Skip to main content

10th Class Results: తల్లీకూతుళ్లు అదుర్స్‌.. ఇంటర్‌లో తల్లి.. టెన్త్‌లో కుమార్తెకు మంచి మార్కులు

గోదావరిఖని టౌన్‌: తల్లీకూతుళ్లు ఇంటర్, పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సత్తా చాటారు.

తల్లి కుట్టుమెషీన్‌పై కుడుతూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ ఇంటర్‌ పరీక్షలు రాసింది. ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో 954 మార్కులు సాధించింది. మరోవైపు ఏప్రిల్ 30న‌ విడుదలైన టెన్త్‌ ఫలితాల్లో ఆమె కూతురు 10 జీపీఏ సాధించింది.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన చిట్టోజు రమణాచారి–గీతారాణి దంపతులు. వారికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. రమణాచారి ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. గీతారాణి దుస్తులు కుడుతూ సంపాదిస్తోంది. వీరి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు.

చదవండి: After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్‌ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!

పెద్ద కూతురు చందన రామగుండం మండలం లింగాపూర్‌ మోడల్‌ స్కూల్‌లో టెన్త్‌ చదివింది. ఏప్రిల్ 30న‌ విడుదలైన ఫలితాల్లో 10జీపీఏ సాధించింది.

తల్లే తనకు ఆదర్శమని చందన స్పష్టం చేసింది. ఐఏఎస్‌ కావడమే తన జీవిత లక్ష్యమని తెలిపింది. ఇందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి చేసింది. 

చదవండి: TS/AP Polycet 2024: సత్వర ఉపాధికి మార్గం.. పాలిటెక్నిక్స్‌

Published date : 01 May 2024 01:31PM

Photo Stories