Skip to main content

Assessment Survey for Students: పాఠ‌శాల‌ విద్యార్థుల‌కు అభ్య‌స‌న సామ‌ర్థ్య ప‌రీక్ష‌లు మొద‌లు..

నేడు నిర్వ‌హించ‌నున్న స‌ర్వే ప‌రీక్ష‌ల‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయిన‌ట్లు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష‌కు హాజ‌రు కానున్న విద్యార్థుల సంఖ్య‌, ప‌రీక్ష‌ల ఏర్పాట్లు, విధానం గురించి వివ‌ర‌ణ‌ను విడుద‌ల చేశారు. ప‌రీక్ష వివ‌రాలు..
Survey test for school students through OMR sheets ,Test Materials, Details of exam guidelines
Survey test for school students through OMR sheets

సాక్షి ఎడ్యుకేషన్‌: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను గుర్తించేందుకు ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులకు శుక్రవారం పరీక్షలు (సర్వే) నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ అసెస్‌మెంట్‌ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) పేరుతో దేశ వ్యాప్తంగా ఒకేమారు ఈ పరీక్ష నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌ అచీవ్‌మెంట్‌ ఎడ్యుకేషనల్‌ అసెస్‌మెంట్‌ సర్వే (ఎన్‌ఈఏఎస్‌) చేపడుతోంది. జిల్లాలో 1,236 స్కూళ్ల నుంచి 33,937 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

➤   Faculty posts: ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఓఎంఆర్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. 3,6 తరగతుల విద్యార్థులకు తెలుగు/ ఇంగ్లిష్‌, గణితం, పరిసరాల విజ్ఞానం, 9వ తరగతికి తెలుగు/ఇంగ్లిష్‌, గణితం, సోషల్‌, సైన్స్‌ సబ్జెక్టులపై పరీక్ష నిర్వహిస్తారు. 3వ తరగతి విద్యార్థులకు మూడో తరగతి సిలబస్‌పై, 6వ తరగతికి ఐదో తరగతి సిలబస్‌, 9వ తరగతి విద్యార్థులకు 8వ తరగతి సిలబస్‌పై పరీక్ష నిర్వహిస్తారు. 3, 6 తరగతుల విద్యార్థులు 40 ప్రశ్నలు 60 నిమిషాల్లో రాయాలి. 9వ తరగతి విద్యార్థులు 60 ప్రశ్నలకు 90 నిమిషాల్లో పరీక్ష రాయాలి.

➤   Admissions in KNRUHS: కాళోజీ హెల్త్‌ యూనివర్శిటీలో బీపీటీ, బీఎస్సీ అనుబంధ హెల్త్‌ సైన్సెస్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు

ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇన్విజిలేటర్లుగా టీచర్లు కాకుండా డిగ్రీ, పీజీ, డైట్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థులు వ్యవహరిస్తారు. మొత్తం 1236 మందిని ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లుగా నియమించారు. ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున 62 మందిని బ్లాక్‌ లెవెల్‌ కోఆర్డినేటర్లుగా నియమించారు. ఉదయం 10.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. గదిలో సరైన వెంటిలేషన్‌, వెలుతురు, తాగునీరు ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ నాగరాజు ఆదేశించారు. ఇన్‌స్టిట్యూట్‌ హెడ్‌, ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌ ఇద్దరూ పాఠశాల/తరగతిలో మొత్తం సర్వేకు బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు.
 

Published date : 03 Nov 2023 02:48PM

Photo Stories