుక భాషలో డ్రోన్‌గా పిలుస్తున్నప్పటికీ.. సాంకేతిక పరిభాషలో ఆర్‌పీఏఎస్(రిమోట్లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్)గా పేర్కొంటారు. డీజీసీఏ కూడా ఆర్‌పీఎఏస్ పేరుతోనే డ్రోన్ విధానాన్ని అమల్లోకి తేనుంది. దీనికి సంబంధించి విధి విధానాల ముసాయిదాను సైతం విడుదల చేసింది. డ్రోన్ పాలసీ అమల్లోకి రానుండటంతో ఇప్పటికే ఉన్న వాటితోపాటు మరెన్నో కొత్త సంస్థలు డ్రోన్ తయారీ రంగంలో అడుగు పెట్టనున్నాయి. దాంతో ఈ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఆపరేట్ చేసేందుకు పైలట్ల అవసరం కూడా వేల సంఖ్యలో ఏర్పడనుంది. డ్రోన్ అంటేనే స్వల్ప పరిణామంలో ఉంటుంది. మరి పైలట్ ఏంటని ఆలోచిస్తున్నారా.. ఇక్కడ పైలట్ అంటే నిర్దేశిత ప్రాంతంలో కూర్చుని రిమోట్ ఆధారంగా గాలిలో ఎగురుతున్న డ్రోన్ కదలికలను నియంత్రించే వ్యక్తి!
మొత్తం అయిదు విభాగాలు
డీజీసీఏ...ఆర్‌పీఏఎస్ పాలసీ ప్రకారం-డ్రోన్‌లను అయిదు కేటగిరీలుగా విభజించి.. వాటి వినియోగం పరంగా నిర్దిష్టంగా కొన్ని నియమ, నిబంధనలు రూపొందించింది.
మూడు జోన్లు
డ్రోన్‌లను వినియోగించే ప్రాంతాల ఆధారంగా మూడు జోన్లుగా వర్గీకరించారు. అవి... రెడ్ జోన్, ఎల్లో జోన్, గ్రీన్ జోన్.
డీజీసీఏ తొలిసారిగా రూపొందించిన డ్రోన్ పాలసీ 1.0 పరిమిత వర్గాలకే అనుమతిచ్చేలా ఉంది. భవిష్యత్తులో ఇతర రంగాల్లోనూ డ్రోన్‌ల వినియోగానికి అనుమతి లభించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఈ-కామర్స్, హెల్త్ సెక్టార్, ట్రావెల్ రంగాల్లోనూ డ్రోన్‌ల ప్రవేశానికి అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబర్ దుబాయ్‌లో గతేడాది డ్రోన్ ట్యాక్సీని ఆవిష్కరించింది. ఇదే తరహాలో ఫ్రాన్స్‌లో డ్రోన్ అంబులెన్స్ పేరుతో ప్రయోగాలు నిర్వహించి విజయం సాధించారు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. ప్రైమ్ నౌ పేరుతో డ్రోన్ డెలివరీ వ్యవస్థను ప్రారంభించి అమెరికాలో పేటెంట్ కూడా సొంతం చేసుకుంది.
అవకాశాలు
డ్రోన్ పాలసీలో అనే క నిబంధనలు, పరిమితులు పొందుపరిచారు. ఇలాంటి పరిస్థితిలో అసలు డ్రోన్ విధానంతో లభించే ఉద్యోగాలు ఏంటి.. ఏఏ రంగాల్లో అవకాశాలు రానున్నాయి. కొత్త డ్రోన్ పాలసీ ఎవరికి అనుకూలం అనే సందేహాలు తలెత్తడం సహజం! ఇప్పటికే ఉన్న డ్రోన్‌ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే... పదోతరగతి మొదలు టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ వరకు.. ముఖ్యంగా ఏరోడైనమిక్స్, ఏరోనాటిక్స్, ఎలక్ట్రానిక్స్ విద్యార్థులకు అవకాశాలు లభించే వీలుంది. అదేవిధంగా తాజా డ్రోన్ విధానం స్టార్టప్ ఔత్సాహికులకు స్వయం ఉపాధికి ఒక సరికొత్త మార్గంగా నిలవనుంది.
