ఐఐటీల్లో...హ్యుమానిటీస్! సోషల్ సెన్సైస్ !!

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు)లు అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ పట్టభద్రులను అందిస్తున్నాయి. అంతేకాకుండా బీటెక్ కోర్ సబ్జెక్టులకు అదనంగా ఆర్ట్స్, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్ సబ్జెక్టులను ఎలక్టివ్స్‌గా చేర్చి.. ఇంజనీరింగ్ విద్యార్థులకు సమాజంపై అవగాహన కలిగేలా చేస్తున్నాయి. ఐఐటీలు ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులకే పరిమితం కాకుండా.. సమాజంలోని సమస్యల పరిష్కారం గురించి అధ్యయనం చేసే సోషల్ సెన్సైస్‌లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో వివిధ ఐఐటీల్లో అందుబాటులో ఉన్న సోషల్ సెన్సైస్ పీజీ, పీహెచ్‌డీ కోర్సుల గురించి తెలుసుకుందాం...
ఐఐటీ మద్రాస్- హెచ్‌ఎస్‌ఈఈ 2019
ఐఐటీ మద్రాస్ నిర్వహించే హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ఎంట్రన్స్ ఎగ్జామ్(హెచ్‌ఎస్‌ఈఈ)కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. తాజాగా హెచ్‌ఎస్‌ఈఈ- 2019 నోటిఫికేషన్ విడుదలైంది.

హెచ్‌ఎస్‌ఎస్ :
ఐఐటీ మద్రాస్ ఏర్పడిన తొలినాళ్లలోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్(హెచ్‌ఎస్‌ఎస్)ను ఏర్పాటు చేశారు. హెచ్‌ఎస్‌ఎస్ డిపార్ట్‌మెంట్.. డెవలప్‌మెంట్ స్టడీస్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, ఫిల్మ్‌స్టడీస్, హెల్త్ స్టడీస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, హిస్టరీ, ఫిలాసఫీ, పాలిటిక్స్ అండ్ సోషియాలజీ స్పెషలైజేషన్లకు సంబంధించి నిష్ణాతులైన ఫ్యాకల్టీని కలిగుంది. మొదటి నుంచి మల్టిడిసిప్లినరీ దృక్పథం కలిగిన హెచ్‌ఎస్‌ఎస్ డిపార్ట్‌మెంట్.. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ స్థాయిల్లో ఎలక్టివ్ కోర్సులతోపాటు పోస్ట్ డాక్టోరల్ కోర్సులను అందిస్తోంది. 2006-07 నుంచి ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సును ప్రారంభించింది.

ప్రత్యేకత :
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్‌లో నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్యం పెరుగుతోంది. విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు వీలుగా.. ఐఐటీ మద్రాస్ ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సును విభిన్న స్పెషలైజేషన్ల (స్ట్రీమ్‌లు) కలయికతో ప్రత్యేకంగా రూపొందించింది. కోర్సులో భాగంగా విద్యార్థులను క్రిటికల్ థింకింగ్, రీసెర్చ్, ఐడియాస్, పీపుల్, సొసైటీ, ఎన్విరాన్‌మెంట్, హ్యూమన్ కండిషన్ తదితర అంశాల్లో నిపుణులుగా తీర్చిదిద్దుతారు. తద్వారా మానవ వనరుల పరంగా విశ్వవిద్యాలయాలు, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు, పబ్లిక్, ప్రైవేట్ రంగ కంపెనీల అవసరాలకు తగ్గ మానవ వనరుల కొరత తీర్చేందుకు ఐఐటీ మద్రాస్ కృషిచేస్తోంది.

కోర్సులు-సీట్లు..
  • ఇంటి గ్రేటెడ్ ఎంఏ ఇన్ డెవలప్‌మెంట్ స్టడీస్ (23 సీట్లు).
  • ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఇన్ ఇంగ్లిష్ స్టడీస్ (23 సీట్లు).
కోర్సు వ్యవధి: ఐదేళ్లు
  • ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులో మొత్తం 46 సీట్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్‌ఎస్‌ఈఈ ద్వారా పైన పేర్కొన్న రెండు స్ట్రీముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తొలి రెండేళ్ల పాటు విద్యార్థులందరికీ ఒకేరకమైన కరిక్యులం ఉంటుంది. అనంతరం స్వీయ ప్రాధాన్యతలు, తొలి మూడు సెమిస్టర్లలో అకడమిక్ ప్రతిభ, అందుబాటులో ఉన్న సీట్లను పరిగణలోకి తీసుకొని విద్యార్థులను రెండు స్ట్రీములుగా విభజిస్తారు.
అర్హత: ఐఐటీ మద్రాస్ అందించే ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సుల్లో చేరేందుకు అర్హత ఇంటర్ లేదా తత్సమానం.

