Skip to main content

Central Govt Scholarships: ‘సెంట్రల్‌ సెక్టార్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌’ నోటిఫికేషన్‌ను విడుదల.. ఎవరు అర్హులంటే..

కేంద్ర ప్రభుత్వం.. కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘సెంట్రల్‌ సెక్టార్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఏటా మొత్తం 82,000 మంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తారు. వీటిలో 50 శాతం మహిళలకు కేటాయించారు.
central sector scholarship scheme details

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 80 శాతం మార్కులతో ఇంటర్‌/12వ తరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఏఐసీటీఈ/మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా/యూనివర్శిటీ/గుర్తింపు పొందిన కళాశాలల్లో డిగ్రీ లేదా పీజీ కోర్సులు చదువుతూ ఉండాలి. కు­టుంబ వార్షిక ఆదాయం నాలుగున్నర లక్షలకు మించకూడదు. డిగ్రీ, పీజీ, మెడిసిన్, ఇంజనీరింగ్‌ కోర్సులు చేస్తున్న విద్యార్థులు అర్హులు.
స్కాలర్‌షిప్‌: ఒక్కో విద్యార్థికి ఐదేళ్ల వరకు ఉపకార వేతనం అందిస్తారు. డిగ్రీ స్థాయిలో మూడేళ్ల పాటు ఏటా రూ.12,000, పీజీ స్థాయిలతో రెండేళ్ల పాటు ఏటా రూ.20,000 చెల్లిస్తారు. బీఈ/బీటెక్‌ కోర్సుల్లో చేరినవారికి మొదటి మూడేళ్లు ఏటా రూ.12,000, చివరి ఏడాది, రూ.20,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.12.2023

వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/

చ‌ద‌వండి: Govt Scholarships: ప్రగతి స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ 2023.. ఏడాదికి రూ.50000 స్కాలర్‌షిప్‌‌..

Last Date

Photo Stories