‘డ్రోన్’ పైలట్... లెసైన్స్ ఉంటేనే
డ్రోన్ పాలసీ ప్రకారం 18 ఏళ్ల వయసుతోపాటు పదోతరగతి అర్హత, ఇంగ్లిష్ పరిజ్ఞానముంటే ‘డ్రోన్’ పైలట్‌గా మారొచ్చు. ఆ మేరకు డీజీసీఏ నిర్దిష్టంగా నిబంధనలు రూపొందించింది. డ్రోన్‌ను ఆపరేట్ చేసే వ్యక్తి డీజీసీఏ నుంచి రిమోట్ పైలట్ లెసైన్స్ పొందాలి. ఇందుకోసం ముందుగా డీజీసీఏ గుర్తింపు పొందిన ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ లో కనీసం అయిదు రోజులపాటు శిక్షణ పొందాలి. రేడియో టెలిఫోనీ టెక్నిక్స్, ఫ్లయిట్ ప్లానింగ్ అండ్ ఏటీసీ ప్రొసీజర్స్, డీజీసీఏ రెగ్యులేషన్స్ తదితర విమానయాన సంబంధిత టెక్నికల్ అంశాల్లో థియరీ, ప్రాక్టికల్ శిక్షణ పొందాలి. ప్రస్తుతం ఈ విభాగంలో దేశంలో ఐఐడీ ఒక్కటే డీజీసీఏ గుర్తింపు పొందింది. ఇప్పుడిప్పుడే ఇతర ఇన్‌స్టిట్యూట్‌లకు కూడా గుర్తింపు ఇచ్చే ప్రక్రియను డీజీసీఏ ప్రారంభించింది. డీజీసీఏ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత.. డ్రోన్ పైలట్‌గా కెరీర్ ప్రారంభించాలంటే డీజీసీఏ నుంచి లెసైన్స్ పొందాలి. ఇందుకోసం డీజీసీఏ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ ఉత్తీర్ణత సాధిస్తే లెసైన్స్ సొంతమవుతుంది. ఆ తర్వాత డ్రోన్ పైలట్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు. ఈ లెసైన్స్ ఎగ్జామినేషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను కూడా డిసెంబర్ 1 నుంచే డీజీసీఏ ప్రారంభించనుంది. ప్రస్తుతం ఆయా రంగాల్లో నెలకొన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే డీజీసీఏ లెసైన్స్ పొందిన డ్రోన్ పైలట్‌లకు ప్రారంభంలోనే కనీసం రూ.25వేల జీతం లభించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
ప్రధానంగా మీడియా, ఫోటోగ్రఫీ
డ్రోన్ పైలట్లకు ప్రధానంగా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫొటోగ్రఫీ, సినిమా రంగాల్లో ఎక్కువ అవకాశాలు లభించనున్నాయి. కారణం.. ఇటీవల కాలంలో సినీ రంగం, ఎలక్ట్రానిక్ మీడియాలో డ్రోన్ కెమరాలతో షూటింగ్ చేయడం పెరుగుతోంది. ప్రస్తుతం డ్రోన్‌ల వినియోగం పరంగా 40-50 శాతం మేరకు మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, ఫొటోగ్రఫీ రంగాల్లోనే అవకాశాలు లభిస్తున్నాయి. అదే విధంగా రాజకీయ పార్టీల భారీ సభలు, వేడుకలకు డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీయించడం పరిపాటిగా మారింది. కాబట్టి డ్రోన్ పెలైట్‌లకు ఆయా రంగాల్లో ఉపాధి లభించే వీలుంది.
వ్యవసాయం, సర్వేయింగ్
డ్రోన్ రంగం పరంగా భవిష్యత్‌లో వ్యవసాయం, సర్వేయింగ్ రంగాల్లోనూ ఉపాధి విస్తరించనుంది. ఎందుకంటే... వ్యవసాయం రంగంలో డ్రోన్‌ల సహాయంతో విత్తనాలు, పురుగు మందులు చల్లడం వంటి కార్యకలాపాలకు ఆస్కారముంది. అలాగే సర్వేయింగ్ విభాగంలో.. మైనింగ్, రైల్వే ట్రాక్స్, ల్యాండ్ సర్వేలు చేసి వాటి వివరాలు డ్రోన్‌ల ద్వారా సేకరించి సంబంధిత వర్గాలకు చేరవేయడం లాంటివి ఊపందుకునే ఆవకాశమంది. ఉదాహరణకు రైల్వే ట్రాక్‌కు సంబంధించి నిర్దిష్ట ప్రాంతంలో ట్రాక్‌ను సర్వే చేసి వాటి వివరాలను రైల్వే టెక్నికల్ విభాగానికి పంపుతారు. వీటి ఆధారంగా ఆయా ట్రాక్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే మరమ్మతులు చేస్తారు. ప్రస్తుతం రోజుల తరబడి చేస్తున్న ఈ కార్యకలాపాలను డ్రోన్‌ల సహాయంతో గంటల వ్యవధిలోనే పూర్తిచేయొచ్చు.
