Skip to main content

Inspirational Story : పేపర్‌ బాయ్‌గా ప‌నిచేస్తూ చ‌దివా.. నేడు డాక్టరేట్ సాధించా.. మా అమ్మ‌నాన్న కూలీ ప‌నిచేసి..

తెలంగాణ‌లోని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎదుళ్లచెరువు గ్రామానికి చెందిన ఓ కూలీ బిడ్డ నేడు అంద‌రు గ‌ర్వ‌ప‌డేలా..ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ సాధించాడు కాంపాటి రామకృష్ణ.
Ramakrishna Phd Inspirational Story in telugu
Ramakrishna Phd Success Story

కష్టాలు, కన్నీళ్లను అధిగమించిన ఓ కూలీ బిడ్డ ఈ ఘ‌న‌తను సాధించాడు. కడు పేదరికంలో ఆకలితో అలమటించినా విద్యాప్రస్థానాన్ని ఆపకుండా ముందుకు సాగడంతో విజయం వరించింది. పాఠశాల సమయంలో పుస్తకాల కోసం కూలీగా ప‌నిచేశాడు.

ఇవీ చ‌ద‌వండి: ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి.. వ‌రుస‌గా మూడు ఉద్యోగాలతో అద‌ర‌గొట్టిన తెలంగాణ యువ‌కుడు

పేపర్‌ బాయ్‌గా ప‌నిచేస్తూ..
కాంపాటి రామకృష్ణ.. ఇంటర్‌, డిగ్రీ సమయాన పేపర్‌ బాయ్‌గా కూడా పనిచేశాడు.  కాంపాటి రామకృష్ణ తల్లిదండ్రులపై భారం పడకుండా చదువు పూర్తిచేశాడు. తండ్రి వెంక‌న్న‌, త‌ల్లి సుశీల. వీరు కూలీ ప‌ని చేసేవారు. 

రామకృష్ణ పదో తరగతి వరకు పిండిప్రోలులోని పాఠశాల, కళాశాలల్లో, డిగ్రీ ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాలలో, బీఈడీ హైదరాబాద్‌లో పూర్తిచేసి ఓయూ ఆర్ట్స్‌ కళాశాలలో ఎంఏ రాజనీతి శాస్త్రం విభాగంలో పీజీ చదివారు. అనంతరం ఇదే విభాగం నుంచి ’పాలసీ రిఫార్మ్‌స్‌ అండ్‌ థెయిర్‌ ఇంప్లిమెంటేషన్‌ ఇన్‌ ఇండియన్‌ ఎడ్యుకేషన్‌ – కేస్‌ స్టడీ స్కూల్‌, కాలేజీ, యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ ఇన్‌ తెలంగాణ’ అంశంపై సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ పి.ముత్తయ్య పర్యవేక్షణలో పరిశోధనా గ్రంథాన్ని సమర్పించడంతో తాజాగా డాక్టరేట్‌ ప్రకటించింది.

ఇవీ చ‌ద‌వండి: క‌ష్టాల‌ను అధిగ‌మించి.. నాసాలో కొలువు సాధించా... పులివెందుల‌ కుర్రాడు హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌రెడ్డి

వీరి గ్రామం నుంచి డాక్టరేట్‌ సాధించిన మొదటి వ్యక్తి వెంకన్న కావడంతో పలువురు అభినందించారు. ఇక మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఓయూ కేంద్రంగా జర్నలిస్టుగా కూడా ఆయన కీలకపాత్ర పోషించారు.

☛ Inspirational Success Story : ఒక వైపు తండ్రి మ‌ర‌ణం.. మ‌రో వైపు కుటుంబంపై నింద‌లు.. ఈ క‌సితోనే చ‌దివి డీఎస్పీ ఉద్యోగం కొట్టానిలా..

Published date : 09 Aug 2023 11:09AM

Photo Stories