రక్తవర్గాలు (Blood Groups)
కార్ల్ లాండ్ స్టీనర్ అనే శాస్త్రవేత్త 1900లో A, B, O అనే మూడు రక్త వర్గాలను కనుగొన్నాడు. ఇతడిని ‘రక్తవర్గాల పితామహుడి’గా పేర్కొంటారు. AB రక్త వర్గాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు డీకాస్టెల్లా, స్టర్లీ (1902). ఏటా జూన్14న 'ప్రపంచ రక్తదాన దినోత్సవం' జరుపుకొంటారు.
- పరిపూర్ణ ఆరోగ్యవంతమైన వ్యక్తి తన జీవిత కాలంలో 168 సార్లు రక్తదానం చేయవచ్చు. దానం చేసిన తర్వాత వారం రోజుల్లో రక్తం తిరిగి ఉత్పత్తి అవుతుంది.
- ప్రపంచంలో అధికంగా (72 80%) ఉండే రక్త వర్గం B+Ve.
- ప్రపంచంలో అతి తక్కువగా (1%) ఉండే రక్త వర్గం AB–Ve.
- ప్రమాదం జరిగిన వ్యక్తి రక్త వర్గం తెలియనప్పుడు O Rh–Ve వర్గం రక్తాన్ని ఇవ్వవచ్చు. ప్రపంచంలో ఏ వ్యక్తికైనా దీన్ని అందించవచ్చు.
- O రక్త వర్గం వారిని ‘విశ్వ దాత’ (Universal Donor) అంటారు. ఈ రక్త వర్గంలో Antigens (ప్రతిజనకాలు) ఉండవు.
- AB రక్త వర్గం ఉన్న వారిని ‘విశ్వ గ్రహీత’ (Universal Recipient) అంటారు. ఈ రక్త వర్గంలో Antibodies (ప్రతిరక్షకాలు) ఉండవు.
- సాధారణంగా రక్త వర్గాలను ఎర్ర రక్త కణాల (RBC)పై ఉండే Antigen (A or B) ఆధారంగా నిర్ణయిస్తారు. ప్లాస్మాలో రెండు రకాల ప్రతిరక్షక దేహాలుంటాయి. అవి.. ప్రతిరక్షకం A, ప్రతిరక్షకం B.
రక్త గ్రూపులు వంశ పారంపర్యంగా వస్తాయి. వీటిని నిర్ణయించే జన్యువులు 9వ క్రోమోజోమ్‌పై ఉంటాయి. ప్రతి వ్యక్తిలో రక్త గ్రూప్‌నకు సంబంధించిన రెండు జన్యు కారకాలు ఉంటాయి. ఇందులో ఒకటి తల్లి నుంచి, మరొకటి తండ్రి నుంచి వస్తుంది. ఈ రెండింటిలో సంతానానికి ఒక జన్యు కారకమే చేరుతుంది. రెండు రకాల కారకాలు ఒకే రకంగా ఉన్నప్పుడు పురుషుల్లో ఒకే రకమైన శుక్రకణాలు లేదా స్త్రీలలో ఒకే రకమైన అండాలు ఏర్పడతాయి.