తయారీలో టెక్ అభ్యర్థులు
డ్రోన్ పాలసీ ద్వారా ఉపాధి పరంగా టెక్నికల్ విద్యార్థులు కూడా ప్రయోజనం పొందనున్నారు. ముఖ్యంగా డ్రోన్‌ల తయారీ కోణంలో ఏరోడైనమిక్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు అవకాశం లభించనుంది. డ్రోన్‌ల డిజైన్, మోడలింగ్, 3-డి ప్రింటింగ్, అసెంబ్లింగ్, ప్రోగ్రామింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, వంటి విభాగాల్లో వీరికి ఉద్యోగవకాశాలు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. అదేవిధంగా డ్రోన్ కెమెరాలు పంపే చిత్రాలను విశ్లేషించి.. సంస్థలకు నివేదికలు ఇవ్వాల్సిన క్రమంలో అనలిస్ట్‌లకు కూడా డిమాండ్ పెరగనుంది. ముఖ్యంగా ల్యాండ్ సర్వేయింగ్, మైనింగ్ వంటి రంగాలకు సంబంధించిన అంశాల్లో ఈ అనలిస్ట్‌ల అవసరం ఎక్కువగా ఉంటోంది.
స్టార్టప్‌లకు కలిసొచ్చేలా
మరోవైపు స్వయం ఉపాధి పరంగానూ డ్రోన్ పాలసీ సరికొత్త వేదికగా నిలవనుంది. ముఖ్యంగా డ్రోన్‌ల తయారీ సంస్థలను ఏర్పాటు చేసే స్టార్టప్ ఔత్సాహికులకు ఎన్నో అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే మన దేశంలో దాదాపు 150 డ్రోన్ తయారీ సంస్థలున్నాయి. డ్రోన్ పాలసీ అమల్లోకి రానున్న నేపథ్యంలో వచ్చే ఏడాది వ్యవధిలో కొత్తగా 100కు పైగా డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్స్ ప్రారంభం కానున్నాయని ఈ రంగంలోని నిపుణుల అంచనా. ఈ స్టార్టప్ ఔత్సాహికులకు వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుంచి ఆర్థిక సహకారం కూడా లభించే అవకాశ ముంది. ఇప్పటికే డ్రోన్‌ల తయారీలో నిమగ్నమైన ఇండియాఫోర్జ్ సంస్థకు 23.77 మిలియన్ డాలర్ల ఫండింగ్ లభించింది. అదే విధంగా ఆరవ్ అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్‌కు ఏడున్నర లక్షల డాలర్లు, డిటెక్ట్ టెక్నాలజీస్‌కు ఏడు లక్షల డాలర్లు, క్రోన్ సిస్టమ్స్‌కు 6.6 లక్షల డాలర్లు, ద్రోణ ఏవియేషన్ సంస్థకు ఒక లక్ష డాలర్ల ఫండింగ్ లభించింది. వీటిని దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్తు స్టార్టప్ సంస్థలకు కూడా మంచి ఫండింగ్ లభించడం ఖాయం. అదే విధంగా తయారీ విభాగంలో చిన్న తరహా సంస్థల్లో కనీసం 50 మంది, భారీ సంస్థల్లో కనీసం రెండు వందల మంది ఉద్యోగుల అవసరం ఉంటుంది.
రెండో పెద్ద దేశంగా భారత్!
