Skip to main content

APPSC Group 2 Prelims Exam Cut Off Marks 2024 : గ్రూప్‌-2 ప్రిలిమ్స్ క‌టాఫ్ ఇంతేనా..? ఈ సారి..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష నిర్వ‌హించింది. అయితే ప‌రీక్ష రాసిన చాలా మంది అభ్య‌ర్థులు పేప‌ర్ చాలా క‌ష్టంగా వ‌చ్చిందంటున్నారు.
Group-2 Preliminary Examination   APPSC Group 2 Prelims Exam Cut Off Marks 2024   Andhra Pradesh Public Service Commission

అలాగే ఈ సారి క‌టాఫ్ మార్కులు కూడా చాలా త‌క్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు విశ్లేష‌ణ ప్ర‌కారం 40-45 మార్కుల‌ మ‌ధ్య‌లో Cut Off ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.

☛ APPSC Group 2 Prelims 2024 Official Key 2024 PDF : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 కీ విడుద‌ల‌.. ఈ ప్ర‌శ్న‌ల‌కు మాత్రం..

ఈ పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోగా 4,04,037 మంది అంటే.. (87.17) శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఏపీపీఎస్సీ గతంలో నిర్వహించిన పరీక్షలకు గరిష్టంగా 68–70 శాతం వరకు మాత్రమే హాజరయ్యేవారు. ఈ రికార్డులను బద్దలు కొడుతూ ఈసారి గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌కు అత్యధికంగా హాజరవడం విశేషం. గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ ఫలితాలను 5 నుంచి 8 వారాల్లో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్‌ కుమా­ర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ లేదా జూలైలో గ్రూప్‌–2 మెయిన్స్‌ నిర్వహిస్తామని వెల్లడించారు.

Published date : 27 Feb 2024 10:35AM

Photo Stories