పవనాలు
క్షితిజ సమాంతరంగా వీచే గాలిని ‘పవనం’ అని, నిలువుగా లేదా ఊర్ధ్వముఖంగా వీచే గాలిని ‘గాలి ప్రవాహం’ అని అంటారు. గాలి వీచే దిక్కుని బట్టి పవనాలకు నామకరణం చేస్తారు. ఉదాహరణకు తూర్పు నుంచి వీచే పవనాలను తూర్పు పవనాలని, పశ్చిమం నుంచి వీచే పవనాలను పశ్చిమ పవనాలని, ఈశాన్యం నుంచి వీచే పవనాలను ఈశాన్య పవనాలని పిలుస్తారు. పవన వేగాన్ని ‘ఎనిమోమీటర్’తో, వీచే దిక్కును పవన సూచి అనే పరికరంతో కొలుస్తారు. పవన వేగాన్ని గంటకు మైళ్లలో లేదా కిలోమీటర్లలో కొలుస్తారు.
పవన చలనాలను ప్రభావితం చేసే అంశాలు
పీడన ప్రవణత బలాలు: క్షితిజ సమాంతర పీడన వ్యత్యాసం వల్ల ఈ బలం జనిస్తుంది. ఈ బలం అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతాల వైపు పనిచేస్తుంది. పీడన మార్పును అనుసరించి పవన దిశ ఉంటుంది. పవన దిశ సమభార రేఖలకు లంబంగా ఉంటుంది.
కొరియాలిస్ బలం: భూభ్రమణం వల్ల పవనాలు పీడన ప్రవణతను అనుసరించి సమభార రేఖలకు లంబంగా పయనించకుండా అపవర్తనం చెందుతాయి. భూభ్రమణం వల్ల జనించే ఈ మార్పునే కొరియాలిస్ బలం అంటారు.
ఒక చోటు నుంచి మరో చోటుకు స్వాభావికంగా కదులుతున్న ప్రతి వస్తువు ఉత్తరార్ధ గోళంలో దాని కుడి పక్కకు, దక్షిణార్ధ గోళంలో దాని ఎడమ పక్కకు వంగి కదులుతుంది. దీన్నే కొరియాలిస్ బలం అంటారు. - ఫై
ఘర్షణ బలాలు: ఎగుడు దిగుడుగా ఉండే భూ ఉపరితలం పవనాల గమనానికి నిరోధం కలిగిస్తుంది. దీన్నే ఘర్షణ బలం అంటారు. ఈ ఘర్షణ బలం పవనాల దిశను, వేగాన్ని ప్రభావితం చేస్తుంది. సమతలంగా ఉండే సముద్రాల మీద ఘర్షణ తక్కువగా ఉండటం వల్ల పవనాలు వేగంగా, ఎలాంటి ఆటంకం లేకుండా ప్రయాణిస్తాయి.
అపకేంద్ర బలాలు: ఒక కేంద్రం చుట్టూ వర్తులాకారంలో భ్రమించే వస్తువును కేంద్రానికి దూరంగా నెట్టే అపకేంద్ర బలం ఆ వస్తువు గమన వేగంపై ఆధారపడి ఉంటుంది. పవనాలు అపవర్తనం చెందినప్పుడు అపకేంద్ర బలాలు అధికమవుతాయి. పవన వేగం ఎక్కువైనప్పుడు అపకేంద్ర బలాలు కూడా పెరుగుతాయి.
పవనాల వర్గీకరణ: పవనాల వేగం, అవి వీచే దిశ, వీచే కారణం లాంటి అంశాల ఆధారంగా పవనాలను మూడు రకాలుగా విభజిస్తారు. అవి:
1. ప్రపంచ పవనాలు
2. రుతుపవనాలు
3. స్థానిక పవనాలు
ప్రపంచ పవనాలు
ప్రపంచ పీడన మేఖలలో నిరంతరాయంగా, క్రమబద్ధంగా వీచే గాలులను ప్రపంచ పవనాలు అంటారు. ఇవి మూడు రకాలు. అవి..
ఎ. వాణిజ్య పవనాలు
బి. పశ్చిమ పవనాలు
సి. ధ్రువ పవనాలు
వాణిజ్య పవనాలు: వీటినే వ్యాపార పవనాలని అంటారు. ఇవి ఉత్తర, దక్షిణ ఉప ఆయనరేఖా అధిక పీడన మేఖలల నుంచి భూమధ్యరేఖ అల్పపీడన మేఖలల వైపు వీస్తుండటం వల్ల వీటిని ఈశాన్య వ్యాపార పవనాలని, ఆగ్నేయ వ్యాపార పవనాలని అంటారు. పూర్వకాలంలో సముద్రంపై వ్యాపారం కోసం నాటు పడవలు ఉపయోగించేవారు. పడవలు ప్రయాణించేందుకు ఈ పవనాలు ఉపయోగకరంగా ఉండటం వల్ల వీటికి వ్యాపార పవనాలని పేరు వచ్చింది.