డ్రోన్‌ల వినియోగంలో ప్రస్తుతం అమెరికా తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో భారత్ నిలుస్తోంది. భారత్‌లో 2021 నాటికి 50 వేల మంది డ్రోన్ పైలట్ల అవసరం ఏర్పడనుందని అంచనా. మరోవైపు డ్రోన్ పైలట్లకు విదేశాల్లోనూ డిమాండ్ నెలకొంది. అసోసియేషన్ ఆఫ్ అన్ మ్యాన్డ్ వెహికిల్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ అంచనాల ప్రకారం 2025 నాటికి అంతర్జాతీయంగా లక్ష మంది డ్రోన్ పైలట్ల అవసరం ఏర్పడనుంది.
డ్రోన్ పైలట్.. శిక్షణ సంస్థలు
సరికొత్త ఉపాధి వేదిక
దాదాపు నాలుగేళ్ల నుంచి (2014 నుంచి) నలుగుతున్న సివిల్ డ్రోన్ పాలసీకి తుదిరూపం ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, కెరీర్ అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటే.. భవిష్యత్‌లో వేల మందికి ఉపాధి వేదికగా డ్రోన్ మార్కెట్ నిలవనుంది. ముఖ్యంగా పదోతరగతి అర్హతతోనే కెరీర్‌లో స్థిరపడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అగ్రికల్చర్, మైనింగ్ రంగాల్లోని పలు సంస్థలు నిపుణులైన డ్రోన్ పైలట్లు లేకపోవడంతో.. తమ సంస్థల్లోని ఉద్యోగులకే డ్రోన్ ఆపరేటింగ్‌లో శిక్షణనిప్పించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. డీజీసీఏ పాలసీ అమల్లోకి వచ్చాక లెసైన్స్‌డ్ డ్రోన్ పైలట్లకు అవకాశాలు మెరుగవుతాయని చెప్పొచ్చు. అయితే విద్యార్థులు శిక్షణ తీసుకునే ముందు సదరు సంస్థకు డీజీసీఏ గుర్తింపు ఉందో? లేదో? పరిశీలించాలి.
- ఎన్.డి.సుధీర్, డెరైక్టర్, డ్రోన్ వరల్డ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.

- కేటగిరీ 1 (నానో డ్రోన్స్): 250 గ్రాములు లేదా అంతకంటే తక్కువ బరువున్న డ్రోన్‌లు.
- కేటగిరీ 2 (మైక్రో డ్రోన్స్): 250 గ్రాముల నుంచి రెండు కిలోల బరువున్న డ్రోన్‌లు.
- కేటగిరీ 3 (స్మాల్ డ్రోన్స్): రెండు కిలోల నుంచి 25 కిలోల బరువున్న డ్రోన్‌లు.
- కేటగిరీ 4 (మీడియం డ్రోన్స్): 25 కిలోల నుంచి 150 కిలోల బరువున్న డ్రోన్‌లు.
- కేటగిరీ 5 (లార్జ్ డ్రోన్స్): 150 కిలోల కంటే ఎక్కువ బరువున్న డ్రోన్‌లు.
మూడు జోన్లు
డ్రోన్‌లను వినియోగించే ప్రాంతాల ఆధారంగా మూడు జోన్లుగా వర్గీకరించారు. అవి... రెడ్ జోన్, ఎల్లో జోన్, గ్రీన్ జోన్.
- రెడ్ జోన్: ఇది నో ఫ్లై జోన్స్. ఈ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రోన్‌లను ఎగరేయకూడదు.
- ఎల్లో జోన్: కొన్ని అధికారిక అనుమతుల (పోలీస్ క్లియరెన్స్, డిఫెన్స్ క్లియరెన్స్ తదితర)తో ఈ ప్రాంతంలో డ్రోన్‌లను ఎగరేయొచ్చు.
- గ్రీన్ జోన్స్: ఎక్కడైనా.. ఎలాంటి అనుమతి అవసరం లేకుండా డ్రోన్‌లను ఎగరవేసే అవకాశం ఉన్న ప్రాంతాలు గీన్ జోన్.
- ఎలాంటి డ్రోన్ అయినా.. ఏ కేటగిరీకి చెందిన డ్రోన్ అయినా.. 450 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ప్రయాణించకూడదు.