పరీక్ష విధానం :
రాత పరీక్షలో ప్రతిభ ద్వారా ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తారు. రాత పరీక్షలో భాగంగా హెచ్‌ఎస్‌ఈఈ ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో రెండు పార్టులుగా ఉంటుంది. పార్ట్ 1 మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. పార్ట్ 2లో ఎస్సే రైటింగ్ ఉంటుంది. పరీక్ష సమయం 30 నిమిషాలు.
పార్ట్ 1 అంశాలు: టాపిక్స్: ఇంగ్లిష్ అండ్ కాంప్రహెన్షన్ స్కిల్స్, అనలిటికల్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ సొసైటీ అండ్ కల్చర్, వరల్డ్ అఫైర్స్, ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎకాలజీ. 
పార్ట్ 2: జనరల్ టాపిక్‌పై ఎస్సే రాయాల్సి ఉంటుంది.

ముఖ్యసమాచారం..
హెచ్‌ఎస్‌ఈఈ-2019:
ఏప్రిల్ 21, 2019.
పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ విద్యార్థులకు రూ.1200, ఇతరులకు రూ.2400
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్.
దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్12, 2019.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 23, 2019.
వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ ప్రారంభం: మార్చి 20, 2019.
వెబ్‌సైట్: https://hsee.iitm.ac.in

ఐఐటీ ఖరగ్‌పూర్ :
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల ప్రయాణంలో తొలి అడుగు.. ఐఐటీ ఖరగ్‌పూర్! ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ రెండు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను ఆఫర్‌చేస్తోంది. అవి.. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఇన్ ఎకనామిక్స్, మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్(ఎంహెచ్‌ఆర్‌ఎం). ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఎకనామిక్స్ కోర్సులోకి జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా అభ్యర్థులు ప్రవేశాలను ఖరారు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: www.iitkgp.ac.in

ఐఐటీ బాంబే :
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్... బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (ఎకనామిక్స్), ఎంఫిల్-ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. అప్లయిడ్ ఎకనామిక్స్ అనాలసిస్ నిపుణులను తీర్చిదిద్దే ఉద్దేశంతో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (ఎకనామిక్స్) కోర్సును ఐఐటీ బాంబే 2017లో ప్రారంభించింది. విద్యార్థులను బిజినెస్ అండ్ పబ్లిక్ పాలసీ, డెవలప్‌మెండ్ అడ్మినిస్ట్రేషన్, డెసిషన్ మేకింగ్ ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దడం ఈ కోర్సు ప్రధాన ఉద్దేశం. దీంతోపాటు హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్‌కు సంబంధించి ఎంఫిల్-ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్, పీహెచ్‌డీల్లోకి సైతం ఐఐటీ బాంబే అడ్మిషన్ కల్పిస్తోంది.
వెబ్‌సైట్: https://www.iitb.ac.in

ఐఐటీ గువహటి :
ఐఐటీ గువహటి... ఎంఏ డెవలప్‌మెంట్ స్టడీస్ కోర్సును 2009 నుంచి అందిస్తోంది. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ కోణంలో డెవలప్‌మెంట్ అంశాలను అర్థం చేసుకునేలా ఈ కోర్సును రూపొందించారు. ఫిబ్రవరి లేదా మార్చిలో ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల చేసి.. జూన్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు 48. అదే విధంగా ఐఐటీ గువహటి.. పీహెచ్‌డీ ఇన్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్‌ను కూడా అందిస్తోంది. ఎకనామిక్స్, ఇంగ్లిష్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, సోషియాలజీ, హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, పొలిటికల్ సైన్స్ విభాగాల్లో పీహెచ్‌డీలోకి ప్రవేశం కల్పిస్తోంది. నెట్ లేదా గేట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
వెబ్‌సైట్: www.iitg.ac.in

ఐఐటీ రూర్కీ :
ఐఐటీ రూర్కీ.. ఎంఎస్సీ ఎకనామిక్స్ కోర్సును అందిస్తోంది. మొత్తం 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి. జాయింట్ అడ్మిషన్ టెస్ ్ట(జామ్) ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ప్రవేశాలను ఖరారు చేస్తారు. దీంతోపాటు ఇంగ్లిష్, ఫైన్‌ఆర్ట్స్, ఎకనామిక్స్, సైకాలజీ, సోషియాలజీ స్ట్రీముల్లో పీహెచ్‌డీ పోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. ఎంఎస్సీ ఎకనామిక్స్ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాలసీ విశ్లేషకులు, ఆర్థిక సలహాదారులు, పరిశోధకులు, కన్సల్టెంట్‌లుగా అవకాశాలు అందుకునే వీలుంది.
వెబ్‌సైట్: www.iitr.ac.in

