Govt ITI Job Opportunities news: ప్రభుత్వ ITIలో ఉద్యోగ అవకాశాలు

Govt ITI Job Opportunities

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఐటీఐ అంటే ఒక కప్పుడున్న చిన్నచూపు ఇప్పుడు అక్కర్లేదు. రెండేళ్ల పాటు ఓర్పు, సహనంతో శిక్షణ పూర్తి చేస్తే వెంటనే ఉద్యోగం పొందే మార్గాన్ని చూపిస్తోంది విజయనగరం ప్రభుత్వ ఐటీఐ. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకొని ఫైనల్ పరీక్షలు రాస్తున్న 136 మందిలో నలుగురు తప్ప మిగతా 132 మంది క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయంటే ఆశ్చర్యమే మరి. గత రెండేళ్ల కాలంలో కంపెనీల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఈ ఐటీఐ ముందుంది.

ఏపీ తెలంగాణలో స్కూళ్లకు మరో 2 రోజులు సెలవులు: Click Here
 

"శిక్షణ పూర్తయిన వెంటనే ఉద్యోగం": వెంకటసాయి, ఎలక్ట్రిషియన్ ట్రేడ్ విద్యార్థి

విజయనగరం ప్రభుత్వ ఐటీఐలో రెండు నెలల క్రితం ఆన్జాబ్ ట్రైనింగ్ కోసం క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగాయి. ప్రీమియర్ ఎనర్జీస్ అనే సోలార్ పరికరాల తయారీ కంపెనీకి నేను ఎంపికయ్యాను. మూడు నెలల శిక్షణ తర్వాత ఆ కంపెనీలో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఇలాంటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తాను. ఐటీఐలో ఉన్నప్పుడే మూడు నెలల శిక్షణలో రూ.16,500 ఉపకార వేతనం రావడం మాకెంతో భరోసాగా ఉంటోంది. ఆ అనుభవంతో పరీక్షలు పూర్తిచేసి బయటకు వెళ్లిన వెంటనే అదే కంపెనీలో వెంటనే ఉద్యోగం వచ్చేలా ప్రిన్సిపాల్ గిరి తీసుకున్న చొరవకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ విధానం రానున్న బ్యాచ్లకూ కొనసాగిస్తే ఐటీఐ కోర్సులు చేయాలనే ఆసక్తి యువతకు కలుగుతుంది.

"ఇదో మంచి అవకాశం": టీవీ గిరి, ప్రిన్సిపాల్, విజయనగరం ప్రభుత్వ ఐటీఐ

క్యాంపస్ ఇంటర్వ్యూలో నేను ఆన్జాబ్ ట్రైనింగ్ కోసం టీవీఎస్ సుందరం ఫాస్టనర్స్ లిమిటెడ్ సంస్థ నుంచి అవకాశం పొందాను. మూడు నెలల శిక్షణతో పాటు ప్రతి నెలా రూ.16,500 చొప్పున ఉపకార వేతనం ఇస్తున్నారు. ఐటీఐ మెయిన్ పరీక్షలు పూర్తి చేసిన తర్వాత అదే కంపెనీలో పర్మినెంట్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆన్ జాబ్ ట్రైనింగ్ నాకు చాలా మంచి అవకాశం.

ఐటీఐ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధానం ప్రకారం రెండేళ్ల శిక్షణలో భాగంగానే కంపెనీల్లోనూ శిక్షణ ఇప్పించాలి. కానీ గతంలో దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా స్కిల్ డెవలప్మెంట్పై దృష్టి పెట్టింది. సౌరభ్ గౌర్ తదితర ఉన్నతాధికారుల పర్యవేక్షణతో పాటు విజయనగరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ టీవీ గిరి కూడా చొరవ తీసుకున్నారు. 

విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారిని కంపెనీల్లో ఆన్జబ్ ట్రైనింగ్కు పంపించడానికి ఒప్పించారు. ఫలితంగా ఈ ఏడాది 136 మంది అవుట్ గోయింగ్ విద్యార్థుల్లో నలుగురు తప్ప మిగతా 132 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. వారిలో 51 మంది ఇన్స్టాంట్ శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. టీవీ ఎస్ మోటార్స్ సంస్థలో 21 మంది, రేడియంట్ ఎలక్ట్రానిక్స్ సంస్థలో 30 మంది మూడు నెలల శిక్షణ పొందారు. గత నెలలో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్లో 9 కంపెనీలు హాజరయ్యాయి. ఆయా కంపెనీలకు 132 మంది క్యాంపస్ ప్లేస్మెంట్స్ కింద ఎంపికయ్యారు. వారికి ఆఫర్ లెటర్స్ కూడా ఇచ్చేశారు.

#Tags