డీజీసీఏ తొలిసారిగా రూపొందించిన డ్రోన్ పాలసీ 1.0 పరిమిత వర్గాలకే అనుమతిచ్చేలా ఉంది. భవిష్యత్తులో ఇతర రంగాల్లోనూ డ్రోన్‌ల వినియోగానికి అనుమతి లభించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఈ-కామర్స్, హెల్త్ సెక్టార్, ట్రావెల్ రంగాల్లోనూ డ్రోన్‌ల ప్రవేశానికి అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబర్ దుబాయ్‌లో గతేడాది డ్రోన్ ట్యాక్సీని ఆవిష్కరించింది. ఇదే తరహాలో ఫ్రాన్స్‌లో డ్రోన్ అంబులెన్స్ పేరుతో ప్రయోగాలు నిర్వహించి విజయం సాధించారు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. ప్రైమ్ నౌ పేరుతో డ్రోన్ డెలివరీ వ్యవస్థను ప్రారంభించి అమెరికాలో పేటెంట్ కూడా సొంతం చేసుకుంది.
అవకాశాలు
డ్రోన్ పాలసీలో అనే క నిబంధనలు, పరిమితులు పొందుపరిచారు. ఇలాంటి పరిస్థితిలో అసలు డ్రోన్ విధానంతో లభించే ఉద్యోగాలు ఏంటి.. ఏఏ రంగాల్లో అవకాశాలు రానున్నాయి. కొత్త డ్రోన్ పాలసీ ఎవరికి అనుకూలం అనే సందేహాలు తలెత్తడం సహజం! ఇప్పటికే ఉన్న డ్రోన్‌ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే... పదోతరగతి మొదలు టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ వరకు.. ముఖ్యంగా ఏరోడైనమిక్స్, ఏరోనాటిక్స్, ఎలక్ట్రానిక్స్ విద్యార్థులకు అవకాశాలు లభించే వీలుంది. అదేవిధంగా తాజా డ్రోన్ విధానం స్టార్టప్ ఔత్సాహికులకు స్వయం ఉపాధికి ఒక సరికొత్త మార్గంగా నిలవనుంది.
‘డ్రోన్’ పైలట్... లెసైన్స్ ఉంటేనే
డ్రోన్ పాలసీ ప్రకారం 18 ఏళ్ల వయసుతోపాటు పదోతరగతి అర్హత, ఇంగ్లిష్ పరిజ్ఞానముంటే ‘డ్రోన్’ పైలట్‌గా మారొచ్చు. ఆ మేరకు డీజీసీఏ నిర్దిష్టంగా నిబంధనలు రూపొందించింది. డ్రోన్‌ను ఆపరేట్ చేసే వ్యక్తి డీజీసీఏ నుంచి రిమోట్ పైలట్ లెసైన్స్ పొందాలి. ఇందుకోసం ముందుగా డీజీసీఏ గుర్తింపు పొందిన ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ లో కనీసం అయిదు రోజులపాటు శిక్షణ పొందాలి. రేడియో టెలిఫోనీ టెక్నిక్స్, ఫ్లయిట్ ప్లానింగ్ అండ్ ఏటీసీ ప్రొసీజర్స్, డీజీసీఏ రెగ్యులేషన్స్ తదితర విమానయాన సంబంధిత టెక్నికల్ అంశాల్లో థియరీ, ప్రాక్టికల్ శిక్షణ పొందాలి. ప్రస్తుతం ఈ విభాగంలో దేశంలో ఐఐడీ ఒక్కటే డీజీసీఏ గుర్తింపు పొందింది. ఇప్పుడిప్పుడే ఇతర ఇన్‌స్టిట్యూట్‌లకు కూడా గుర్తింపు ఇచ్చే ప్రక్రియను డీజీసీఏ ప్రారంభించింది. డీజీసీఏ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత.. డ్రోన్ పైలట్‌గా కెరీర్ ప్రారంభించాలంటే డీజీసీఏ నుంచి లెసైన్స్ పొందాలి. ఇందుకోసం డీజీసీఏ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ ఉత్తీర్ణత సాధిస్తే లెసైన్స్ సొంతమవుతుంది. ఆ తర్వాత డ్రోన్ పైలట్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు. ఈ లెసైన్స్ ఎగ్జామినేషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను కూడా డిసెంబర్ 1 నుంచే డీజీసీఏ ప్రారంభించనుంది. ప్రస్తుతం ఆయా రంగాల్లో నెలకొన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే డీజీసీఏ లెసైన్స్ పొందిన డ్రోన్ పైలట్‌లకు ప్రారంభంలోనే కనీసం రూ.25వేల జీతం లభించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
ప్రధానంగా మీడియా, ఫోటోగ్రఫీ
డ్రోన్ పైలట్లకు ప్రధానంగా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫొటోగ్రఫీ, సినిమా రంగాల్లో ఎక్కువ అవకాశాలు లభించనున్నాయి. కారణం.. ఇటీవల కాలంలో సినీ రంగం, ఎలక్ట్రానిక్ మీడియాలో డ్రోన్ కెమరాలతో షూటింగ్ చేయడం పెరుగుతోంది. ప్రస్తుతం డ్రోన్‌ల వినియోగం పరంగా 40-50 శాతం మేరకు మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, ఫొటోగ్రఫీ రంగాల్లోనే అవకాశాలు లభిస్తున్నాయి. అదే విధంగా రాజకీయ పార్టీల భారీ సభలు, వేడుకలకు డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీయించడం పరిపాటిగా మారింది. కాబట్టి డ్రోన్ పెలైట్‌లకు ఆయా రంగాల్లో ఉపాధి లభించే వీలుంది.
