Skip to main content

TSPSC Polytechnic Lecturer notification: మీరూ అవుతారా.. పాలిటెక్నిక్‌ లెక్చరర్‌!

అధ్యాపక వృత్తిలో స్థిరపడాలనుకునే ప్రతిభావంతులకు చక్కటి అవకాశం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ).. రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 247 లెక్చరర్‌ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీటెక్, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీతో పోటీపడొచ్చు. ఎంపికైతే ప్రారంభంలోనే.. నెలకు రూ.56వేలకు పైగా వేతనం అందుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. టీఎస్‌పీఎస్సీ పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టుల వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం తదితర సమాచారంతో ప్రత్యేక కథనం..
TSPSC Polytechnic Lecturer notification
  • పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 247 లెక్చరర్‌ పోస్ట్‌లకు నోటిఫికేషన్‌
  • బీటెక్, పీజీ స్పెషలైజేషన్‌ అర్హతతో పోటీ పడే అవకాశం
  • కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
  • మే లేదా జూన్‌లో పరీక్ష నిర్వహించే అవకాశం

19 సబ్జెక్ట్‌లు.. 247 పోస్ట్‌లు

తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 19 సబ్జెక్ట్‌ల్లో మొత్తం 247 లెక్చరర్‌ పోస్ట్‌ల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టీఎస్‌పీఎస్సీ ఇటీవల బీటెక్‌ అర్హతతో ఏఈ, ఏఈఈ పోస్ట్‌లకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వాటికి సన్నద్ధమవుతున్న వారు.. అదే ప్రిపరేషన్‌తో పోటీ పడే మరో చక్కటి అవకాశంగా ఈ పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ నోటిఫికేషన్‌ను పేర్కొనొచ్చు. 

అర్హతలు

  • ఆయా బ్రాంచ్‌లతో బీటెక్‌ లేదా సంబంధిత సబ్జెక్ట్‌ స్పెషలైజేషన్‌తో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 
  • వయసు: జూలై 1, 2022 నాటికి 18-44 ఏళ్లు(జూలై 2,1978-జూలై 1, 2004 మధ్యలో జన్మించి ఉండాలి). రిజర్వేషన్‌ వర్గాలకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది.
  • వేతన శ్రేణి: లెవల్‌-9ఎ: 56,100-రూ.1,77, 500; లెవల్‌-10: రూ.57,700-రూ.1,82,400.

చ‌ద‌వండి: TSPSC Jobs Notification 2022: 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

రాత పరీక్ష ఆధారంగా

పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్ట్‌లకు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ, పొందిన మార్కులు, రిజర్వేషన్లు, పోస్ట్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని తుది విజేతల జాబితా రూపొందిస్తారు. రాత పరీక్షలో విజయం సాధించిన వారు నిర్దేశిత తేదీల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది.

రెండు పేపర్లుగా రాత పరీక్ష

  • రాత పరీక్షను రెండు పేపర్లుగా మొత్తం 450 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌ 1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌ 150 ప్రశ్నలు-150 మార్కులకు ఉంటుంది. అలాగే పేపర్‌ 2 సంబంధిత సబ్జెక్ట్‌ పేపర్‌ 150 ప్రశ్నలు-300 మార్కులకు జరుగుతుంది. ఈ రెండు పేపర్లను పూర్తిగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా నిర్వహిస్తారు.
  • అభ్యర్థులు పేపర్‌-1ను తెలుగు లేదా ఇంగ్లిష్‌ మీడియంలో, పేపర్‌-2ను ఇంగ్లిష్‌ మీడియంలో రాయాల్సి ఉంటుంది. పేపర్‌-2లో ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌తో విజయం

పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్ట్‌లకు పోటీ పడే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో పూర్తి స్థాయిలో అవగాహన పొందడం ద్వారా ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంది. 

జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీ

  • పేపర్‌-1గా పేర్కొన్న జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీలో.. అభ్యర్థులు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా అంతర్జాతీయ సంబంధాలు, పరిణామాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
  • జనరల్‌ సైన్స్‌కు సంబంధించి ఇటీవల కాలంలో దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతి, తాజా పరిస్థితులు, రక్షణ రంగంలో ప్రయోగాలు, ఇస్రో ప్రయోగాలు తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
  • పర్యావరణ అంశాలకు సంబంధించి విపత్తు నిర్వహణ, నివారణ వ్యూహాలపై అవగాహన పెంచుకోవాలి.
  • భారత్, తెలంగాణకు సంబంధించి ఆర్థిక, సామాజిక అభివృద్ధిపై దృష్టి సారించాలి. తాజాగా అమలవుతున్న అభివృద్ధి పథకాలను తెలుసుకోవాలి.
  • తెలంగాణ ప్రాంత భౌగోళిక స్వరూపం, విశిష్టతలు తెలుసుకోవాలి. చరిత్రకు సంబంధించి తెలంగాణ, భారత చరిత్రలను అభ్యసనం చేయాలి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన చరిత్రపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తెలంగాణ తొలి ఉద్యమ దశ నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు పలు ముఖ్యమైన అంశాలను ఔపోసన పట్టాలి. వీటితోపాటు తెలంగాణ సంస్కృతి, సామాజిక పరిస్థితులు, కళలు, సాహిత్యం వంటి అంశాలను కూడా చదవాలి.
  • అనలిటికల్‌ ఎబిలిటీ విషయంలో గ్రాఫ్స్, డేటా అనాలిసిస్‌ అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి.
  • వీటితోపాటు భారత రాజ్యాంగం, ప్రభుత్వ పాలన విధానం, భారత భౌగోళిక శాస్త్రంలోని ముఖ్యమైన అంశాలను చదవాలి.
  • పదో తరగతి స్థాయిలో ఇంగ్లిష్‌ గ్రామర్‌ను అధ్యయనం చేయాలి.

