Skip to main content

JoSAA counselling 2023: ప్రారంభ‌మైన‌ జోసా కౌన్సెలింగ్‌... ఆప్ష‌న్లు ఇలా ఇచ్చుకోండి

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్‌, బ్యాచులర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్సీ), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) జూన్ 7న‌ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
JoSAA counselling
JoSAA counselling

మొత్తం ఆరు విడతల కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. జూన్ 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల కావ‌డంతో నేటి నుంచి (జూన్ 19) కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఐఐటీ గువాహటి నిర్వహించగా...సీట్ల భర్తీ కూడా ఆ సంస్థే చేపడుతోంది. 

JEE Advanced 2023 Top 10 Rankers : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్ ఇదే..

josaa

జులై 26న చివరి విడత సీట్లను కేటాయిస్తారు. ఆ తర్వాత ఐఐటీలు మినహా మిగిలిన విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రత్యేకంగా సెంట్రల్‌ సీట్‌ అలకేషన్‌ బోర్డు (సీశాబ్‌) ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సెలింగ్‌ జరుపుతారు. గత ఏడాది 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ ఐటీలు, 30 కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో సీట్లను జోసా కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేశారు. 

              JoSAA counselling 2023 డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి

జూన్‌ 19 - 27: నమూనా కౌన్సెలింగ్‌. దానివల్ల తాము ఇచ్చిన ఐచ్ఛికాలతో ఎక్కడ సీటు రావొచ్చో అంచనా వస్తుంది. దాన్నిబట్టి మళ్లీ ఆప్షన్లు మార్చుకోవచ్చు.

☛ జేఈఈ అడ్వాన్స్‌డ్-2023 ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

జూన్‌ 28: రిజిస్ట్రేషన్‌, ఆప్షన్లు ఇచ్చుకోవడం.. 30వ తేదీన తొలి రౌండ్‌ సీట్ల కేటాయింపు.. జులై 6న  2వ, 12న 3వ, 16న 4వ, 21న 5వ, 26వ తేదీన 6వ రౌండ్‌ సీట్ల కేటాయింపు.

josaa

జోసా కౌన్సెలింగ్‌ తర్వాతే ఎంసెట్‌ చివరి విడత...
జోసా కౌన్సెలింగ్‌తో పాటు ఎన్‌ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్ల భర్తీ ప్రక్రియ కూడా జులై 31న ముగియనున్నందున ఈసారి ఎంసెట్‌ విద్యార్థులకు కూడా ఇబ్బంది ఉండే అవ‌కాశం లేదు. ఎంసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. ఆ ప్రకారం చివరి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగస్టు 2వ తేదీ నుంచి మొదలవుతుంది. అప్పటికే ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలు పూర్తవుతాయి. దీంతో చాలా వరకు ఈసారి ఇబ్బందులు తప్పుతాయని ఎంసెట్‌ అధికారులు భావిస్తున్నారు.

☛ జేఈఈ అడ్వాన్స్‌డ్-2023 ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి

Published date : 19 Jun 2023 03:56PM

Photo Stories