COE Admissions : బాలిక‌ల గురుకుల సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌లో ఖాళీ సీట్ల భర్తీకి ద‌ర‌ఖాస్తులు.. ఈ త‌ర‌గ‌తుల్లోనే..

మధురవాడ: కొమ్మాది రిక్షా కాలనీలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల బాలికల సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌(సీవోఈ)లో 2024–25 విద్యా సంవత్సరంలో మిగిలిన ఎస్సీ, ఎస్టీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ టి.నాగమణి తెలిపారు.

Teachers Day Awards : జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ ర‌త్న‌ పుర‌స్కారాలు.. ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీ..

5వ తరగతిలో 16 సీట్లు, 6వ తరగతిలో 14 సీట్లు, 7వ తరగతిలో 15 సీట్లు, 9వ తరగతిలో 6 సీట్లు, ఇంటర్‌ బైపీసీలో 5 సీట్లు, ఎంపీసీలో 20 సీట్లు ఖాళీలు ఉన్నట్టు చెప్పారు. ఆసక్తి గల ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

#Tags