ప్రపంచంలో పశుసంపద అధికంగా ఉన్న దేశం ఏది?
1. జతపరచండి.
ఆదిమ తెగ | ప్రాంతం |
a) ఓంజస్ | 1) కార్ నికోబార్ |
b) జార్వాస్ | 2) మధ్య, దక్షిణ అండమాన్ |
c) శాంటినలీస్ | 3) సెంటినల్ దీవి |
d) షోంపైన్ | 4) గ్రేట్ నికోబార్ |
ఎ) a-1, b-2, c-3, d-4
బి) a-4, b-3, c-2, d-1
సి) a-1, b-4, c-3, d-2
డి) a-1, b-2, c-4, d-3
- View Answer
- సమాధానం: ఎ
2. కింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది?
ఎ) కృష్ణగంగ అనేది జీలంనదికి ఉపనది
బి) పోంగ్ రిజర్వాయర్ బియాస్ నదిపై ఉంది
సి) ఉకాయ్ ప్రాజెక్టు నర్మదా నదిపై ఉంది
డి) ఊలార్ అనే ఎద్దు అడుగు సరస్సు(Ox -bow lake) జీలం నదిపై ఉంది
- View Answer
- సమాధానం: సి
3. కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
ఎ) నాథులా కనుమ స్పిటి నదీలోయలో ఉంది
బి) షిప్కిలా కనుమ సింధూ నదీలోయలో ఉంది
సి) సియాచిన్ హిమానీనదం నుభ్ర లోయలో ఉంది
డి) భారతదేశంలో దక్షిణ సరిహద్దుగా ఉన్న కార్డమమ్ కొండలు తూర్పు కనుమల రూపాంతరాలు
- View Answer
- సమాధానం: సి
4. కింద తెలిపిన వివరాలు వాతావరణంలో ఏ ఆవరణానికి సంబంధించినవి?
1) ఇది సగటున 13 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది
2) ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది
3) వాతావరణ అలజడులు సంభవిస్తాయి
ఎ) ట్రోపోస్పియర్
బి) స్ట్రాటోస్పియర్
సి) మీసోస్పియర్
డి) థర్మోస్పియర్
- View Answer
- సమాధానం: ఎ
5. కింది వాటిలో సరైన వ్యాఖ్యలు ఏవి?
1) 180ని రేఖాంశాన్ని అనుసరిస్తూ గీసిన వక్రరేఖను ‘అంతర్జాతీయ దినరేఖ’ అంటారు
2) సూర్యుడు గ్రీనిచ్‌కు తూర్పున ఉన్న ప్రాంతాల్లో ముందుగా ఉదయించడం వల్ల ఆ ప్రాంతాలు సమయం విషయంలో లాభాన్ని పొందుతాయి. గ్రీనిచ్ పశ్చిమ ప్రాంతాల్లో సూర్యుడు ఆలస్యంగా ఉదయించడం వల్ల ఆ ప్రాంతాలు సమయంలో నష్టాన్ని పొందుతాయి
3) అంతర్జాతీయ దినరేఖకు ఇరువైపులా ఒక రోజు కాల వ్యత్యాసం ఉంటుంది
4) అంతర్జాతీయ దినరేఖను తూర్పునుంచి దాటేవారు తమ సమయంలో 1 రోజు నష్టపోతారు
ఎ) 1, 2, 3
బి) 1, 2, 4
సి) 2, 3, 4
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: డి
6. కింద తెలిపిన వివరాలు ఏ పంటకు సంబంధించినవి?
1) ఒండ్రుమట్టి నేలలు అనుకూలం
2) సగటు వార్షిక వర్షపాతం 150 సెం.మీ. అవసరం
3) వార్షిక సగటు ఉష్ణోగ్రతలు 24°C - 35°C అవసరం
4) దేశంలో హుగ్లీ నదీలోయ ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తారు.
ఎ) వరి
బి) చెరకు
సి) జనుము
డి) మొక్కజొన్న
- View Answer
- సమాధానం: సి
7. కింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది?
