Fifth Class Counselling: రేపు నుంచి గురుకులం ఐదో తరగతిలో ప్రవేశానికి కౌన్సెలింగ్..!
అనంతపురం: ఉమ్మడి జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ (అంబేడ్కర్) గురుకులాల్లో 2024–25 విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో మిగులు సీట్ల భర్తీకి ఈనెల 29న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గురుకులాల కో-ఆర్డినేటర్ అంగడి మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్‌ఏజీ సెట్–2024 ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మార్కుల ఆధారంగా బాలుర పాఠశాలల్లో ఉన్న 26 ఖాళీలు, బాలికల పాఠశాలల్లో ఉన్న 12 ఖాళీలను 1:3 నిష్పత్తిలో అనంతపురం రూరల్ మండలం కురుగుంట గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడిచారు.
Online Books: ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠ్యపుస్తకాలు..
● బాలురకు సంబంధించి ఎస్సీ కేటగిరీలో 22 నుంచి 20 మార్కుల వరకు (ర్యాంక్ 7133 నుంచి 7936 వరకు), ఎస్టీ కేటగిరీలో 30 మార్కులకు (ర్యాంక్ 3375 నుంచి 3435 వరకు), బీసీ కేటగిరిలో 47 మార్కులకు (ర్యాంక్ 54 నుంచి 71 వరకు), ఓసీ కేటగిరీలో 46 మార్కులకు (ర్యాంక్ 111 నుంచి 117 వరకు) కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.
● బాలిలకు సంబంధించి ఎస్సీ కేటగిరీలో 21 మార్కులకు (ర్యాంక్ 9711 నుంచి 9778 వరకు), బీసీ కేటగిరిలో 44 నుంచి 43 మార్కుల వరకు (ర్యాంక్ 201 నుంచి 308 వరకు), ఓసీ కేటగిరీలో 45 నుంచి 44 మార్కుల వరకు (ర్యాంక్ 171 నుంచి 211 వరకు) కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.
● మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్‌కు ఎంపికై న వారి సమాచారంను దరఖాస్తు సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్లకు అందించామన్నారు. ఎంపికై న విద్యార్థులు మెరిట్ కార్డ్, నాల్గో తరగతి స్టడీ, ఆధార్‌కార్డ్, కులం, ఆదాయ ధృవీకరణపత్రాలతో 29న ఉదయం 9 గంటలకు కురుగంట గురుకుల పాఠశాలకు చేరుకోవాలని సూచించారు.
AP SSC 10th Class Exams 2024: పదవతరగతి జవాబు పత్రాల రీ వెరిఫికేషన్
ఇంటర్ మిగులు సీట్లకు 31న
ఉమ్మడి జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ (అంబేడ్కర్) గురుకులాల్లో 2024–25 విద్యా సంవత్సరం ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు మిగులు సీట్ల భర్తీకి ఈనెల 31న అనంతపురం రూరల్ మండలం కురుగుంట గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ అంగడి మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్‌ఏజీ సెట్–2024 ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాలుర పాఠశాలల్లో 14, బాలికల పాఠశాలల్లో 19 ఖాళీలు ఉన్నాయన్నారు.
● బాలురకు సంబంధించి ఎస్సీ కేటగిరీలో 16.25 మార్కులకు (7569 ర్యాంక్ నుంచి 7676 వరకు), ఎస్టీ కేటగిరీలో 22.5 నుంచి 16.5 మార్కుల వరకు (4951 నుంచి 7352 ర్యాంక్ వరకు), బీసీ కేటగిరీలో 55 నుంచి 53 మార్కుల వరకు (392 నుంచి 475 ర్యాంక్ వరకు) బాలురు హాజరుకావాలని సూచించారు.
Campus Recruitment: ప్లేస్‌మెంట్స్‌లో లక్షల జీతంతో కొలువు దీరుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులు
● బాలికలకు సంబంధించి ఎస్సీ కేటగిరీలో 10 మార్కులకు (18,523 ర్యాంక్ నుంచి 18,782 వరకు), ఎస్టీ కేటగిరీలో 17.75 నుంచి 17.5 మార్కుల వరకు (11,821 నుంచి 11,981 ర్యాంక్ వరకు), బీసీ కేటగిరీలో 43.75 నుంచి 39.25 మార్కుల వరకు (1334 నుంచి 1998 ర్యాంక్ వరకు), ఓసీ కేటగిరీలో 40 నుంచి 38.75 మార్కుల వరకు (1894 నుంచి 2072 ర్యాంక్ వరకు) బాలికలు హాజరుకావాలని సూచించారు.
● మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్‌కు ఎంపికైన విద్యార్థుల సమాచారంను దరఖాస్తు సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్లకు పంపామని పేర్కొన్నారు. మెరిట్‌కార్డ్, పదో తరగతి మార్కల జాబితా, స్టడీ, ఆధార్‌కార్డ్, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకుని 31న ఉదయం 9 గంటలకు కురుగుంట గురుకుల పాఠశాలకు చేరుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ సూచించారు.