Police Jobs Notifications 2024 : పోలీసు ఉద్యోగాల భ‌ర్తీపై కీల‌క ఆదేశాలు...

సాక్షి ఎడ్యుకేష‌న్ : పోలీసుశాఖ‌లోని ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించిందింది. పోలీసుశాఖలో ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ అఫిడవిట్‌ వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

పోలీసులు, సాయుధ దళాలపై పని ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేస్తుండాలని, ఆ ప్రక్రియను పర్యవేక్షిస్తుండాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు తెలిపింది. ఆ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హెల్ప్‌ ది పీపుల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ కీతినీడి అఖిల్‌ శ్రీగురుతేజ ఈ పిల్ వేసిన విష‌యం తెల్సిందే.

☛ AP Constable Jobs 2024 : ఏపీలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు మ‌ళ్లీ...?

ఈ మేరకు ఉత్తర్వులు జారీ..
అలాగే ఈ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం అక్టోబ‌ర్ 16వ తేదీన (బుధవారం) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

#Tags