ఎ) ధన్వంతరి - రోగులకు ఔషధాలు ఇవ్వడం కోసం ప్రవేశపెట్టిన రైలు
బి) ప్యాలెస్ ఆన్ వీల్స్ - దేశంలో అత్యంత విలాసవంతమైన రైలు
సి) రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్ - ఎయిడ్సపై చైతన్యం కలిగించడానికి ప్రవేశపెట్టిన రైలు
డి) సైన్స ఎక్స్‌ప్రెస్- సైన్సలో కొత్త ఆవిష్కరణ చేపట్టేందుకు ప్రవేశపెట్టిన రైలు
- View Answer
- సమాధానం: డి
8. ప్రపంచంలో పశుసంపద అధికంగా ఉన్న దేశం ఏది?
ఎ) యూఎస్ఏ
బి) ఆస్ట్రేలియా
సి) ఇండియా
డి) డెన్మార్క
- View Answer
- సమాధానం: సి
9. జూమ్ (Jhoom) అంటే ఏమిటి?
ఎ) ఒక రకమైన వ్యవసాయ విధానం
బి) ఒక రకమైన సింగింగ్ బాస్కెట్
సి) పొడి ప్రదేశాలలోని నదీలోయలు
డి) ఒక ఆదివాసీ నృత్యం
- View Answer
- సమాధానం: ఎ
10. కింద పేర్కొన్న ఏయే రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో షెడ్యూల్డ్ తెగలను ప్రకటించలేదు?
ఎ) గోవా, గుజరాత్, ఉత్తరప్రదేశ్
బి) రాజస్థాన్, త్రిపుర, పశ్చిమ బెంగాల్
సి) కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర
డి) హరియాణా, పంజాబ్, పుదుచ్చేరి
- View Answer
- సమాధానం: డి
11. కింది వాటిలో సముద్ర ప్రవాహాల(Ocean Currents)ను ప్రభావితం చేసే అంశాలు ఏవి?
1) ప్రపంచ పవనాలు
2) భూభ్రమణం
3) ఖండతీరపు అంచులు
4) సముద్ర అంతర్గత నిమ్నోన్నతాలు
ఎ) 1, 3
బి) 1, 2, 3
సి) 1, 3, 4
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: డి
12. కింది వాటిలో బ్రిటన్, అర్జెంటీనా మధ్య వివాదాస్పదంగా ఉన్న దీవులు ఏవి?
ఎ) స్పార్టలీ
బి) షెట్లాండ్
సి) ఫాక్లాండ్
డి) కురైల్
- View Answer
- సమాధానం: సి
13. కింది వాటిలో సరైన వాక్యాలేవి?
1) భూమధ్యరేఖా వర్షారణ్యాలు అత్యధిక జీవవైవిధ్యతను కలిగి ఉన్నాయి
2) ప్రవాళబిత్తికలు అనేవి సముద్రాలు, మహాసముద్రాలలోని సున్నపురాతి భూభాగాలు
3) ‘మాంగ్రూవ్స’ భూమధ్యరేఖా వర్షారణ్యాలలో ఒక అంతర్భాగం
4) ఉభయచర జీవులను వాయు కాలుష్యాన్ని తెలిపే సూచీలుగా పేర్కొనవచ్చు
ఎ) 1, 2, 3, 4
బి) 1, 2, 3
సి) 1, 2, 4
డి) 1, 4
- View Answer
- సమాధానం: బి
14. కింది వాటిలో ఖరీఫ్ పంటలు ఏవి?
1) పత్తి
2) వేరుశనగ
3) వరి
4) గోధుమ
ఎ) 4 మాత్రమే
బి) 2, 3
సి) 1, 3
డి) 1, 2, 3
- View Answer
- సమాధానం: డి
15. భారత్‌లో లభ్యమయ్యే బొగ్గుకు సంబంధించి కింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది?
1) దుమ్ము, ధూళి పాళ్లు అధికంగా ఉంటాయి
2) సల్ఫర్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది
3) మండించినప్పుడు తక్కువ పొగ, అధిక ఉష్ణోగ్రత విడుదలవుతుంది
ఎ) 1, 2
బి) 1 మాత్రమే
సి) 3 మాత్రమే
డి) 1, 3
- View Answer
- సమాధానం: సి
16. కింది వాటిలో సరైంది ఏది?
