Skip to main content

పాస్‌కాని అభ్యర్థులకు మరో అవకాశం.. షెడ్యూల్‌ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: కొన్నేళ్లుగా పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిచింది.
Polytechnic examination
పాస్‌కాని అభ్యర్థులకు మరో అవకాశం.. షెడ్యూల్‌ ఇదే..

1990 నుంచి ఇప్పటి వరకు ఫెయిలైన వారికి ప్రత్యేక పరీక్ష నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. ఇలాంటి వారికి 2023 జూన్‌లో పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్‌ సి.శ్రీనాథ్‌ తెలిపారు. పరీక్షలకు హాజరయ్యేందుకు రుసుము చెల్లింపు షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు. అభ్యర్థులు రూ.3వేలు పరీక్ష ఫీజుగా, ఏప్రిల్‌ 10 వరకు చెల్లించవచ్చని తెలిపారు. రూ.400 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 14 వరకు, తాత్కాల్‌ స్కీం కింద పరీక్ష రుసుముతో పాటు మరో రూ.6వేలు అదనంగా కలిపి ఏప్రిల్‌ 15 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. 

చదవండి: Polycet 2023: పరీక్ష తేదీ ఇదే.. ప్రిపరేషన్‌ టిప్స్‌ మీకోసం

ఇక ఇండ్రస్టియల్‌ అసెస్‌మెంట్‌ ఫీజుగా రూ.3వేలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మూడేళ్ల వ్యవధి గల ఈ కోర్సును గరిష్టంగా 6 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సిలబస్‌ను మార్చడంతో సప్లిమెంటరీ పరీక్షలు రాసుకునే అవకాశం లభించడం లేదు. కొన్నిసార్లు మానవతా దృక్పథంతో ప్రభుత్వం ప్రత్యేక అనుమతినిస్తుంది. ఇలా ఈసారి 1990 నుంచి 2018 వరకు అభ్యర్థులు ఫెయిలైన సబ్జెక్టులకు పరీక్షలు రాసుకునే అవకాశాన్నిచ్చారు. వీరికి మూడు సబ్జెక్టుల నుంచి మినహాయింపునిచ్చారు. 

చదవండి: RGUKT: పాత పద్ధతిలోనే ప్రవేశాలు

Published date : 09 Mar 2023 01:50PM

Photo Stories