Intermediate Books:ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు

Intermediate Books:ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు

శ్రీకాకుళం : ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు మళ్లీ పాఠ్యపుస్తకాలు అందజేసేలా ఇంటర్మీడియెట్‌ విద్య ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ ఏడాది నుంచి అకాడమీ నుంచి పాఠ్య పుస్తకాల ముద్రణ చేపించి ప్రభుత్వ యాజమాన్య జూనియర్‌ కళాశాలల్లో చదు వుతున్న మధ్యతరగతి, నిరుపేద విద్యార్థులకు వీటిని అందజేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పాఠ్యపుస్తకాలతోపాటు నోట్‌బుక్స్‌ కూడా అందజేయనున్నారు. కాలేజ్‌ బ్యాగ్‌ పంపిణీ చేస్తార నే ప్రచారం ఉన్నప్పటికీ అధికారికంగా ఎలాంటి ఆదేశాలు అధికారులకు చేరలేదు.

Also Read:  IBPS Clerk Recruitment 2024 Announced: Apply for 6128 Clerical Posts!

జిల్లాలో ఇదీ పరిస్థితి..

పునర్విభజన శ్రీకాకుళం జిల్లా(30 మండలాలు)లో 38 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, 13 మోడల్‌ స్కూల్‌/కాలేజీలు, 25 కేజీబీవీలు, సోషల్‌ వెల్ఫేర్‌ 9, హైస్కూల్‌ ప్లస్‌ 12, ట్రైబల్‌ వెల్ఫేర్‌, మహాత్మా జ్యోతిభాపూలే రెసిడెన్షియల్‌ కాలేజ్‌ ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ప్రథమ సంవత్సరం 13,250 మంది, రెండో సంవత్సరం 12,510 మంది చదువుతున్నారు. గత రెండేళ్లుగా పాఠ్య పుస్తకాల ముద్రణ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాళ్లు, లెక్చరర్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేసేందుకు సమ్మతించింది. వీటితోపాటు నోట్‌బుక్స్‌ కూడా అందజేయనుంది.

ప్రతిపాదనలు సిద్ధం చేశాం..

అకాడమీ పుస్తకాలు తగినంత స్థాయిలో ముద్రణ జరగక జిల్లాకు రాకపోవడం వల్ల పుస్తకాలు అందజేయలేకపోయాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇంటర్‌ విద్య కమిషనర్‌ ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఈనెల 15వ తేదీనాటికి జిల్లాకు పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు చేరుకుంటాయి.

                                                                       – కోట ప్రకాశరావు, డీవీఈఓ, ఇంటర్‌ విద్య

#Tags