1) సహజ వాయువు గోండ్వానా శిలల్లో లభ్యమవుతుంది
2) కోడెర్మా ప్రాంతంలో అత్యధికంగా మైకా నిల్వలున్నాయి
3) ధార్వార్ శిలల్లో పెట్రోలియం నిల్వలు ఉన్నాయి
ఎ) 1, 3
బి) 3 మాత్రమే
సి) 1, 2
డి) 2 మాత్రమే
- View Answer
- సమాధానం: సి
17. ‘కేంద్ర బంగాళాదుంపల పరిశోధన కేంద్రం’ ఎక్కడ ఉంది?
ఎ) సిమ్లా
బి) కాన్పూర్
సి) లక్నో
డి) భోపాల్
- View Answer
- సమాధానం: బి
18. దేశంలో ముత్యపు చిప్పల (Pearl Oysters) ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ఓడరేవు ఏది?
ఎ) చెన్నై
బి) పారాదీప్
సి) కొచ్చిన్
డి) ట్యుటికోరిన్
- View Answer
- సమాధానం: డి
19. కింది వాటిలో శాటిలైట్ ఓడరేవుగా నిర్మించింది ఏది?
ఎ) నవసేవ
బి) గంగవరం
సి) ఎన్నోర్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
20. న్యూమూర్ దీవులు ఎక్కడ ఉన్నాయి?
ఎ) సింధునది ముఖద్వారంలో
బి) గంగానది ముఖద్వారంలో
సి) మహానది ముఖద్వారంలో
డి) గోదావరి నది మఖద్వారంలో
- View Answer
- సమాధానం: బి
21. భారతదేశ పశ్చిమ తీరంలో వెడల్పైన తీరం ఏది?
ఎ) కొంకణ్
బి) మలబార్
సి) కథియవార్
డి) కెనరా
- View Answer
- సమాధానం: బి
22. ‘గేట్ వే ఆఫ్ శ్రీనగర్’ అని దేన్ని పిలుస్తారు?
ఎ) జోజిలా కనుమ
బి) నాథులా కనుమ
సి) బొమ్మిడాలా కనుమ
డి) బనిహాల్ కనుమ
- View Answer
- సమాధానం: డి
23. భారతదేశంలో నల్లరేగడి నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రం ఏది?
ఎ) మధ్యప్రదేశ్
బి) తమిళనాడు
సి) మహారాష్ట్ర
డి) గుజరాత్
- View Answer
- సమాధానం: సి
24. భారతదేశంలో పశ్చిమ అలజడుల వల్ల ఎక్కువగా వర్షపాతం పొందే ప్రాంతం ఏది?
ఎ) సట్లైజ్ - యమున మైదానం
బి) చంబల్ - యమున మైదానం
సి) పశ్చిమ రాజస్థాన్
డి) కశ్మీర్ లోయ
- View Answer
- సమాధానం: ఎ
25. షోలా అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
ఎ) కర్ణాటక
బి) మధ్యప్రదేశ్
సి) తమిళనాడు
డి) త్రిపుర
- View Answer
- సమాధానం: సి
26. భారతదేశంలో ఏ రకమైన అడవులు అధిక విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉన్నాయి?
ఎ) తేమతో కూడిన సమశీతోష్ణ మండల పర్వత ప్రాంత అరణ్యాలు
బి) ఉష్ణమండల అనార్ధ్ర సతత హరితాలు
సి) ఉష్ణమండల తేమతో కూడిన సతత హరితాలు
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
27. కింది వాటిలో పశ్చిమ బెంగాల్‌లోని ‘రూప్ నారాయణపూర్’లో ఉన్న కర్మాగారం ఏది?
ఎ) భారత్ అల్యూమినియం కర్మాగారం
బి) హిందూస్తాన్ కాపర్ ప్లాంట్
సి) భారత్ టెలిఫోన్ కర్మాగారం
డి) హిందూస్తాన్ కేబుల్ కర్మాగారం
- View Answer
- సమాధానం: డి
28. ఈశాన్య భారతదేశంలో యురేనియం ఏ కొండల్లో లభిస్తుంది?
