Skip to main content

Examination Certificates: అసిస్టెంట్ ఇంజ‌నీర్ ప‌రీక్ష అభ్య‌ర్థుల‌కు స‌ర్టిఫికెట్లు

గ్రేడ్-2 ఇంట‌ర్న‌ల్ ప‌రీక్ష‌లు రాసిన అభ్య‌ర్థులంద‌రికీ స‌ర్టిఫికెట్ల‌ను అంద‌జేయాల‌ని తెలిపారు. ఈనెల 12న అభ్యర్థుల‌కు స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న‌కు సింగరేణి ప్రధాన కార్యాలయంలో హాజ‌రు కావాల‌ని ప్ర‌క‌టించారు.
Issuing certificates for AE candidates
Issuing certificates for AE candidates

సాక్షి ఎడ్యుకేష‌న్: సింగరేణిలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఈ అండ్‌ ఎం) గ్రేడ్‌–2 ఇంటర్నల్‌ అభ్యర్థులకు సంబంధించి సర్టిఫికెట్లను ఈనెల 12న పరిశీలించనున్నట్లు సంస్థ రిక్రూట్‌మెంట్‌ సెల్‌ జీఎం కట్టా బసవయ్య తెలిపారు. సంస్థలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఇంజనీర్‌ 24 పోస్టులకు ఆగస్ట్‌ 6న రాతపరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. పరీక్షకు 573 మంది హాజరుకాగా, 441 మంది క్వాలిఫై అయ్యారని తెలిపారు.

Aptitude Test: ప్రతిభా పరీక్షలో విద్యార్థులు పాల్గొనాలి

అయితే, కొందరు మహిళా అభ్యర్థులు ప్రత్యేక కోటా కేటాయించాలని కోర్టును ఆరఽశయించగా, ఎని మిది పోస్టులు మినహా మిగిలిన 16 పోస్టులకు సంబంధించి ప్రక్రియ చేపట్టవచ్చని ఆదేశించిందని చెప్పారు. దీంతో ఈనెల 12న అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి, వైద్యపరీక్షల అనంతరం నియామకాలు చేపడుతామని జీఎం తెలిపారు. ఇప్పటికే అభ్యర్థులు సెల్‌ ఫోన్లకు మెసేజ్‌ పంపినందున కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని సూచించారు.

Published date : 11 Sep 2023 05:42PM

Photo Stories