పశ్చిమ పవనాలు: వీటిని ప్రతివ్యాపార పవనాలు అని కూడా అంటారు. ఇవి 30°-40° ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉంటాయి. ఉప ఆయన రేఖా ప్రాంతం నుంచి ఉప ధ్రువప్రాంతం వైపు వీస్తాయి. ఫెరల్ సూత్రం అనుసరించి ఇవి ఉత్తరార్ధ గోళంలో నైరుతి నుంచి దక్షిణార్ధ గోళంలో వాయవ్యం నుంచి వీస్తాయి. అంటే వ్యాపార పవనాలకు వ్యతిరేక దిశలో ఇవి వీస్తుంటాయి. అందుకే వీటికి ప్రతి వ్యాపార పవనాలు అని పేరొచ్చింది. విశాల భూ భాగంపై వీస్తున్న ఈ పవనాలను ‘సాహస పశ్చిమ పవనాలు’ అని పిలుస్తారు. 40 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య భీకర శబ్దంతో లేచిపడే తరంగాలతో భయంకరంగా వీచే ఈ పవనాలను గర్జించే నలభైలు అని పిలుస్తారు.
ధ్రువ పవనాలు: వీటినే తూర్పు పవనాలు అంటారు. ఉత్తర-దక్షిణ ధ్రువాల నుంచి సమశీతోష్ణమండల అల్పపీడన మేఖల వైపు వీచే పవనాలను ధ్రువ పవనాలు అంటారు. ఇవి ధ్రువాల్లోని అధిక పీడన మండలం నుంచి ఉత్తర దక్షిణ ఉపధ్రువ అల్పపీడన మండలం వైపు వీస్తుంటాయి. ఫెరల్ సూత్రం అనుసరించి ఉత్తరార్ధ గోళంలో ఈశాన్యం నుంచి, దక్షిణార్ధగోళంలో ఆగ్నేయం నుంచి వీయడం వల్ల వీటికి ఈశాన్య ధ్రువ పవనాలని, ఆగ్నేయ ధ్రువ పవనాలని పేరొచ్చింది.
ప్రపంచ పవనాల ప్రభావం: వాతావరణంపై శిలావరణం, జలావరణం చూపే ప్రభావం వల్ల పీడనం, పవనాల్లో తేడాలు ఏర్పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వేడిని, తేమను రవాణా చేయడంలో పవనాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే ప్రపంచంలో ఏ భాగం కూడా ప్రాణులు జీవించలేనంతగా వేడెక్కదు లేదా చల్లబడదు. అయితే ఈ పవనాలు ప్రపంచమంతటా వేడిని, తేమను సమంగా పంచడం లేదు. అందుకే ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు వేడిగా ఉండగా మరికొన్ని ప్రాంతాలు శీతలంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం సంభవిస్తుండగా, కొన్ని ప్రాంతాలు ఎడారులుగా ఉన్నాయి.
రుతు పవనాలు
భారతదేశంలో వర్షపాతం ప్రధానంగా రుతుపవనాల వల్ల సంభవిస్తుంది. రుతు పవనాలను ఆంగ్లంలో ‘మాన్‌సూన్’ అంటారు. మాన్‌సూన్ అనే పదం ‘మౌసమ్’ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. భూమి, నీరు చల్లబడటం, వేడెక్కడంలో తేడాల వల్ల రుతుపవనాలు ఏర్పడతాయి. ఆగ్నేయ వాణిజ్య పవనాలు భూమధ్య రేఖను దాటడంతో వాయవ్య భారతంలో రుతుపవనాలు ఏర్పడ తాయి. కొరియాలిస్ ప్రభావం వల్ల భారత ద్వీపకల్పంలో, పొరుగు దేశాల్లో నైరుతి రుతుపవనాలు ఏర్పడతాయి. శీతాకాలంలో పీడన మేఖలలు మారడంతో ఈశాన్య వాణిజ్య పవనాలు భూమధ్య రేఖను దాటుతాయి. కొరియాలిస్ ప్రభావం వల్ల ఇవి ఉత్తర, ఈశాన్య ఆస్ట్రేలియాలో వాయవ్య రుతుపవనాలు అవుతాయి.