ఎ) ఖాసీ
బి) గారో
సి) జయంతియా
డి) మికిర
- View Answer
- సమాధానం: ఎ
29. ఛత్తీస్‌గఢ్‌లోని ‘భైలదిల్లా’ కింది వాటిలో ఏ నిల్వలకు ప్రసిద్ధి?
ఎ) మాంగనీస్
బి) బొగ్గు
సి) రాగి
డి) ఇనుప ధాతువు
- View Answer
- సమాధానం: డి
30. భారతదేశంలో అతి తక్కువ పొడవైన జాతీయ రహదారి ఏది?
ఎ) 47
బి) 47A
సి) 48
డి) 48A
- View Answer
- సమాధానం: బి
31. కింది వాటిలో DVC (దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ప్రాజెక్టు)లో అంతర్భాగం కాని ఆనకట్ట ఏది?
ఎ) తిలయ
బి) కోనార్
సి) మతైతిల్లా
డి) మైథాన్
- View Answer
- సమాధానం: సి
32. కింది వాటిలో ‘గల్ఫ్ ఆఫ్ ఖంబట్’ ప్రాంతంలో కలవని నది ఏది?
ఎ) మహి
బి) సబర్మతి
సి) జువారి
డి) తపతి
- View Answer
- సమాధానం: సి
33. కింది వాటిలో ఏ ప్రాంతం నుంచి అండమాన్ దీవులకు సముద్ర మార్గం ద్వారా తక్కువ దూరం ఉంది?
ఎ) చెన్నై
బి) విశాఖపట్నం
సి) కటక్
డి) కోల్‌కతా
- View Answer
- సమాధానం: ఎ
34. భారతదేశ భూభాగంలో ఖనిజ వనరులు తక్కువగా ఉన్న ప్రాంతం ఏది?
ఎ) దక్కన్ పీఠభూమి
బి) గంగా - సింధూ మైదానం
సి) హిమాలయాలు
డి) ఛోటానాగపూర్ పీఠభూమి
- View Answer
- సమాధానం: బి
35. దేశంలో అతిపెద్ద ‘ఔటర్ హార్బర్’ ఉన్న ఓడరేవు ఏది?
ఎ) నవసేన
బి) ఎన్నోర్
సి) గోవా
డి) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: డి
36. కింది వాటిలో భారతదేశంలో రష్యా సహకారంతో నిర్మించని ఇనుము-ఉక్కు కర్మాగారం ఏది?
ఎ) విశాఖపట్నం
బి) రూర్కెలా
సి) బొకారో
డి) సేలం
- View Answer
- సమాధానం: బి
37. దేశంలోని మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఏది?
ఎ) శరావతి
బి) నాప్తాజాక్రీ
సి) శివసముద్రం
డి) శ్రీశైలం
- View Answer
- సమాధానం: సి
38. జార్ఖండ్‌లోని ‘జాదుగూడ’ కింది వాటిలో ఏ నిల్వలకు ప్రసిద్ధి?
ఎ) యురేనియం
బి) మైకా
సి) కాపర్
డి) జింక్
- View Answer
- సమాధానం: ఎ
39. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో షెడ్యూల్డ్ తెగల జనాభా ఎంత శాతం?
ఎ) 7.6%
బి) 8.6%
సి) 9.6%
డి) 10.6%
- View Answer
- సమాధానం: బి
40. ‘అక్టోబర్ హీట్’కు కారణం ఏమిటి?
ఎ) బెంగాల్ మైదాన ప్రాంతంలో అక్టోబర్ లో వాతావరణంలో ఆర్ధ్రతా పరిమాణం అధికంగా ఉండటం
బి) పొడి, వేడి వాతావరణం
సి) పవనాల వేగం తక్కువగా ఉండటం
డి) గంగా మైదానంలో ఏర్పడే అల్పపీడన ద్రోణి
- View Answer
- సమాధానం: ఎ