 

పేపర్‌-2కు ఇలా

  • ఆర్కిటెక్చరల్‌ ఇంజనీరింగ్‌: బేసిక్‌ డిజైన్, బిల్డింగ్‌ మెటీరియల్స్, బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్, ఇంజనీరింగ్‌ మెకానిక్స్, ఆర్కిటెక్చరల్‌ డ్రాయింగ్‌ అండ్‌ గ్రాఫిక్స్, ఇంట్రడక్షన్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, హిస్టరీ ఆఫ్‌ ఆర్కిటెక్చర్, సర్వేయింగ్‌ అండ్‌ సైట్‌ స్టడీస్‌ తదితర అంశాలు.
  • ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌: హీట్‌ ట్రాన్స్‌ఫర్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, ఆటోమొబైల్‌ పవర్‌ ప్లాంట్స్, స్ట్రెంగ్త్‌ ఆఫ్‌ మెటీరియల్స్, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ అండ్‌ హైడ్రాలిక్‌ మెషినరీ, ఆటోమొబైల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఆటోమొబైల్‌ ఛాసిస్‌ అండ్‌ బాడీ ఇంజనీరింగ్, ఆటోమొబైల్‌ ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్స్, ఆటోమొబైల్‌ ఎలక్ట్రికల్‌ సిస్టమ్స్, మెటీరియల్‌ సైన్స్, కైనమాటిక్స్‌ అండ్‌ డైనమిక్స్‌ ఆఫ్‌ మెషీన్స్‌ తదితర అంశాలు.
  • బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌: రెస్పిరేటరీ మెజర్‌మెంట్స్‌ అండ్‌ ఎయిడ్, వెంటిలేటర్స్, ఆడియోమెట్రీ, ఎలక్ట్రో సర్జికల్‌ ఎక్విప్‌మెంట్స్, మెథడ్స్‌ ఆఫ్‌ కెమికల్‌ అనాలిసిస్‌ తదితర అంశాలు.
  • కెమికల్‌ ఇంజనీరింగ్‌: ఫ్లూయిడ్‌ మెకానిక్స్, హీట్‌ ట్రాన్స్‌ఫర్, మాస్‌ ట్రాన్స్‌ఫర్, రియాక్షన్‌ ఇంజనీరింగ్, థర్మోడైనమిక్స్, మెకానికల్‌ ఆపరేషన్స్, ప్రాసెసింగ్‌ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ తదితర అంశాలు.
  • సివిల్‌ ఇంజనీరింగ్‌: బిల్డింగ్‌ మెటీరియల్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్, సర్వేయింగ్, కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్స్‌ అండ్‌ ప్రాక్టీస్, ఇంజనీరింగ్‌ మెకానిక్స్‌ అండ్‌ స్ట్రెంగ్త్‌ ఆఫ్‌ మెటీరియల్స్, హైడ్రాలిక్స్, క్వాంటిటీ సర్వేయింగ్, డిజైన్‌ ఆఫ్‌ స్ట్రక్చర్స్, ఇరిగేషన్‌ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లోని అంశాలు.
  • ఈఈఈ: ఎలక్ట్రిక్‌ సర్క్యూట్స్‌ అండ్‌ ఫీల్డ్స్, ఎలక్ట్రికల్‌ మెషీన్స్,పవర్‌ సిస్టమ్స్,కంట్రోల్‌ సిస్టమ్స్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మెజర్‌మెంట్, అనలాగ్‌ అండ్‌ డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్, పవర్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్‌ డ్రైవ్స్, యుటిలైజేషన్‌ అంశాలు.
  • ఈసీఈ: ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్, నెట్‌వర్క్స్, డిజిటల్‌ సర్క్యూట్స్, కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన అన్ని అంశాలు.
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌: అనలాగ్‌ ఎలక్ట్రానిక్స్,డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మెజర్‌మెంట్స్, ప్రాసెస్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంట్రోల్‌ సిస్టమ్‌ అండ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ తదితర అంశాలు.
  • జియాలజీ: జియో మార్ఫాలజీ అండ్‌ ఫీల్డ్‌ జియాలజీ, క్రిస్టలోగ్రఫీ, మినరాలజీ అండ్‌ ఆప్టికల్‌ మినరాలజీ, స్ట్రక్చరల్‌ జియాలజీ, అండ్‌ జియోటెక్టానిక్స్, జియో కెమిస్ట్రీ, మెటామార్ఫిక్‌ పెట్రోలజీ అండ్‌ థర్మోడైనమిక్స్, సెడిమెంటాలజీ అండ్‌ పెట్రోలియం జియాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ జియాలజీ, హైడ్రో జియాలజీ తదితర అంశాలు.
  • మెకానికల్‌ ఇంజనీరింగ్‌: అప్లైడ్‌ మెకానిక్స్‌ అండ్‌ డిజైన్, థర్మల్‌ ఇంజనీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ మెకానిక్స్‌ అండ్‌ స్ట్రెంగ్త్‌ ఆఫ్‌ మెటీరియల్స్, మెషీన్‌ డిజైన్, ఇంజనీరింగ్‌ మెటీరియల్స్, హైడ్రాలిక్స్‌ అండ్‌ హైడ్రాలిక్స్‌ మెషినరీ, ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ తదితర అంశాలు.
  • మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌: మినరల్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ ప్రిన్స్‌పుల్స్, ఫిజికల్‌ మెటలర్జీ అండ్‌ హీట్‌ ట్రీట్‌మెంట్, మెటలర్జికల్‌ థర్మోడైనమిక్స్, మెకానికల్‌ మెటలర్జీ, ఐరన్‌ అండ్‌ స్టీల్‌ మేకింగ్, నాన్‌-ఫెర్రస్‌ ఎక్స్‌ట్రాక్టివ్‌ మెటలర్జీ, మెకానికల్‌ వర్కింగ్‌ ఆఫ్‌ మెటల్స్, పౌడర్‌ మెటలర్జీ ఆఫ్‌ మెటల్స్, నాన్‌-మెటాలిక్‌ మెటీరియల్స్, మెటీరియల్‌ ప్రాసెసింగ్, ఫర్నేస్‌ టెక్నాలజీ, నాన్‌ డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌ వంటివి.
  • ఫార్మసీ: హిస్టరీ ఆఫ్‌ ఫార్మసీ, ఫార్మసీయాక్ట్, మెథడ్స్‌ ఆఫ్‌ స్టెరిలైజేషన్, మెథడ్స్‌ ఆఫ్‌ క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ క్రూడ్‌ డ్రగ్స్,సెకండరీ మెటబాలిక్స్, డ్రగ్‌ డిస్కవరీ అండ్‌ క్లినికల్‌ ఎవాల్యుయేషన్‌ ఆఫ్‌ న్యూ డ్రగ్స్, ఫార్మకాలజీ సంబంధిత అంశాలు.
  • ఫిజిక్స్‌: మ్యాథమెటికల్‌ మెథడ్స్‌ ఆఫ్‌ ఫిజిక్స్, క్లాసికల్‌ మెకానిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ థియరీ, క్వాంటమ్‌ మెకానిక్స్, థర్మోడైనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అటామిక్‌ అండ్‌ మాలిక్యులర్‌ ఫిజిక్స్, కండెన్స్‌డ్‌ మ్యాటర్‌ ఫిజిక్స్, న్యూక్లియర్‌ అండ్‌ ప్రాక్టీస్‌ ఫిజిక్స్‌లోని మొదలైన అంశాలు.

అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌

ప్రిపరేషన్‌ సమయంలో అభ్యర్థులు అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో ముందుకు సాగాలి. ముఖ్యంగా పేపర్‌-2 సబ్జెక్ట్‌లకు సంబంధించి బీటెక్‌ స్థాయిలోని అకడమిక్‌ పుస్తకాలను ఆలంబనగా చేసుకుని ప్రిపరేషన్‌ సాగించాలి. మోడల్‌ పేపర్లు, మాక్‌ టెస్ట్‌లు రాయడం కూడా పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపేందుకు దోహదం చేస్తుంది. ప్రిపరేషన్‌ను అప్లికేషన్‌ అప్రోచ్‌తో సాగించాలని, దీనివల్ల ప్రాక్టికల్‌ థింకింగ్‌ అలవడి, ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇవ్వగలిగే నేర్పు లభిస్తుందని సూచిస్తున్నారు. టీఎస్‌పీఎస్‌సీ గతంలో నిర్వహించిన ఏఈ, ఏఈఈ తదితర ఇంజనీరింగ్‌ విభాగాల నియామక పరీక్షల ప్రశ్న పత్రాలను సాధన చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: డిసెంబర్‌ 14 నుంచి 2023,జనవరి 4 వరకు
  • పరీక్ష తేదీ: 2023 మే లేదా జూన్‌లో నిర్వహించే అవకాశం.
  • పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, హనుమకొండ, నిజామాబాద్‌.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://tspsc.gov.in

 

చ‌ద‌వండి: TSPSC Group 4 Notification: 9,168 గ్రూప్‌-4 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 04,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories