Students: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
మధురపూడి: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి సేవలందించాలని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సైంటిఫిక్ సలహాదారు, శాస్త్రవేత్త డాక్టర్ జి.సతీష్‌రెడ్డి ఆకాంక్షించారు. కోరుకొండ మండలం గాడాలలోని లారెల్ హై గ్లోబల్ స్కూల్‌లో శుక్రవారం జరిగిన విజ్ఞాన ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశానికి విద్యార్థులు రేపటి భవిష్యత్ అని అన్నారు. రక్షణ రంగ ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రతి విద్యార్థీ చదువులో నూతన ఆవిష్కరణల ద్వారా మేధోశక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పలు ప్రయోగాలను పరిశీలించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. స్కూల్ ప్రాంగణంలో సతీష్‌రెడ్డి మొక్క నాటారు. కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, కరస్పాడెంట్ సుంకర రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Sricity Foundation: ప్రభుత్వ విద్యాసంస్థలకు శ్రీసిటీ ఫౌండేషన్ చేయూత