National Scholarships: నేషనల్‌ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

అనంతగిరి: నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పథకానికి జిల్లాలో అర్హులైన దివ్యాంగ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి కృష్ణవేణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Jobs In TCS: గ్రాడ్యుయేట్లకు అవకాశం..టీసీఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

2024–25 విద్యా సంవత్సరంలో ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌, పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌, టాప్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్‌ పథకంలో భాగంగా నేషనల్‌ స్కాలర్‌షిప్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఫ్రెష్‌, రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Guest Faculty Jobs: గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. కావల్సిన అర్హతలు ఇవే

ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ కోసం 9, 10 తరగతుల వారు, పోస్ట్‌ మెట్రిక్‌కు 11,12 తరగతుల వారు టాప్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్‌ కోసం డిగ్రీ, పీజీ, డిప్లమా చదువుతున్న వారు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రీ మెట్రిక్‌కు ఈ నెల 31, పోస్టు మెట్రిక్‌, టాప్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్‌కు అక్టోబర్‌ 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు.

#Tags