Skip to main content

TSLPRB: ఒక పోస్టు.. 174 మంది పోటీ

సాక్షి, హైదరాబాద్‌: ఖాకీ కొలువులకు యువతలో ఎంతో క్రేజ్‌ ఉంటుంది. అవకాశం, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పోలీస్‌ ఉద్యోగానికి పోటీ పడుతుంటారు.
tslprb
ఒక పోస్టు.. 174 మంది పోటీ

ఈసారి కూడా కానిస్టేబుల్‌ పోస్టులకు విపరీతమైన పోటీ ఉంది. ఏప్రిల్‌లో నిర్వహించనున్న కానిస్టేబుల్‌ పోస్టుల తుది రాత పరీక్షకు పార్ట్‌–2 దరఖాస్తు పూర్తి చేసిన అభ్యర్థుల సంఖ్య చూస్తే కానిస్టేబుల్‌ పోస్టులకు కాంపిటీషన్‌ ఫుల్‌ అన్న విషయం స్పష్టం అవుతోంది. సివిల్‌ పోలీస్, టీఎస్‌ఎస్పీ, ఆర్మ్‌డ్‌ రిజర్వ్, ఎస్పీఎఫ్, ఫైర్, జైళ్లశాఖ, రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్‌ శాఖల్లో కానిస్టేబుల్‌ పోస్టులకు ఏప్రిల్‌లో తుది రాత పరీక్ష నిర్వహించబోతున్నారు. ఉమ్మడి పది జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో పోలీస్‌ నియామక మండలి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏప్రిల్‌ 24 నుంచి అభ్యర్థులకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు సమయం ఇచ్చింది. ప్రతి అభ్యర్థి    www.tslprb.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ లాగిన్‌ ఐడీ ద్వారా హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.  

చదవండి: Inspiration Story: టీం ఇండియా కెప్టెన్ నుంచి పోలీస్ అధికారిగా... రాజ్‌పాల్ సింగ్ ఎవ‌రో తెలుసా..?

ఎక్సైజ్‌ కానిస్టేబుల్స్‌కు పోటీ తీవ్రం..  

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉంది. మొత్తం 614 పోస్టులకుగాను 1,06,­272 మంది తుది రాతపరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 174 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అదేవిధంగా పోలీస్‌ శాఖలోని వివిధ విభాగాల్లో సివిల్‌ కానిస్టేబుల్, ఇతర పోస్టులకు కలిపి మొత్తం 3,40,639 మంది తుది రాత పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్టు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు తెలిపారు.

చదవండి: Babli Kumari Success Story : ఒకప్పుడు నేను సెల్యూట్ చేసే అధికారులకు నేడు నేనే బాస్‌.. ఈ క‌సితోనే..

వివిధ విభాగాల్లో కానిస్టేబుల్‌ పోస్టులు.. తుది రాత పరీక్ష కోసం పార్ట్‌–2 నింపిన అభ్యర్థుల సంఖ్య..

పోస్ట్‌

ఖాళీల సంఖ్య

అభ్యర్థుల సంఖ్య

సివిల్‌ కానిస్టేబుల్, తత్సమాన పోస్టులు

15,644

1,76,370

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌

614

1,06,272

ట్రాన్స్‌పోర్ట్‌ కానిస్టేబుల్‌

63

17,172

కమ్యూనికేషన్‌ కానిస్టేబుల్‌

262

16,816

పీటీఓ డ్రైవర్‌

100

16,891

ఫైర్‌ సర్వీసెస్‌ డ్రైవర్‌

225

7,118 

Published date : 24 Apr 2023 03:13PM

Photo Stories