నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
ఇందులో భాగంగా ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్–సర్వీస్, టైలరింగ్–ఎంబ్రాయిడరీ, జర్గొజి, క్విల్ట్ బ్యాగ్స్ తయారీలో ఆరునెలల శిక్షణను అందిస్తున్నారు. ఎలక్ట్రీషియన్, సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్–సర్వీస్ కోర్సుకు ఐటీఐ/డిప్లొమా పాసై ఉండాలి. టైలరింగ్ –ఎంబ్రాయిడరీ, జర్గొజి, క్విల్ట్ బ్యాగ్స్ తయారీకి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18–25 ఏళ్ల మధ్య ఉండాలి. తగిన అర్హతలు, ఆసక్తి గల గ్రామీణ/పట్టణ ప్రాంత అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్, సెల్, పాస్‌పోర్టు ఫొటో లు, ఆధార్‌కార్డు, ఇన్‌కమ్ సర్టిఫికెట్‌తో ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు భువనగిరి జిల్లా, పోచంపల్లి మండలం, జలాల్‌పూర్ గ్రామంలోని స్వామిరామానందతీర్థ గ్రామీణసంస్థకు రావాలని డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలను 91339 08000, 9133908111, 9133908222, 9948466111 ఫోన్‌నంబర్ల ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
చదవండి: