Tejas Nandlal Pawar: బడిఈడి పిల్లలతో పనిచేయిస్తే చర్యలు
Sakshi Education
బడిఈడు చిన్నారులతో పనిచేయిస్తే.. చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ పవార్ అన్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలనలో భాగంగా గోపాల్‌పేట మండలం పొల్కెపహాడ్, బుద్దారం గ్రామాల మధ్యలో పత్తిచేనులో చిన్నారులు పనిచేస్తున్న విషయాన్ని గమనించారు.
కలెక్టర్ వారితో మాట్లాడారు. పాఠశాలకు వెళ్లకుండా పని ఎందుకు చేస్తున్నారని ప్రశ్ని ంచారు. ఇంటి వద్ద ఉంటే అల్లరిచేస్తారని, పొలం వద్దకు తీసుకొచ్చానని చిన్నారుల తల్లి కలెక్టర్‌కు తెలియజేసింది. చిన్నారులు చదువుపై శ్రద్ధ చూపించేలా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.
చదవండి:
KV Murali Krishna: విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
Childrens Education: పిల్లల చదువు కోసం ఎందులో పెట్టుబడులు పెడితే మంచిది?
Published date : 28 Oct 2023 03:27PM