Skip to main content

MBA admission in NIT: NIT Jalandharలో ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు.. గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ తేది ఇదే..

జలంధర్‌లోని డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌) డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హ్యుమానిటీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌.. 2024–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫుల్‌టైమ్‌ మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌–అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ)–సెషన్‌ జూలై–2024 ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
MBA admission in NIT Jalandhar and Admission Process  Dr. B. R. Ambedkar National Institute of Technology Jalandhar campus

మొత్తం సీట్ల సంఖ్య: 38.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం) లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: క్యాట్‌/సీమ్యాట్‌/మ్యాట్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ స్కోరు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.05.2024
గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ తేది: 25.05.2024

వెబ్‌సైట్‌: https://www.nitj.ac.in/

చదవండి: Admissions in IIT Gandhinagar: ఐఐటీ గాంధీనగర్‌లో ఎంటెక్‌ ప్రవేశాలు.. నెలకు రూ.12,400 స్కాలర్‌షిప్‌..

Published date : 16 Apr 2024 05:27PM

Photo Stories