TSPSC: గ్రూప్స్ కేటగిరీల్లోకి మరిన్ని పోస్టులు
ఈమేరకు పోస్టుల వర్గీకరణకు సంబంధించి జీఓ 136 జారీ చేసింది. ఇకపై నిర్దేశించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని Telangana State Public Service Commission (TSPSC)ను ఆదేశించింది. ప్రస్తుతం గ్రూప్–2 కేటగిరీలో 16 రకాల పోస్టులుండగా... ఇందులో మరో 6 రకాల పోస్టులను చేర్చింది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సర్విస్), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఇతర ప్రభుత్వ శాఖలు), డ్రిస్టిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (జువైనల్ కరెక్షనల్ సర్వీస్), అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ (బీసీ వెల్ఫేర్ సబ్ సర్వీస్), అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ట్రైబల్ వెల్ఫేర్ సబ్ సర్వీస్), అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ఎస్సీడీడీ సబ్ సర్వీస్) ఉద్యోగాలు ఇకపై గ్రూప్–2 సర్విసుల్లోకి వస్తాయి. గ్రూప్–3 కేటగిరీలో ఇప్పటివరకు 8 రకాల పోస్టులుండగా... మరో రెండు రకాల పోస్టులు చేర్చారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్
అకౌంటెంట్ (ట్రైబల్ వెల్ఫేర్ స్టేట్ సరీ్వస్), హెచ్‌ఓడీ (హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్)ల్లో సీనియర్ అకౌంటెంట్/అకౌంటెంట్ లేదా జూనియర్ అకౌంటెంట్/అకౌంటెంట్ పోస్టులు ఇకపై గ్రూప్–3లోకి వస్తాయి. ఇక గ్రూప్–4 సరీ్వసులోకి జిల్లా కార్యాలయాల్లోని జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్‌లతోపాటు వీటికి సమానస్థాయి పోస్టు లు వస్తాయి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జువైనల్ కరెక్షనల్ సరీ్వస్ విభాగాల్లో సూపర్‌వైజర్ (మేల్), మెట్రాన్, స్టోర్ కీపర్ పోస్టులు, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పరిధిలోని మెట్రాన్ పోస్టులు కూడా గ్రూప్–4 కేటగిరీలోకి వస్తాయి.
చదవండి: Success Story: కూలీ పనులు చేస్తూ చదివా.. నేడు డీఎస్పీ ఉద్యోగం సాధించానిలా..