Skip to main content

BLV CET 2023: టీఎస్‌డబ్ల్యూఆర్, టీటీడబ్ల్యూఆర్‌.. బీఎల్‌వీసెట్‌-2023

తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి ప్రకటన వెలువడింది. ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Tribal Welfare Residential Educational Institutions Societies

ప్రవేశ పరీక్ష వివరాలు: తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీస్‌ బ్యాక్‌లాగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023.
కరీంనగర్‌(అల్గనూర్‌), గౌలిదొడ్డి(రంగారెడ్డి)లోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు ఉంటాయి. రఘునాథపురం(ఖమ్మం), పరిగి(వికారాబాద్‌ జిల్లా)లోని స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో ఎనిమిదో తరగతి ప్రవేశాలు ఉంటాయి. 

అర్హత: తరగతిని బట్టి ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ/ఎయిడెడ్‌ /నాన్‌-ఎయిడెడ్‌/గుర్తింపు పొంది, ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఎనిమిదో తరగతి చదువుతూ ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షన్నర(గ్రామీణ ప్రాంతం), ఈ రెండు లక్షలు(పట్టణ ప్రాంతం) మించకూడదు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.03.2023.
పరీక్ష తేది: 16.04.2023.

వెబ్‌సైట్‌: https://tgtwgurukulam.telangana.gov.in/

GPAT 2023 Notification: గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీప్యాట్‌)-2023

Last Date

Photo Stories