స్థానిక పవనాలు
స్థానికంగా ఉండే ఉష్ణోగ్రతలు, పీడనాల్లో తేడా వల్ల స్థానిక పవనాలు వీస్తాయి. ఇవి చాలా తక్కువ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి. ఉష్ణ స్థానిక పవనాలు ఆ ప్రాంత ఉష్ణోగ్రతలను పెంచుతాయి. శీతల స్థానిక పవనాల వల్ల కొన్ని సందర్భాల్లో ప్రభావిత ప్రాంతంలోని ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థానం కంటే తక్కువగా నమోదవుతాయి. ఈ స్థానిక పవనాలు ట్రోపో ఆవరణంలోని దిగువ పొరల్లో వీస్తాయి. కొండ, లోయ పవనాలు, సముద్ర, భూ పవనాలు కూడా ఒక రకమైన స్థానిక పవనాలే. వాతావరణంలోని కింది పొరలు వేడేక్కడం, చల్లబడటంలోని తేడాల వల్ల ఏర్పడే పీడన తేడాల వల్ల ఈ పవనాలు ఏర్పడతాయి.
స్థానిక పవనాలు రెండు రకాలు అవి:
ఎ) ఉష్ణ స్థానిక పవనాలు
ఫోన్: ఇవి ఆల్ఫ్స్ పర్వతాల నుంచి స్విట్జర్లాండ్ వైపు వీచే వేడి, పొడి పవనాలు. వీటి ఉష్ణోగ్రత 15° సెంటీగ్రేడ్ నుంచి 28° సెంటీ గ్రేడ్ వరకు ఉంటుంది. ఇవి స్థానిక వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
చినూక్: ఇవి అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా దేశాల్లోని రాకీ పర్వతాలకు తూర్పున ఏర్పడే వెచ్చని పొడి పవనాలు. ఇవి శీతాకాలంలో అధికంగా వీస్తాయి. వీటి ప్రభావం వల్ల పర్వతాలపై మంచు కరుగుతుంది. అందువల్ల వీటిని ‘హిమభక్షకి’ అని పిలుస్తారు.
శాంతా అన్నా: ఇది అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో వీచే వేడి, పొడిగాలి చినూక్‌ను పోలి ఉంటుంది. ఈ పవనాల వల్ల చెట్లు ఎండిపోయే ప్రమాదం ఉంది. శాంతా అన్నాను పోలి ఉండే వెచ్చని పవనాలను జపాన్‌లో యమో అని, అర్జెంటీనాలో ఆండీస్ పర్వతాల మీదుగా వీచే పవనాలను జొండా అని పిలుస్తారు.
సిరోకో: సహారా ఎడారి నుంచి మధ్యధరా సముద్రం మీదుగా దక్షిణ యూరప్‌లోకి వీచే ధూళితో కూడిన వేడి, పొడి పవనాలను ‘సిరోకో’ అని పిలుస్తారు.
సిమూన్: ఆసియా, ఆఫ్రికా ఎడారుల్లో వీచే తీవ్రమైన వేడిపొడి గాలులను సిమూన్ అంటారు.
హర్మటన్: సహారా ఎడారిలో ఏర్పడి ఆఫ్రికా పశ్చిమ తీరం మీదుగా వీచే వేడి, పొడి గాలులను హర్మటన్ అంటారు.
నార్వెస్టర్లు: ఇవి న్యూజిలాండ్‌లో వీచే వెచ్చని పొడి గాలులు.
బి) శీతల స్థానిక పవనాలు
మిస్ట్రాల్: ఆల్ఫ్స్ పర్వతాల నుంచి ఫ్రాన్స్ మీదుగా మధ్యధరా సముద్రం వైపు వీచే శీతల పవనాలు మిస్ట్రాల్ గాలులుగా పేరొందాయి. ఇవి రోమ్ లోయ ద్వారా వీస్తాయి. ఈ గాలులు చాలా చల్లగా, పొడిగా ఉంటాయి.
బోరా: ఇవి యుగోస్లోవియా నుంచి ఏడ్రియాటిక్ సముద్రం మీదుగా వీచే శీతల పవనాలు. ఇవి గంటకు 128 నుంచి 196 కి.మీ వేగంతో వీస్తాయి. ఇవి వాతావరణాన్ని భయంకరంగా మార్చడమే కాకుండా పంటలకు కూడా తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి.
ప్యూనా: ఇవి ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు.
పాంపెరొ: ఇవి దక్షిణ అమెరికాలోని పంపాల ప్రాంతంలో వేగంగా వీచే శీతల ధ్రువ పవనాలు.

#Tags