వ్యవసాయం, సర్వేయింగ్
డ్రోన్ రంగం పరంగా భవిష్యత్‌లో వ్యవసాయం, సర్వేయింగ్ రంగాల్లోనూ ఉపాధి విస్తరించనుంది. ఎందుకంటే... వ్యవసాయం రంగంలో డ్రోన్‌ల సహాయంతో విత్తనాలు, పురుగు మందులు చల్లడం వంటి కార్యకలాపాలకు ఆస్కారముంది. అలాగే సర్వేయింగ్ విభాగంలో.. మైనింగ్, రైల్వే ట్రాక్స్, ల్యాండ్ సర్వేలు చేసి వాటి వివరాలు డ్రోన్‌ల ద్వారా సేకరించి సంబంధిత వర్గాలకు చేరవేయడం లాంటివి ఊపందుకునే ఆవకాశమంది. ఉదాహరణకు రైల్వే ట్రాక్‌కు సంబంధించి నిర్దిష్ట ప్రాంతంలో ట్రాక్‌ను సర్వే చేసి వాటి వివరాలను రైల్వే టెక్నికల్ విభాగానికి పంపుతారు. వీటి ఆధారంగా ఆయా ట్రాక్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే మరమ్మతులు చేస్తారు. ప్రస్తుతం రోజుల తరబడి చేస్తున్న ఈ కార్యకలాపాలను డ్రోన్‌ల సహాయంతో గంటల వ్యవధిలోనే పూర్తిచేయొచ్చు.
తయారీలో టెక్ అభ్యర్థులు
డ్రోన్ పాలసీ ద్వారా ఉపాధి పరంగా టెక్నికల్ విద్యార్థులు కూడా ప్రయోజనం పొందనున్నారు. ముఖ్యంగా డ్రోన్‌ల తయారీ కోణంలో ఏరోడైనమిక్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు అవకాశం లభించనుంది. డ్రోన్‌ల డిజైన్, మోడలింగ్, 3-డి ప్రింటింగ్, అసెంబ్లింగ్, ప్రోగ్రామింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, వంటి విభాగాల్లో వీరికి ఉద్యోగవకాశాలు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. అదేవిధంగా డ్రోన్ కెమెరాలు పంపే చిత్రాలను విశ్లేషించి.. సంస్థలకు నివేదికలు ఇవ్వాల్సిన క్రమంలో అనలిస్ట్‌లకు కూడా డిమాండ్ పెరగనుంది. ముఖ్యంగా ల్యాండ్ సర్వేయింగ్, మైనింగ్ వంటి రంగాలకు సంబంధించిన అంశాల్లో ఈ అనలిస్ట్‌ల అవసరం ఎక్కువగా ఉంటోంది.