ఐఐటీ కాన్పూర్ :
ఐఐటీ కాన్పూర్... ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఫైన్ ఆర్ట్స్, ఫిలాసఫీ, సోషియాలజీ సబ్జెక్టుల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను ఆఫర్‌చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఇన్ ఎకనామిక్స్, పీహెచ్‌డీలను ఆఫర్‌చేస్తోంది. ఐఐటీ కాన్పూర్ అందించే బీఎస్ ప్రోగ్రామ్ ఇన్ ఎకనామిక్స్‌లో అడ్మిషన్ కోసం విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్: www.iitk.ac.in

ఐఐటీ ఢిల్లీ :
ఐఐటీ ఢిల్లీ.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్.. ఎకనామిక్స్, లిటరేచర్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, పాలసీ, సైకాలజీ, సోషియాలజీ విభాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశం కల్పిస్తోంది. దీంతోపాటు బీటెక్ విద్యార్థులకు సమ్మర్‌లో రూరల్ ఇంటర్న్‌షిప్‌లు, ఎకనామిక్స్, లింగ్విస్టిక్స్, లిటరేచర్, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీల్లో ఆబ్జెక్టివ్ కోర్సులను ఆఫర్‌చేస్తోంది.
వెబ్‌సైట్: https://hss.iitd.ac.in

ఐఐటీ గాంధీనగర్ :
ఐఐటీ గాంధీనగర్... రెండేళ్ల ఎంఏ ఇన్ సొసైట్ అండ్ కల్చర్ కోర్సును అందిస్తోంది. దాంతోపాటు హిస్టరీ, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, సైకాలజీ, సోషల్ ఎపిడిమాలజీ అండ్ సోషియాలజీ, పొలిటికల్ సైన్స్ విభాగాల్లో పీహెచ్‌డీ కోర్సును ఆఫర్‌చేస్తోంది. దీన్ని పూర్తిగా రెసిడెన్షియల్ కోర్సుగా అందిస్తోంది.
వెబ్‌సైట్: www.iitgn.ac.in

ఐఐటీ హైదరాబాద్ :
ఐఐటీ హైదరాబాద్... మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఎంఫిల్).. ఆంత్రోపాలజీ అండ్ సోషియాలజీ, ఇంగ్లిష్, కల్చరల్ స్టడీస్, సైకాలజీ, ఎకనామిక్స్‌లో అందిస్తోంది. దాంతోపాటు పీహెచ్‌డీలోకి అడ్మిషన్ కల్పిస్తోంది.
వెబ్‌సైట్: www.iith.ac.iin

ఐఐటీ పాట్నా :
ఐఐటీ పాట్నా... ఎంఎస్సీ ఎకనామిక్స్ కోర్సును అందిస్తోంది. దీంతోపాటు
ఎకనామిక్స్ ఇంగ్లిష్ లింగ్విస్టిక్స్ సోషియాలజీ హ్యూమన్ రిసోర్స్‌మేనేజ్‌మెంట్ పబ్లిక్ హెల్త్‌లో పీహెచ్‌డీలోకి ప్రవేశాలు కల్పిస్తోంది.
వెబ్‌సైట్: www.iitp.ac.in

ఐఐటీ తిరుపతి :
ఐఐటీ తిరుపతి... హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్‌లో పీహెచ్‌డీ పోగ్రామ్‌ను ఆఫర్‌చేస్తోంది. ఇంగ్లిష్: కల్చరల్ స్టడీస్, ఫిల్మ్ స్టడీస్, కంపారిటివ్ లిటరేచర్ ఇతర సంబంధిత విభాగాలు; ఎకనామిక్స్: డెవలప్‌మెంట్ ఎకనామిక్స్, కంపారిటివ్ పొలిటికల్ ఎకానమీ, డెవలప్‌మెంట్ స్టడీస్ వంటి సంబంధిత విభాగాలు; అదేవిధంగా ఫిలాసఫీ: సోషల్ అండ్ పొలిటిక్ ఫిలాసఫీల్లో పీహెచ్‌డీలోకి ప్రవేశం కల్పిస్తోంది.
వెబ్‌సైట్: https://iittp.ac.in