Sammaiah: ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
ఆ పార్టీ ఆధ్వర్యంలో టీ–సేవ్(తెలంగాణ స్టూడెంట్స్ ఆక్షన్ ఫర్ వెకెన్సీస్ అండ్ ఎంప్లాయిమెంట్) అనే నినాదంతో ఏప్రిల్ 8న జిల్లా కేంద్రంలోని చౌరస్తా వద్ద, స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిరాహా ర దీక్షలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో జనగామ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇందుర్తి వెంకట్‌రెడ్డి పాల్గొనగా.. సమ్మయ్య మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడుతాయని ప్రాణాల ను సైతం లెక్క చేయకుండా ఉద్యమాలు చేపట్టిన యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా తెలంగాణ ప్ర భుత్వం మోసం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
చదవండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 2,008 జూనియర్ లెక్చరర్, ఇతర పోస్టులు
ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి పడిగాపులు కాస్తున్న నిరుద్యోగులు వయోపరిమితి మించిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఘన్‌పూర్‌లో నియోజవకర్గ కోఆర్డినేటర్ సంగాల ఇర్మియా మాట్లాడుతూ.. నిరుద్యోగులు, యువత, విద్యార్థు ల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని అన్నారు. కార్యక్రమాల్లో పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు మంజుల, ప్రశాంత్, వసంత, వంశీ, స్వామి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: IT Jobs 2023 : నిట్ విద్యార్థికి రూ.88 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. ఎలా వచ్చిందంటే..