- భారత్‌లో సగటున
1) A రక్తవర్గం ఉన్నవారు - 24 శాతం
2) B రక్తవర్గం ఉన్నవారు - 38 శాతం
3) AB రక్తవర్గం ఉన్నవారు - 8 శాతం
4) O రక్తవర్గం ఉన్నవారు - 30 శాతం
- భారత్‌లో సగటున
1) A రక్తవర్గం ఉన్నవారు - 24 శాతం
2) B రక్తవర్గం ఉన్నవారు - 38 శాతం
3) AB రక్తవర్గం ఉన్నవారు - 8 శాతం
4) O రక్తవర్గం ఉన్నవారు - 30 శాతం
రక్తం గ్రూప్ | RBCపైన ప్రతిజనకం | ప్లాస్మాలో ప్రతిరక్షకం | ఎవరికి ఇవ్వొచ్చు | ఎవరి నుంచి తీసుకోవచ్చు | ఎవరి నుంచి తీసుకోకూడదు |
A | A | B | A, AB | A, O | B, AB |
B | B | A | B, AB | B, O | A, AB |
AB | AB | ఉండవు | AB | విశ్వగ్రహీత AB, A, B, O | అందరి నుంచి తీసుకోవచ్చు |
O | ఉండవు | AB | విశ్వదాత O, A, B, AB | O | A, B, AB |
Rh కారకం
Rh కారకాన్ని కార్ల్ లాండ్ స్టీనర్, వీనర్ 1940లో కనుగొన్నారు. ఇది Rh కూడా ఒక రకమైన ప్రతిజనకం. ఇవి కూడా RBCలపై ఉంటాయి. Rh కారకాన్ని మొదట ఆగ్నేయాసియాలో మాత్రమే కనిపించే రీసస్ కోతుల (Macacul rhesus)లో గుర్తించారు. దీన్ని 'D' యాంటీజెన్ అని కూడా అంటారు.
- రీసస్ కోతులు మధ్యప్రదేశ్‌లోని పెంచ్ జాతీయ పార్క్ లో ఉన్నాయి.
- భారతదేశ జనాభాలో 93 శాతం Rh కారకం ఉంటుంది. మిగిలిన 7 శాతం జనాభాలో Rh కారకం ఉండదు.
- ఒక వ్యక్తి RBCలపై Rh కారకం (Antigen) ఉంటే.. B రక్త వర్గాన్ని Rh+ve అని, Rh కారకం లేకుంటే ఆ రక్తవర్గాన్ని Rh–ve అని పిలుస్తారు.
- యూరప్ జనాభాలో Rh+ve, Rh–ve జనాభా నిష్పత్తి వరసగా 85 శాతం, 15 శాతం.
ఎరిత్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్
Rh+ve రక్త వర్గం ఉన్న పురుషుడు, Rh–ve రక్త వర్గం ఉన్న స్త్రీకి జన్మించిన శిశువు రక్తవర్గం Rh+ve అయితే శిశువు రక్త వర్గానికి వ్యతిరేకంగా తల్లి రక్తంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఇది చాలా నెమ్మదిగా జరిగే చర్య. ఇవి ఉత్పత్తి అయ్యే సమయానికి శిశువు జన్మిస్తుంది.
ఒకవేళ రెండో కాన్పులోనూ Rh+ve శిశువు జన్మిస్తే తల్లి శరీరంలో ఉత్పత్తై Antibodies శిశువులో RBCలను విచ్ఛిన్నం చేయడం వల్ల శిశువు మరణిస్తుంది. దీన్ని ‘ఎరిత్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్’ అంటారు. దీని నివారణకు మొదటి కాన్పు తర్వాత తల్లికి Anti Rh Antibody (or) Anti–D Injection ఇంజెక్షన్ ఇస్తారు. దీన్ని జేమ్స్ హరిసన్ కనుగొన్నాడు.
రక్త దానం
ఒక వ్యక్తి రక్తాన్ని మరో వ్యక్తికి అతడి సిరల ద్వారా ఎక్కించడాన్ని రక్త ప్రవేశం అంటారు.
- ప్రతిజనకం, ప్రతిరక్షకాల చర్య వల్ల రక్త గుచ్ఛీకరణం జరుగుతుంది. రక్త కణాలు గుంపులుగా ఏర్పడటాన్ని ‘గుచ్ఛీకరణం’ (Agglutination) అంటారు.
- 16-60 ఏళ్ల మధ్య ఉన్న ఆరోగ్యవంతమైన స్త్రీ, పురుషులు రక్తదానం చేయవచ్చు.
- రక్త దాతలకు హెపటైటిస్-బి, లుకేమియా, ఎయిడ్స్, మలేరియా లాంటి వ్యాధులు ఉండకూడదు.
