Skip to main content

Tech Layoffs: అసలేం జరుగుతోంది.. ఒకే నెల‌లో ఇంత మంది టెకీలు ఇంటికా..!

ఈ సంవ‌త్స‌రంలో కూడా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు భారీగానే కొనసాగుతూనే ఉన్నాయి.
 Layoffs.fyi Reports 32,000 Jobs Lost  Tech Layoffs Continue To Hit Industry With 32000 Job Cuts In 2024   Tech Industry Job Cuts

ఇప్పటి వరకు ఏకంగా 32,000 మంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు లేఆఫ్స్.ఫ్లై (Layoffs.fyi) డేటాలో వెల్లడించింది. 
తాజాగా స్నాప్ ఇన్ (Snap Inc) కంపెనీ 10 శాతం మంది ఉద్యోగులను (540 మంది) తగ్గించినట్లు ప్రకటించింది. దీనితో పాటు ఓక్టా ఇన్(Okta Inc )  సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా ఈ నెల ప్రారంభంలోనే ఖర్చులను తగ్గించుకోవడానికి సిబ్బందిలో ఏకంగా 7 శాతం మంది ఉద్యోగులను (400 మంది) తగ్గించింది. 

అమెజాన్, సేల్స్ ఫోర్స్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు సైతం 2024లో ప్రారంభం నుంచి సిబ్బందిని తొలగిస్తూనే ఉన్నాయి. ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకోవడం మాత్రమే కాదు, ఏఐ వంటి టెక్నాలజీలను ఉపయోగించుకోవడానికి కూడా.. అని స్పష్టమవుతోంది.

Work From Home: రెబల్‌గా మారుతున్న ఐటీ ఉద్యోగులు.. వర్క్ ఫ్రమ్ హోమ్ కావాల్సిందే.. లేదంటే ఉద్యోగమైనా వదిలేస్తాం..!

 
ప్రస్తుతం చాలా కంపెనీలు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) ఉపయోగించుకోవడానికి.. ఇందులో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడానే సుముఖత చూపుతున్నాయి. దీంతో కొత్త నియమాల సంఖ్య తగ్గడమే కాకుండా.. ఉన్న ఉద్యోగులను కూడా ఇంటికి పంపిస్తోంది. 
ఊడుతున్న ఉద్యోగాల సంగతి పక్కన పెడితే.. ఏఐ టెక్నాలజీలో నైపుణ్య కలిగిన లేదా ప్రస్తుతం వినియోగంలో ఉన్న టెక్నాలజీలలో నైపుణ్యాని కలిగిన ఉద్యోగులకు డిమాండ్ అధికంగా ఉంది. ఈ కారణంగానే గత డిసెంబర్ నుంచి జనవరి వరకు పలు కంపెనీలు 2000 మంది ఉద్యోగులను నియమించుకున్నాయి. దీంతో ఏఐ నైపుణ్యం కలిగిన ఉద్యోగుల సంఖ్య 17479కి చేరినట్లు తెలుస్తోంది.

Tech Layoffs: ఐటీ ఉద్యోగుల గుండెల్లో గుబులు.. తొలగింపుల్లో స్పీడు పెంచిన టెక్ కంపెనీలు ఇవే..!

Published date : 06 Feb 2024 12:50PM

Photo Stories