Skip to main content

Padma Basavanthappa, IAS: స్కూళ్లు, అంగన్‌వాడీల్లో తనిఖీ

శ్రీనివాసపురం: ప్రభుత్వ ఆదేశాల మేరకు తాలూకాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలను పరిశీలిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ పద్మ బసవంతప్ప తెలిపారు.
Padma Basavanthappa, IAS
స్కూళ్లు, అంగన్‌వాడీల్లో తనిఖీ

ఆగ‌స్టు 3న‌ తాలూకాలోని నంబిహళ్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యా ప్రగతి, మౌలిక సౌకర్యాలను ఆమె పరిశీలించి మాట్లాడారు. పాఠశాలలకు అవసరమైన మౌలిక సౌకర్యాల కోసం సీఎస్‌ఆర్‌ నిధులను ఉపయోగించుకోవచ్చన్నారు. తాలూకాలో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కొరతపై ఉన్నతాధికారులపై చర్చించి కొరత లేకుండా చూస్తానన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయుల కొరతపై జాబితాను సిద్ధంచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు.

చదవండి: Education: విద్యారంగ పరిరక్షణకు పీఆర్‌టీయూ కృషి

ప్రస్తుతం ఇతర పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామన్నారు. వచ్చే శనివారం జిల్లాలోని అన్ని జీపీల ఆధ్వర్యంలో స్వచ్ఛత, నైర్మల్య అభియాన్‌ నిర్వహిస్తామన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. ఈసందర్భంగా టీపీ ఏడీ రామప్ప, నంబిహళ్లి జీపీ పీడీఓ మంజునాథ్‌రెడ్డి, కార్యదర్శి ఈశ్వర్‌ పాల్గొన్నారు.

చదవండి: Open School: ‘ఓపెన్‌’ విధానంపై అవగాహన కల్పించాలి

Published date : 04 Aug 2023 01:44PM

Photo Stories