Skip to main content

Apprentice Mela: 23న ఐటీఐలో అప్రెంటిషిప్‌ మేళా

Apprentice Mela at ITI on 23 August

వరంగల్‌: వరంగల్‌ ములుగురోడ్డు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 23న హైదరాబాద్‌కు చెందిన మేధా సర్వో డ్రైవ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అప్రెంటిషిప్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఎల్‌.జుమ్లనాయక్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రీషియన్‌లో 150, ఫిట్టర్‌లో 150, ఎలక్ట్రానిక్‌ (మెకానిక్‌)లో 50, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌లో 40 ఖాళీలు ఉన్నట్లు, స్టయిఫండ్‌ నెలకు రూ.13,500లు చెల్లిస్తారని పేర్కొన్నారు. 18 నుంచి 25 ఏళ్లు గల విద్యార్థులు అర్హులని, అప్రెంటిషిప్‌ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు ఉంటాయని తెలిపారు.

చదవండి: Andhra Pradesh Govt Jobs: 2,635 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

Published date : 22 Aug 2023 03:26PM

Photo Stories