స్టార్టప్‌లకు కలిసొచ్చేలా
మరోవైపు స్వయం ఉపాధి పరంగానూ డ్రోన్ పాలసీ సరికొత్త వేదికగా నిలవనుంది. ముఖ్యంగా డ్రోన్‌ల తయారీ సంస్థలను ఏర్పాటు చేసే స్టార్టప్ ఔత్సాహికులకు ఎన్నో అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే మన దేశంలో దాదాపు 150 డ్రోన్ తయారీ సంస్థలున్నాయి. డ్రోన్ పాలసీ అమల్లోకి రానున్న నేపథ్యంలో వచ్చే ఏడాది వ్యవధిలో కొత్తగా 100కు పైగా డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్స్ ప్రారంభం కానున్నాయని ఈ రంగంలోని నిపుణుల అంచనా. ఈ స్టార్టప్ ఔత్సాహికులకు వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుంచి ఆర్థిక సహకారం కూడా లభించే అవకాశ ముంది. ఇప్పటికే డ్రోన్‌ల తయారీలో నిమగ్నమైన ఇండియాఫోర్జ్ సంస్థకు 23.77 మిలియన్ డాలర్ల ఫండింగ్ లభించింది. అదే విధంగా ఆరవ్ అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్‌కు ఏడున్నర లక్షల డాలర్లు, డిటెక్ట్ టెక్నాలజీస్‌కు ఏడు లక్షల డాలర్లు, క్రోన్ సిస్టమ్స్‌కు 6.6 లక్షల డాలర్లు, ద్రోణ ఏవియేషన్ సంస్థకు ఒక లక్ష డాలర్ల ఫండింగ్ లభించింది. వీటిని దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్తు స్టార్టప్ సంస్థలకు కూడా మంచి ఫండింగ్ లభించడం ఖాయం. అదే విధంగా తయారీ విభాగంలో చిన్న తరహా సంస్థల్లో కనీసం 50 మంది, భారీ సంస్థల్లో కనీసం రెండు వందల మంది ఉద్యోగుల అవసరం ఉంటుంది.
రెండో పెద్ద దేశంగా భారత్!
డ్రోన్‌ల వినియోగంలో ప్రస్తుతం అమెరికా తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో భారత్ నిలుస్తోంది. భారత్‌లో 2021 నాటికి 50 వేల మంది డ్రోన్ పైలట్ల అవసరం ఏర్పడనుందని అంచనా. మరోవైపు డ్రోన్ పైలట్లకు విదేశాల్లోనూ డిమాండ్ నెలకొంది. అసోసియేషన్ ఆఫ్ అన్ మ్యాన్డ్ వెహికిల్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ అంచనాల ప్రకారం 2025 నాటికి అంతర్జాతీయంగా లక్ష మంది డ్రోన్ పైలట్ల అవసరం ఏర్పడనుంది.
డ్రోన్ పైలట్.. శిక్షణ సంస్థలు
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రోన్స్
- మావన్ డ్రోన్ అకాడమీ
- ఇండియన్ అకాడమీ ఆఫ్ డ్రోన్స్
- నేషనల్ డ్రోన్ స్కూల్
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ
- నానో, మైక్రో డ్రోన్స్ వినియోగంలో ఎలాంటి అనుమతులు అవసరం లేదు.
- మిగతా కేటగిరీల్లో సంబంధిత అధికార వర్గాల అనుమతి తప్పనిసరి.
- పదో తరగతి అర్హత, ఇంగ్లిష్ నైపుణ్యం, ఫ్లయింగ్ శిక్షణ పూర్తి చేసుకుని.. డీజీసీఏ నిర్వహించే లెసైన్స్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధిస్తే డ్రోన్ పైలట్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు.
- డ్రోన్ పైలట్లకు ఆకర్షణీయమైన వేతనాలు (సగటున నెలకు రూ. 25 వేలు) లభించే వీలుంది.
- ఫ్రీలాన్స్ డ్రోన్ పెలైట్లు రోజుకి రూ.ఏడు వేల నుంచి రూ.పది వేలు పొందే అవకాశం.
- డ్రోన్ తయారీ సంస్థల్లో ఏరోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి.
- ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ బీఐఎస్ రీసెర్చ్ నివేదిక ప్రకారం 2021 నాటికి 885.7 మిలియన్ డాలర్లకు చేరుకోనున్న భారత డ్రోన్ పరిశ్రమ.
- డ్రోన్ వినియోగంలో రెండో పెద్ద దేశంగా నిలవనున్న భారత్.
- అంతర్జాతీయంగా 2021 నాటికి 21.47 బిలియన్ డాలర్లకు చేరుకోనున్న డ్రోన్ మార్కెట్.
- ఫిక్కీ, ఈవై నివేదిక ప్రకారం 2021 నాటికి 421 మిలియన్ డాలర్లకు చేరుకోనున్న భారత డ్రోన్ మార్కెట్.