Fraud: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వద్ద రూ.6.42 లక్షల మోసం

cyber awareness

తిరువొత్తియూరు: టెలిగ్రామ్‌ యాప్‌ లింకు పంపి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నుంచి రూ.6.42 లక్షలు మోసం చేసిన కేసులో పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. తిరుపత్తూరు జిల్లా వానియంబాడికి చెందిన మహమ్మద్‌ ముస్తాక్‌ (30) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. అతనికి గత నెల 7వ తేదీన టెలిగ్రామ్‌ యాప్‌ నుంచి ఒక మెసేజ్‌ వచ్చింది. అందులో ఇంటి నుంచే పార్ట్‌ టైమ్‌ పని చేసి డబ్బు సంపాదించవచ్చని సమాచారం ఉంది. దాన్ని నమ్మిన మహమ్మద్‌ ముస్తాక్‌ లింకు ఓపెన్‌ చేశాడు.

అందులో వివరాలను పంపించాడు. అతనికి వచ్చిన టాస్కులను పూర్తి చేసి పంపించగా అకౌంటుకు రూ.150, తర్వాత 9,000 అని వచ్చింది. దీంతో అతను మహమ్మద్‌ ముస్తాకు స్టార్‌ మార్కులు ఇచ్చారు. దీంతో రూ.20 వేలు, రూ.24,000 వచ్చింది. సంతోషపడిన అతను పైగా నగదు సంపాదించాలని రూ.30 వేలు బృందానికి పంపించారు. ఒకే వ్యక్తి బ్యాంకు ఖాతా నగదు చెల్లించిన ఎడల రూ.మూడు రెట్లు ఎక్కువగా నగదు వస్తుందని చెప్పడంతో అతను తన బ్యాంకు ఖాతా వివరాలు పంపించాడు. ఆ తర్వాత మహమ్మద్‌ ఖాతా నుంచి రూ.6.42 లక్షలు పంపించాడు. తర్వాత అతనికి ఎలాంటి మెసేజ్‌ రాలేదు. దీంతో మోసపోయిన మహమ్మద్‌ ముస్తాక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దీనిపై విచారణ చేస్తూ ఉన్నారు.

#Tags