Educational science fair: రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు వీరే..
అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాల స్థాయి విద్యార్థుల్లో దాగిన సృజనను గుర్తించి వెలికి తీసినప్పుడే వారు భావి శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని జిల్లా విద్యాశాఖాధికారి వి.నాగరాజు అన్నారు. అనంతపురంలోని రాజేంద్ర నగర పాలక ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని డీఈఓ ప్రారంభించి, మాట్లాడారు. పిల్లల్లో మేథో సంపత్తిని గుర్తించి ప్రోత్సహించేందుకు సైన్స్‌ఫేర్ ఓ మంచి వేదికన్నారు. సృజనను వెలికి తీసేలా విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను అభినందించారు. డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ... పిల్లల్లో శాసీ్త్రయ దృక్పథం పెంచేందుకు సైన్స్, గణిత ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. జిల్లా సైన్స్ అధికారి బాల మురళీకృష్ణ ప్రసంగిస్తూ... జిల్లాలోని వివిధ పాఠశాలల్లో నిర్వహించిన విద్యావైజ్ఞానిక ప్రదర్శనల్లో మొత్తం 326 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించగా. వీటిలో ఉత్తమమైన 76 ప్రాజెక్ట్‌లను జిల్లా స్థాయికి ఎంపిక చేశారన్నారు. వీటిని పరిశీలించిన అనంతరం 9 ప్రాజెక్ట్‌లను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారన్నారు. న్యాయనిర్ణేతలుగా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు డాక్టర్ రఘురాములు, డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి వ్యవహరించినట్లుగా పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికై న విద్యార్థులకు ప్రశంసా పత్రాలను డీఈఓ ప్రదానం చేశారు.
చదవండి: Jagananna Videshi Vidya Deevena: ప్రతిభ ఉంటే విదేశీ విద్య.. నేడు విదేశీ విద్యా దీవెన నగదు జమ