- ఒక వ్యక్తి 3 లేదా 4 నెలలకు ఒకసారి ఒక యూనిట్ (300 ఎం.ఎల్.) రక్తాన్ని దానం చేయవచ్చు.
- మేనరిక వివాహాలు చేసుకోవడం వల్ల అంగవైకల్యం, హిమోఫిలియా వ్యాధితో పిల్లలు పుట్టే ప్రమాదం ఉంటుంది. దీనికి కారణం బ్లడ్ గ్రూప్ కలవకపోవడం.
రక్తనాళాలు (Blood Vessels)
రక్తం సరఫరా చేసే గొట్టాలను రక్తనాళాలు అంటారు. ఇవి మూడు రకాలు...
1) ధమనులు (Arteries)
2) సిరలు (Veins)
3) రక్తకేశనాళికలు (Blood Capillaries)
ధమనులు
ఇవి గుండె నుంచి మంచి రక్తాన్ని వివిధ శరీర భాగాలకు తీసుకుపోతాయి. ధమనుల్లో ఎల్లప్పుడూ మంచి రక్తం ప్రవహిస్తుంది. కానీ పుపుస ధమనుల్లో చెడు రక్తం ప్రవహిస్తుంది. ధమనులు దృఢంగా ఉండే రక్తనాళాలు. ధమనుల కుడ్యం మధ్య కంచుకంలో ఎలాస్టిన్ తంతువులు, నునుపు కండరాలు ఉండటం వల్ల ఇవి మందంగా ఉంటాయి. వీటికి ఇరుకైన కుహరం ఉంటుంది. కవాటాలు ఉండవు.
ధమనుల్లో రక్తపీడనం అధికం. వీటిలో రక్తం నెమ్మదిగా అలల మాదిరిగా (కుదుపులతో) ప్రవహిస్తుంది. ధమనులు రక్త కేశనాళికలతో అంతమవుతాయి.
ముఖ్యమైన ధమనులు
1. మహాధమని (దైహిక ధమని)
2. పుపుస ధమని
3. కరోనరీ ధమని
4. వెర్టిబ్రల్ ధమని
5. వృక్క ధమని
మహాధమని (దైహిక ధమని): ఇది అతిపెద్ద ధమని. ఇది ఎడమ జఠరిక నుంచి బయలుదేరి O2తో కూడిన రక్తాన్ని వివిధ శరీర భాగాలకు తీసుకెళుతుంది.
పుపుస ధమని: ఇందులో చెడురక్తం ప్రవహిస్తుంది. ఇది చిన్న ధమని. ఇది హృదయం కుడి జఠరిక నుంచి బయలుదేరి CO2తో కూడిన రక్తాన్ని ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. సిరా రక్తాన్ని ఆక్సిజనేషన్ కోసం ఊపిరితిత్తులకు చేరవేసే రక్తనాళాలు ‘పుపుస ధమనులు’.
కరోనరీ ధమనులు (హృదయ ధమని): ఇవి ఒక జత హృదయ కండరాలకు మంచి రక్తాన్ని సరఫరా చేస్తాయి. వీటిలో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే హృదయ కండరాలకు O2, ఆహారం సరఫరా కాదు. దీంతో గుండె తాత్కాలికంగా ఆగిపోతుంది. దీన్ని గుండెపోటు (Heart attack) అంటారు. దీన్నే Silent Killer (నిశ్శబ్ద హంతకి) అని కూడా అంటారు.
గుండెపోటును వైద్య పరిభాషలో అక్యూట్‌మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్ అంటారు. కరోనరి ధమనుల్లో కాల్షియం, కొవ్వులు, కొలెస్ట్రాల్, తంతు కణజాలం పేరుకొని ధమని కుహరం ఇరుకుగా మారడం వల్ల గుండెపోటు వస్తుంది. దీన్నే కరోనరీ ధమని వ్యాధి (Coronary artery disease-CAD) అని కూడా అంటారు. పొగ తాగడం, మధుమేహం, అధిక రక్తపోటు దీన్ని రెట్టింపు చేస్తాయి.
