NMMS for Higher Education : విద్యార్థుల ప్ర‌తిభ‌కు ప్రోత్సాహంగా ఎన్ఎంఎంఎస్ ప‌రీక్ష‌.. ఈ విధంగా..

పేద విద్యార్థుల్లో ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు 2008–09లో ఎన్‌ఎంఎంఎస్‌ పథకాన్ని ప్రవేశపట్టారు.

మదనపల్లె సిటీ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసి వారికి ఉపకార వేతనాలు అందిస్తోంది నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పథకం (ఎన్‌ఎంఎంఎస్‌). కేంద్ర మానవ వనరుల శాఖ ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్‌షిప్‌ పొందేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించి అర్హత పొందిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది. 8వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు అందించే స్కాలర్‌షిప్‌ పథకానికి ఏటా ఆధ‌రణ పెరుగుతోంది.

AP Government: ఏపీలో 12 ప్రాజెక్టుల పేర్లు మార్పు.. ప్ర‌స్తుత పేర్లు ఇవే..

2008–9 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం

పేద విద్యార్థుల్లో ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు 2008–09లో ఎన్‌ఎంఎంఎస్‌ పథకాన్ని ప్రవేశపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల సంచాలకుల ఆధ్వర్యలో స్కాలర్‌షిప్‌కు అర్హత పొందేందుకు ప్రవేశ పరీక్షను నవంబర్‌లో నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఏటా రూ.6 వేల స్కాలర్‌షిప్‌ను వారి అకౌంట్లలో వేస్తారు. జిల్లాలో ఈ పరీక్షలకు అధికంగా విద్యార్థులు హాజరవుతున్నారు. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని వివేకానంద మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో అత్యధికంగా విద్యార్థులు ప్రతి ఏటా ఎంపికవుతున్నారు. పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా కోచింగ్‌ ఇస్తున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

ఏటా అధిక సంఖ్యలో విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్‌షిప్‌లకు అర్హత పొందుతున్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా హెచ్‌ఎంలు ప్రోత్సహించాలి. 
–శివప్రకాష్‌రెడ్డి, డిఈఓ

Survey Exam : ఏకేయూలో రెవెన్యూ ఉద్యోగుల‌కు స‌ర్వే ప‌రీక్ష‌.. అభ్య‌ర్థుల‌ న‌మోదు శాతం!

ఉపాధ్యాయుల శిక్షణతోనే జిల్లా ఫస్ట్‌ వచ్చాను

గత ఏడాది జరిగిన ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష ఫలితాల్లో 131 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్‌ వచ్చాను. పాఠశాల ఉపాధ్యాయులు ఇచ్చిన శిక్షణ బాగుంది. ప్రత్యేకంగా సమయం కేటాయించడం వల్ల మంచి మార్కులు వచ్చాయి. బాగా చదివి ఉపాధ్యాయురాలు కావడమే లక్ష్యం. 
–సాయి సాహితీ, వివేకానంద మున్సిపల్‌ పాఠశాల, మదనపల్లె

పరీక్ష విధానమిలా..

➺ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌ ప్రవేశ పరీక్షకు అర్హులు.

➺7వ తరగతి మార్కుల ఆధారంగా పరీక్షకు అర్హత కల్పిస్తారు.

➺ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఏడవతరగతిలో 50 శాతం,మిగిలిన తరగతుల వారు 55 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. బీసీ, ఓసీ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.100 ,ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు రూ.50 చెల్లించాల్సి ఉంది.

➺అబ్జెక్టివ్‌ విధానంలో 150 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది.

➺జిల్లా ప్రాతిపదికగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

RGUKT Admission Counselling : ఆర్‌జీయూకేటీలో నేటితో ముగియనున్న ఆప్షన్ల ఎంపిక

➺దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.3.5 లక్షలకు మించి ఉండకూడదు.

➺డివిజన్‌ కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఈ నెల ఐదో తేదీన నోటిఫికేషన్‌ జారీ కాగా, రాత పరీక్ష డిసెంబర్‌8న నిర్వహించనున్నారు.

➺సెప్టెంబర్‌ 6 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు తుది గడువు. కాగా పరీక్ష ఫీజు చెల్లింపునకు సెప్టెంబర్‌ 10 చివరి తేదీ. పరీక్ష రుసుమును ఆన్‌లైన్‌ దరఖాస్తులో ఇవ్వబడిన ఎస్‌బీఐ కలెక్ట్‌ లింక్‌ ద్వారా మాత్రమే చెల్లించాలి. పూర్తి వివరాలకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్‌సైట్‌ డబ్యూడబ్యూడబ్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌లో లేదా సంబఽంధిత జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంది.

ITI counselling 2024: ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

#Tags