Skip to main content

Felicitating Students: ఉత్త‌మ ఫ‌లితాలు సాధించిన విద్యార్థుల‌కు స‌న్మానం..

కలెక్టరేట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను స‌న్మానించిన క‌లెక్ట‌ర్ వారిని ప్రోత్సాహిస్తూ మాట్లాడారు..
Collector Rizwan Basha felicitates tenth students for their talent in board exams

జనగామ: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌తో కలిసి 2024లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానం రావడం గర్వకారణమన్నారు.

Sports Coaching Diploma Course: స్పోర్ట్స్‌ కోచింగ్‌ డిప్లొమా కోర్సులో అడ్మిష‌న్‌కు ద‌ర‌ఖాస్తులు

జిల్లాలో 32 పాఠశాలల్లో 10 జీపీఏ సాధించారని 78 పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను అగ్రభాగాన నిలిచిందన్నారు. అందరి సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. ఈ సందర్భంగా డీఈఓ కె రాము, విద్యార్థులను, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ అనిల్‌కుమార్‌, డీఆర్డీఓ మొగిలప్ప, బీసీ సంక్షేమాధికారి రవీందర్‌, ఎస్సీ అధికారి దయానంద, డీఈఏఓ వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tenth Class Rankers: ప‌దో త‌ర‌గ‌తిలో ప్రతిభ చాటిన విద్యార్థుల‌కు పుర‌స్కారాలు..

Published date : 11 May 2024 04:46PM

Photo Stories