Skip to main content

West Godavari: త్రుటిలో త‌ప్పిన ప్ర‌మాదం

ఆటోలో ప్ర‌యాణిస్తుండ‌గా పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. అటు విద్యార్ధులకు ప్రాణాపాయం త‌ప్పింది, ఇటు ఆటో డ్రైవ‌ర్ త‌న ఆరోగ్యానికి చికిత్స పొందుతున్నారు. అస‌లు ఏం జ‌రిగింది....
college auto luckly missed its accident
college auto luckly missed its accident

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్యార్థులను ఆటోలో కళాశాలకు తీసుకువెళ్తున్న డ్రైవర్‌ ఒక్కసారిగా అపస్మారక స్థితికి వెళ్లాడు. తాను స్పృహ తప్పుతున్న విషయాన్ని గ్రహించిన డ్రైవర్‌ ఆటోను రోడ్డుపక్కన నిలిపివేయడంతో విద్యార్థులకు ప్రమాదం తప్పింది.

NEET Ranker Success Stories : ఒకే ఇంట్లో ముగ్గురికి మెడికల్‌ సీట్లు.. కార‌ణం ఇదే..

ఈ ఘటన పాశర్ల పూడి పంచాయతీకి సమీపంలో మార్కెట్‌ వద్ద గురు వారం జరిగింది. డ్రైవర్‌ బొక్కా శ్రీనివాసరావు తన ఆటోలో అప్పనపల్లి నుంచి ఎనిమిది మంది విద్యార్థులను అమలాపురంలోని కళాశాలలకు తీసుకువెళ్తున్నా డు. ఈ క్రమంలో పాశర్లపూడి చేరుకునే సరికి అతడు అస్వస్థతకు గురయ్యాడు. విషయాన్ని ముందుగానే గ్రహించిన శ్రీనివాసరావు ఆటోను రోడ్డు పక్కన నిలి పి, హ్యాండిల్‌పై కుప్పకూలిపోయాడు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు.

Students Competitions: జయపురం మునిసిపాలిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు

దీనిని గమనించిన స్థానికులు ఆటో డ్రైవర్‌ శ్రీనివాసరావును వెంటనే రాజోలు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అమలాపురంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఆటోలో ఉన్న విద్యార్థులను మరొక ఆటోలో కళాశాలలకు పంపించారు.

Published date : 01 Sep 2023 04:07PM

Photo Stories