Inspection at School: మున్సిపల్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఫుడ్ కమిషన్ సభ్యుడు
సాక్షి ఎడ్యుకేషన్: విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు శ్రమను ఆయుధంగా మలుచుకుంటే విజయం సొంతమవుతుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి.కాంతారావు విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని కొత్తవలస వద్ద చౌక ధరల దుకాణాన్ని, అంగన్వాడీ కేంద్రం, మున్సిపల్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. కేపీఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన వంటకాల నాణ్యతను పరిశీలించి రుచి చూశారు. విద్యార్థులకు స్వయంగా పదార్థాలను వడ్డించారు.
Uttarakhand Cultural Fest: జాతీయస్థాయి ఫెస్ట్‌లో ఏకలవ్య విద్యార్థి
స్టోర్ రూంలో సరుకుల నిల్వలు, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ జీవితం ఎంతో విలువైనదని, ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని హితవు పలికారు. విద్యార్థి దశలో వాక్పటిమ, భావ వ్యక్తీకరణ నైపుణ్య ఎంతో కీలకమని పేర్కొన్నారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డికి విద్యా రంగం అంటే అమితమైన ప్రేమ ఉందన్నారు. పేదరికం, ఆనారోగ్యంతో ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదనే డృఢమైన సంకల్పంతో ప్రభుత్వం అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, ఉన్నత విద్యలు అభ్యసించేందుకు విదేశీ విద్యా దీవెన, జగనన్న గోరు ముద్ద వంటి బృహత్తర పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.
Javelin Throw: రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో విద్యార్థుల ఎంపిక
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని ఐక్య రాజ్య సమితి సభలో ప్రసంగించడాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆసక్తి కలిగిన రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అర్.శివ ప్రసాద్, డీఎం ఎం.దేవుళ్ల నాయక్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి టి.జగన్‌మోహన్‌రావు, జిల్లా మధ్యాహ్న భోజన పథకం సహాయ సంచాలకుడు పి.దామోదర రావు, జిల్లా ఆహార భద్రత తనిఖీ ఇన్‌స్పెక్టర్ వై.రామయ్య, జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ కె.రత్నరాజు, ప్రధానోపాధ్యాయుడు జి.విశ్వం, ఉపాధ్యాయులు, తదితరులు, పాల్గొన్నారు.