ఆంజీనా పెక్టోరిస్
గుండె కండరాలకు O2, ఆహారం అందకపోవడం వల్ల ఛాతీలో.. ముఖ్యంగా ఎడమ ఛాతీలో నొప్పి కలుగుతుంది. దీన్నే ఆంజీనా పెక్టోరిస్ అంటారు. ఇది గుండెపోటుకు ప్రారంభ సూచీ. ఇది స్త్రీ- పురుషుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరికీ వస్తుంది. పొగ తాగడం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు అంజినా పెక్టోరిస్‌కు కారణాలు.
కార్డియాక్ అరెస్ట్
గుండె విద్యుత్ తీవ్రతలో సంభవించే లోపాల వల్ల హఠాత్తుగా గుండె కొట్టుకోవడం ఆగిపోవడాన్ని ‘కార్డియాక్ అరెస్ట్’ (Cardiac Arrest) అంటారు. దీని వల్ల వ్యక్తి సృహ కోల్పోవడంతోపాటు కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరణించే ప్రమాదం ఉంటుంది.
హృదయ వైఫల్యం (Heart failure)
గుండె శరీర అవసరాలకు సరిపడా రక్తాన్ని పంప్ చేయలేని స్థితిని హృదయ వైఫల్యం అంటారు. దీనికి కారణాలు.. 1) గుండెపోటు, 2) నిక్రోసిస్, 3) అధిక రక్తపోటు. నిక్రోసిస్ అంటే హృదయ కణజాలం స్థానికంగా మరణించడం.
వెర్టిబ్రల్ ధమని: మెదడుకు మంచి రక్తం సరఫరా చేసే ధమనిని వెర్టిబ్రల్ ధమని అంటారు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ పిలిప్ హ్యూస్ మరణానికి కారణం వెర్టిబ్రల్ ధమని చిట్లిపోవడమే.
వృక్క ధమని: ఇది మూత్రపిండాలకు మంచి రక్తాన్ని అందిస్తుంది.
సిరలు
ఇవి శరీర భాగాల నుంచి చెడు రక్తాన్ని గుండెకు తీసుకువస్తాయి. సిరల్లో చెడు రక్తం ప్రవహిస్తుంది. కానీ, పుపుస సిరల్లో మాత్రం మంచి రక్తం ప్రవహిస్తుంది. వీటికి దృఢత్వం తక్కువగా ఉంటుంది. వీటి కుడ్యం పలచగా ఉంటుంది. విశాలమైన కుహరం, కవాటాలు ఉంటాయి. సిరల్లో రక్త పీడనం తక్కువగా ఉంటుంది. వీటిలో రక్తం దారలా ప్రవహిస్తుంది. ఇవి రక్తకేశనాళికలతో ప్రారంభమవుతాయి.
ముఖ్యమైన సిరలు
1. పూర్వ మహాసిర
2. అథో మహాసిర/ పశ్చిమ మహాసిర
3. పుపుస సిర
4. కరోనరీ సిర
5. వృక్క సిర
వృక్క సిర: ఇది మూత్రపిండాల నుంచి చెడు రక్తాన్ని కుడి కర్ణికకు చేరవేస్తుంది.
- రక్తనాళాల గురించి చేసే అధ్యయనాన్ని ‘ఆంజియాలజీ’ అంటారు.
- రక్తనాళాల్లో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే సరిచేసే ప్రక్రియను ‘ఆంజియోప్లాస్టీ’ అంటారు.
- రక్తనాళాల్లో ప్రవహించే రక్తం చిత్రాలను తెలిపే పరికరం - ఆంజియోగ్రామ్.
- పేరుకుపోయిన కొలెస్ట్రాల్ చిత్రాలను ఆంజియోగ్రాఫ్ అంటారు.
- F.F.R. (Fraction Flow Reserve) అనేది ఒక రోగికి ఆంజియోగ్రాఫ్ అవసరమో కాదో నిర్ధారించే పరీక్ష.
#Tags