Skip to main content

Permanent Education Number: విద్యార్థులకు శాశ్వత విద్యా సంఖ్య కేటాయించాలి

పాఠశాల విద్యార్థులకు శాశ్వత విద్యా సంఖ్యను కేటాయించాలని ఆదేశించారు డీఈఓ బ్రహ్మాజీరావు..
Permanent Education Number for students in school  DEO Brahmaji Rao announces PEN initiative for students

పాడేరు: పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి శాశ్వత విద్యా సంఖ్య (పీఈఎన్‌) ఉండాలని డీఈవో బ్రహ్మజీరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఒకటవ తరగతి నుంచి అడ్మిషన్‌ సమయంలో శాశ్వత విద్యా నెంబర్‌ విద్యార్థికి కేటాయించాలని, వారి చదువు పూర్తయ్యే వరకు ఆ సంఖ్య ఉంటుందన్నారు.

UPSC Exam: ఈనెల 21న యూపీఎస్‌సీ పరీక్షలు.. అభ్యర్థుల సంఖ్య ఇంత..!

ప్రతి విద్యా సంవత్సరంలో విద్యార్థులపై తరగతులకు ప్రమోట్‌ చేయడం, ఇతర పాఠశాలలకు బదిలీ చేసేందుకు ఈ సంఖ్య ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రికార్డు షీటు, టీసీ, కుల, జనన ధ్రువీకరణ పత్రాల కోసం పట్టుబట్టకుండా ఈ సంఖ్య ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని ఆయన ఎంఈవోలు, హెచ్‌ఎంలకు ఆదేశాలు జారీ చేశారు. భారత ప్రభుత్వం యూడైస్‌ పోర్టల్‌ ద్వారా విద్యా సంఖ్య అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Counselling for Gurukul Admissions: గురుకులంలో 5వ తరగతి ప్రవేశానికి కౌన్సెలింగ్‌..

Published date : 17 Apr 2024 02:34PM

Photo Stories